స్వామీజీ ... మీ కృప తో తలచిన కార్య మంతా సఫల మయింది . అమావాస్య రాత్రి గడచింది ... రచన కి గండం
తప్పింది ... ఇక నాకు నిశ్చింత .. అంది గిరిజ .
చిన్నగా నవ్వి చూడమ్మా ... దైవం ను మించిన శక్తి ఏదీ లేదు ఈ లోకం లో ... కానీ ఆ దైవాన్ని కూడా కట్టి
పడేయగల శక్తి మానవ సత్సంకల్పానిది . రచన తన తండ్రి కోరిక మాత్రమె నెరవేర్చాలని అనుకోవడం లేదు .. ఆ
ఊరికి కూడా మంచి జరగాలనే సత్సంకల్పం తో ఉంది . ఆమె కి ఆ తల్లి .. జగతి ని ఏలే జగత్జనని తప్పకుండా
సహాయం చేస్తుంది ... అంతే కాక మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి .. వర్ధన వర్మ కోరికా నెరవేరుతుంది ...
అన్నారు స్వామీజీ .
మీ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి స్వామీజీ ... ఒకానొకప్పుడు ... నా బిడ్డ ని పట్టుకొని మీదగ్గరకి
పరుగున వచ్చాను దాన్ని కాపాడమని ... శాపమో ,వరమో తెలియక దాని జాతకం నన్ను ఆయనని కలవర
పెట్టింది . ఆపైన దాని బ్రతుకు కోసం పసుపు కుంకుమలకి దూర మయ్యాను స్వామీజీ ... జీవితం లో ఎన్నో
ఆటుపోట్లని భరించాను ... కానీ నా భర్తని రాచరికపు హోదా లో సాగనంప లేక పోయాను .. ఆయన వదిలి
వెళ్ళిన బాధ్యత ను మోసాను ... నా తదుపరి కూడా రచన కి మీరు మార్గదర్సకమ్ కాగలరని ఆశిస్తున్నాను
అన్నదామె కన్నీళ్ళతో ..
అప్పుడే అప్పగింతలు ఎందులకు తల్లీ ? సందేహించకు ... పరీక్షలు ఎదుర్కొన్నాకే మనిషి రాటు దేలేది .. రచన
బంగారు భవితవ్యాన్ని అతి త్వరలోనే చూడ బోతున్నావు ... అన్నారు స్వామీజీ .
దానిని ఓ అయ్య చేతిలో పెట్టి నా బాధ్యతని నెరవేర్చుకోవాలనే ఉంది కానీ అది లక్ష్యం .. అదీ .. ఇదీ అని అంటోంది ..
అంది గిరిజ .
అమ్మా ... గిరిజా .. సమయం వచ్చినపుడు ... అన్ని దానంతట అవే జరుగుతాయి .. రచన కి జీవిత భాగస్వామి
కాదగిన వాడు .. ఆమె లక్ష్యం లో పాలు పంచుకుంటూ ఆమె కి తోడుగానే ఉన్నాడు ... కాబట్టి అతి త్వరలోనే
నీ బిడ్డ నుదుట బాసికం తో కనబడుతుంది ... ఇది ఆ దేవీ నిర్ణయం .. అన్నాడు అతడు మందస్మిత వదనం తో ..
నిజం గానా స్వామీ ... మీ మాటల బట్టి అర్థమయింది .. నా మనసు శాంత పడింది ... అంది గిరిజ .
ఇక ఇంటికి వెళ్ళు ... ఇంటిని గంగ తో శుభ్రం చేసి పూజా మందిరం లో సువర్ణ కలశం స్థాపించు ... అతి త్వరలోనే ఆ
కలశం తిరిగి వైష్ణవీ మాత ఆలయానికి చేరుతుంది .. అన్నారు స్వామీజీ .
తమరి ఆజ్ఞ శిరసావహిస్తాను స్వామీ .. ఇక సెలవు .. అని అక్కడి నుండి కదిలింది గిరిజాదేవి .
*******************
మధ్యాహ్నం 3గం సమయం లో సైరన్ మోగించుకుంటూ వచ్చాయి పోలీస్ వాహనాలు ,అంబులెన్స్ .
వేలి ముద్రలు సేకరించటం ,శవానికి ఫోటోలు తీయటం .. సరస్వతి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం అంతా చకచకా
జరిగిపోయాయి.. శవాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకువెళ్ళారు ..
వెళ్తూ వెళ్తూ పోలీస్ ఆఫీసర్ యశ్వంత్ ని అభినందించి వెళ్ళాడు ... పోలీస్ కి తెలియజేసినందుకు ...
ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోయాయి వాహనాలన్నీ .
యశ్వంత్ బాబూ .. మా ఆయన శవాన్ని కోస్తారా ? నేను పాపం చేస్తున్నానేమో .. అంది సరస్వతి బాధగా .
అలా ఆలోచించకూడదు .. మీ ఆయన ఏ విధం గా చనిపోయాడో పరీక్షిస్తారు .. శవం మల్లి రేపటిదాకా రాదు ..
పరీక్షలు అయ్యాక మళ్ళి వాళ్ళే నీకు అప్పజేబుతారు సరస్వతీ .. అయినా నువ్వు మేము చెప్పినట్లు విన్నావు ..
నీలా అందరు ఆలోచిస్తే ఈ ఊరికి మంచిరోజులోస్తాయి .. అన్నాడు యశ్వంత్ .
సరస్వతి లో మంచి ఆవేశం ఉంది యశ్వంత్ .. నేను ఇది వరకే ఓ సారి .. సరస్వతి తో మాట్లాడాను .. అంది రచన .
బాబూ .. నేను మిమ్మల్ని ఓ విషయం అడగవచ్చా .. అంది సరస్వతి .
మీరంతా కూడా పోలిసుల తాలుకే కదా ... అంది సరస్వతి .
నిర్ఘాంత పోయి .. అలా ఎందుకు అడుగుతున్నావు ? అడిగాడు యశ్వంత్ .
ఈ ఊరికి పోలీసులు ఏం జరిగినా రాలేదు .. కానీ మీరు పిలిస్తే వచ్చారు .. అంతే కాదు మీరు మా ఆయన్ని దెయ్యం
చంపలేదని భూపతి తో బలం గా వాదించటం నేను గమనించినాను ... ఉదయం మీరు ధాత్రి గారిని బంగ్లా వెనుక ఆ
పైపెక్కించటం కూడా చూసాను .. అంది సరస్వతి .
రచన ,యశ్వంత్ ,శివ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు .
కంగారు పడకండి బాబూ ... మీరు ఈ ఊరికి మంచి సేయటానికే వచ్చారని నాకనిపించింది .. అందుకే ఇక్కడెవరు
లేరని మీకడిగాను .. నా నోటి వెంబడి ఈ మాటేక్కడికీ పోదు బాబూ .. అంది సరస్వతి .
యశ్వంత్ చిన్నగా నవ్వి .. నువ్వు చాలా తెలివైనదానివి సరస్వతీ .. ఏం చదువుకున్నావు ? అడిగాడు .
ఐదో తరగతి బాబూ ... అంది సరస్వతి .
సరస్వతీ .. నువ్వనుకున్నది కొంత నిజమే ... ఈ ఊరికి కష్టాలు తీరడానికి మేము మా శాయశక్తులా కృషి చేస్తాము ..
నువ్వు మాకు సహాయం చేస్తావా ? అంది రచన .
తప్పకుండా ... చేస్తానమ్మ .. ఈ ఊరికి బడి రావలె .. గుడి రావాలే .. నీళ్ళు కావాలె .. ఆసుపత్రి రావాలే ..
వీటన్నిటి కోసం నా ప్రాణం ఇమ్మన్న ఇస్తానమ్మ ... అంది సరస్వతి .
సరస్వతీ .. మేము రాత్రంతా ఈ మహాల్లోనే ఉన్నాము .. తెల్లారి మహల్ నుండి వస్తున్నపుడు .. మీ ఆయన మాకు
ఎదురు పడ్డాడు .. మేము ఇంటికి చేరేసరికి ఈ వార్త విన్నాం .. అందుకే మీ ఆయన్ని దెయ్యం చంపిందంటే .. కాదని
అంతగా వాదించాను .. అన్నాడు యశ్వంత్ .
అంటే .. ఈ మహల్లో దెయ్యం లేదా బాబు .. అంది సరస్వతి
చిన్నగా నవ్వి చెప్పానుగా మీ ఆయన్ని ఎవరు చంపారో రేపట్లోగా తేలిపోతుంది ... అన్నాడు యశ్వంత్ .
(ఇంకా ఉంది )
.
1 comment:
super suspense!
Post a comment