యశ్వంత్ .. ఇక మనం వెళ్దాం .. బాగా అలసట గా ఉంది . కొంచెం ఫ్రెష్ అయి ఏమైనా తినాలి .. అన్నాడు శివ .
అవును శివా .. నువ్వు అంటుంటే నాకు ఆకలి గుర్తొచ్చింది .. అన్నాడు యశ్వంత్ .
సరస్వతి .. నువ్వూ వెళ్ళు .. మనం మల్లి రేపు కలుద్దాం .. అంది రచన .
సరే .. ధాత్రి గారు .. అని యశ్వంత్ ,శివ ల వైపు తిరిగి నాకు సహాయం చేసారు ... మీ మేలు మరవను అంది
సరస్వతి .
ఫర్వాలేదు సరస్వతీ .. నువ్వు వెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .
సరేనని తల ఊపి అక్కడనుండి వెళ్ళిపోయింది సరస్వతి .
యశ్వంత్ ... ఈమె కి మన విషయాలు చెప్పటం అంత కరెక్ట్ కాదేమో .. అన్నాడు శివ .
ఈమె ని నమ్మొచ్చని నాకనిపించింది శివా ... పైగా మనల్ని పోలిసులనుకుంటుంది .. సో మనకొచ్చే సమస్య ఏమి
లేదు లే .. అన్నాడు యశ్వంత్ .
కానీ యశ్వంత్ .. మన వల్ల సరస్వతికే సమస్య వస్తుందని నాకని పిస్తుంది .ఇంతకు ముందు గమనించావా ?
భూపతి సరస్వతి వంక చాలా కోపం గా చూసాడు .. ఈ వూళ్ళో భూపతి ని ఎవరు ఎదురించరు .. ఎదిరించిన వారు
ప్రాణాలతో మిగలరని నాతో ఓసారి సరస్వతే చెప్పింది .. అంది సాలోచనగా రచన .
అది ఒకప్పుడు ... కానీ ఇప్పుడు ఈ వూళ్ళో మనం ఉన్నాం .. ఈ మహల్లో దెయ్యాన్నే కాదు .. ఆ భూపతి పని
కూడా పట్టాకే ఈ వూరి నుంచి కదిలేది .. అన్నాడు యశ్వంత్ .
శివ ,రచన ... చిన్నగా తల పంకించారు .
సరే .. రచనా నువ్వూ వస్తావా ? బాగా ఆకలిగా ఉంది .. అక్కడ సత్య , మురారి ఏం తిన్నారో ఏమో ... ఈరోజు
భూపతి కూడా మనమీద కోపం గా ఉన్నాడు కదా ... భోజనం వచ్చుండదు .. అన్నాడు యశ్వంత్ .
అయితే ఏం ? నూడుల్స్ చేస్తాను పదండి .. అందరం కలసి తిందాం .. అంది రచన .
అబ్బ .. శివ .. విన్నావా ? నా అదృష్టం .. ఈరోజు రచన వంట చేస్తుందట .. అన్నాడు యశ్వంత్ .
శివ నవ్వేసాడు ...
యష్ .. జోకులాపు .. ఏమనుకున్నసరే .. అందరూ ఆకలి తో ఉన్నపుడు ఎలా వండినా .. అంతా నోరు మూసుకొని
తింటారు ... నేను ఇప్పుడదే చేయబోతున్నాను ... అంది రచన .
హా యష్ .. చెప్పటం మర్చిపోయాను .. ఇంతకూ ముందు బయట కి వెళ్ళినపుడు నేను బలేశ్వర్ ని కాంటాక్ట్
చేసాను... నైట్ జరిగిందేమి చెప్పలేదు . మనం సేఫ్ .. ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పాను .. అన్నాడు
శివ.
ఓకే అన్నాడు యశ్వంత్ ...
కానీ శివ మాటలు విన్నాక రచన మొహం లో రంగులు మారటం గమనించాడు యశ్వంత్ .
ముగ్గురూ కలిసి ఇంటిదారి పట్టారు .
******************
సత్యా .. నాలుగు కావొస్తుంది మన వాళ్లింకా రాలేదు . అన్నాడు మురారి .
నేను వాళ్ళ కోసమే చూస్తున్నాను మురారి ... అంది సత్య .
పాపం ఉదయం నుంచి వాళ్ళెం తినలేదు . అన్నాడు మురారి ..
వాళ్ళు రాగానే నేనేదో ఒకటి ప్రిపేర్ చేస్తాను ... నువ్వు రెస్ట్ తీసుకో మురారి .. అంది సత్య ..
సత్యా .. నువ్వు కూడా రెస్ట్ తీసుకో ... రాత్రంతా నాకోసం కంగారు పడుతూనే ఉండుంటావు ... అన్నాడు మురారి ...
అంతా ఓ పీడకలలా ఉంది .. నిజమేనా అని అనుమానం కూడా కలుగుతోంది .. కాని అంతా నిజమే .. జీవితం లో
ఉహించని నిజాలను కళ్ళెదురుగా చూశాక మాట రావటం లేదు మురారి ..
నిన్ను రావొద్దని చెప్పాను .. ఐన ఎందుకొచ్చావు అక్కడికి ? అన్నాడు మురారి ..
అసలు మహల్ కి రచన వెళ్ళలేదు తెలుసా ... మీరు మహల్ కి వెళ్ళాక రచన కంగారుగా వచ్చింది .. బసవరాజు
చెప్పాడట తనకి మీరు అపాయం లో ఉన్నారని . అంది సత్య
రచన బసవరాజు కోసం చెబుతున్నపుడు నాకు నమ్మకం కుదరలేదు .. కానీ నిన్న పరిస్థితులని చూశాక
మానవాతీత శక్తులు ఉంటాయని నమ్మక తప్పదు .. అన్నాడు మురారి .
అవును మురారీ .. నిన్న బసవరాజు రచన కి మహల్ తాళం చెవులు కూడా ఇచ్చాడు .. అందువల్లే మేము
మహల్ సింహద్వారం నుండే లోపలకి వచ్చాం .. నాకు రచన మీరంతా ప్రమాదం లో ఉన్నారని చెప్పగానే నా
మనసు అక్కడికి రాకుండా నన్ను ఆపలేక పోయింది .. అందుకే నీ మాట ని అతిక్రమించి నేను అక్కడికి
వచ్చేసాను. అన్నది సత్య
సరే సత్యా .. మనమంతా మహల్ కి వెళ్లి క్షేమం గా తిరిగొచ్చాం .. కానీ ఈ చనిపోయిన వ్యక్తి ఎవరో ,ఏమిటో ...
మనకి తెలియ కుండా ఎలా వచ్చాడో ? ఎంత ఆలోచించినా అంతు చిక్కటం లేదు .. అన్నాడు మురారి ..
మనవాళ్ళు వస్తే అన్ని వివరాలు మనకి తెలిసే అవకాశం ఉంది కదా .. నువ్వెక్కువగా ఆలోచించకు .. అంది సత్య .
(ఇంకా ఉంది )
No comments:
Post a comment