Powered By Blogger

Friday, 10 January 2014

రుధిర సౌధం 46భూపతి గారూ ... మమ్మల్ని అడ్డుకొంటే మీరూ నేరస్థులే అవుతారు .. జరుగుతున్నా హత్యలని మాఫీ చేసి నట్లు

అవుతుంది ... ఇది మీ వూరి వ్యవహారం మాత్రమె కాదు ... సామాన్య ప్రజల వ్యవహారం ... ఎవరైనా ఎక్కడ వారైన

కళ్ళెదుట అన్యాయం జరుగుతున్నపుడు దానిని ప్రస్నించవచ్చు ... ఫిర్యాదు చేయవచ్చు . కాబట్టి మీ

అత్యుత్సాహాన్ని కాదన్నందుకు క్షమించండి ... ఈ హత్య పట్ల విచారణ జరగటం అవసరం . అన్నాడు యశ్వంత్ ...

బాబూ ... నిజం గా మీరు చెప్పిన వన్నీ నిజాలే ఐతే ... విచారణ జరిపించండి ... ఆడు నా మొగుడు ... నేనే

చెబుతుండా ... అంటూ గుంపు లోంచి ఓ యువతి ఏడుస్తూ అంది ...

భూపతి ఆమె వైపు కోపం గా చూసాడు ...

ఆమె ని ఆశ్చర్యం గా ... చూసి .. "సరస్వతి "... అని

ఉచ్చారించాయి రచన పెదవులు .

ఆమె సరస్వతి ... నా చిన్నప్పటి ఫ్రెండు ... ఆమె మొగుడే ... ఆ

చనిపోయిన రాముడు ... రచన చెవిలో గొణిగాడు

రత్నం .

అయ్యో ... యితడు సరస్వతి భర్తా ... అని బాధ గా ఆమె వైపు

 చూసింది రచన .

శివా ... నువ్వెళ్ళి పోలీసులని పిలుచుకురా ... అన్నాడు యశ్వంత్ ...

భూపతి కోపం గా...  రత్నం ... పద .. ఇక్కడ్నించి ... అని రత్నం రాజు ని గద్దించాడు ..

యశ్వంత్ మీద కోపాన్ని అతడు కొడుకు పై చూపాడు ..

ధాత్రీ ... వెళదామా ? అన్నాడు రత్నం రాజు ..

మీరు వెళ్ళండి .. నేను తర్వాత వస్తాను ... అంది రచన .

భూపతి ,రత్నం రాజు అక్కడ్నించి వెళ్ళిపోయారు ....

రచన ఏడుస్తున్న సరస్వతి దగ్గర కి వెళ్లి ఆమె భుజం పై చేయి వేసింది ...

ఆమె ధాత్రి ని చూసి భోరుమంది ...

ఏడవకు సరస్వతీ ... ఏడవకు ... నువ్వు విచారణ కి అంగీకరించి చాలా మంచి పని చేసావు ... అంది రచన .

ఏడుస్తూనే తల ఊపిన్ది సరస్వతి .

బాబూ ... మీరు చెప్పినట్లు వారందరూ రావటానికి చాలా సమయం పడుతుంది ... అంతవరకూ శవాన్ని ఇలానే

ఉంచటం అంత మంచిది కాదు ... జనం లోంచి ఒక పెద్ద మనిషి అన్నాడు .

చూడండి పెద్దాయనా ... శవం కంపు గొడుతుందని .. మీరెన్ని శవాలని కాల్చేసారో .. నాకు తెలీదు ... నాకు

సంభందించి ఇది ఓ నిజం .. ఈ నిజాన్ని కాల్చేయటం .. అభాద్ధాన్ని బతక నివ్వటం .. మంచిది కాదు కదా ... నిజం

గా  ఈ హత్య మీరందరూ అనుకుంటున్నఆ దెయ్యం చేయక పోయుంటే ... ఒక్క క్షణం ఆలోచించండి .. ఇతడి

మరణం... ఈ ఊరికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తుందేమో ... మమ్మల్ని ప్రయత్నించ నివ్వండి .. అన్నాడు యశ్వంత్

జనం నుండి మరెవ్వరూ మాట్లాడలేదు .. మెల్లిగా ఒక్కరొక్కరుగా జనం అక్కడ నుండి వెళ్ళిపోయారు ...

మధ్యాహ్నం అయ్యేసరికి ... అక్కడ సరస్వతి ,రచన,యశ్వంత్ లే మిగిలారు ..

రచన ఏడుస్తున్న సరస్వతి ని ఓదార్చు తూనే ఉంది ...

మీరన్న మాటలు నేను నమ్ముతాను బాబూ ... దెయ్యం మా ఆయన్ని చంపదు ... మా ఆయన్ని ... కుట్ర తో

చంపెసినారు   .... అంది సరస్వతి మాటలు కూడ బలుక్కుంటూ ...

సరస్వతీ ... ఎవరు కుట్ర చేస్తారు ? మీకేవరన్నాశత్రువులున్నారా   ? అడిగాడు యశ్వంత్ .

మెల్లిగా అన్న దామె ... ఈ మధ్య మా ఆయన భూపతి తో ఏదో విషయంల గొడవ పడినాడు బాబూ .. అంది

సరస్వతి ..

గొడవ  పడితే చంపేస్తాడ ? అదే0 అయ్యుండదు సరస్వతి .. అంది రచన .

లేదమ్మా ... భూపతి తన మాట చెల్లడానికి ఏదన్న జేస్తడు ... అంది సరస్వతి .

అంటే .... నీ అనుమానం భూపతి మీదా ... ? అన్నాడు యశ్వంత్ .

అవునయ్యా ... కాని నేను పోలిసుల కాడ ఏమి చెప్పగలను ? చెబితే మల్లి అమాస కి ఇక్కడ నా శవం ఉంటాదేమో

అంది భయం గా సరస్వతి .

భయపడకు సరస్వతి ... నీకు మేము తోడుగా ఉన్నాం .. అన్నాడు యశ్వంత్ .

                                                            *****************************

(ఇంకా ఉంది ) 

No comments: