Powered By Blogger

Tuesday, 14 January 2014

రుధిర సౌధం 49ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వినబడింది .

తలుపు వైపు చూసి .. తర్వాతా మురారి వైపు చూసి .. మురారీ .. మన వాళ్ళే అనుకుంటాను .. అని గుమ్మం

వైపు నడిచింది సత్య .

తలుపు తీసింది .. ఎదురుగా రచన ,శివ ,యశ్వంత్ లు .

ఇంత ఆలస్యమయిందేo? అడిగింది సత్య .

సత్యా .. ముందు లోపలి కి రానీ ... అని లోపలికి నడిచింది రచన .

వాళ్ళు ముగ్గురూ లోపలికి వచ్చాక .. తలుపులు మూసి తానూ లోపలికి నడిచింది సత్య .

యష్ .. ఏమైంది ? టెన్షన్ తో బుర్ర వేడెక్కి పోతోంది . ఇంతకీ ఆ చనిపోయింది ఎవరు ? అడిగాడు మురారి .. వీళ్ళని

చూడగానే .

మురారి వంక చిరునవ్వు తో చూసి .. బాగా ఆకలిగా ఉంది .. మీరేమన్న తిన్నారా ? ముందు ఫ్రెష్ అయి వస్తాను

మురారీ... అన్నాడు యశ్వంత్ .

చిన్నగా తలూపి సత్యా వాళ్ళ కోసం ఏదన్న తినడానికి రెడీ చెయ్ ... అన్నాడు మురారి .

యశ్వంత్ ,శివ స్నానానికి లోపలికి వెళ్ళారు .

ఎలా ఉన్నావు మురారి ? అంది రచన .

నేను ఓకే రచనా ... నువ్వన్నా చెప్పు అక్కడేం జరిగిందో .. అన్నాడు మురారి .

తనసలే చాల టెన్షన్ పడుతున్నాడు రచనా .. నువ్వు మాట్లాడుతూ ఉండు .. నేను మీ అందరి కోసం నూడుల్స్

చేస్తాను... అంది సత్య .

సరే సత్యా .. నేనే చేస్తానని యశ్వంత్ వాల్లతో చెప్పాను .. సరే నువ్వే చెయ్యి ... అంది చిరునవ్వుతో రచన .

సత్య వంటగది లోకి వెళ్ళాక .. ఇప్పుడు చెప్పు .. అన్నాడు మురారి .

అతన్ని రాముడు అంటారుట మురారి ..   అతని వైఫ్ నాకు తెలుసు .. సరస్వతి . ఉదయం మహల్ నుంచి నేను

యశ్వంత్ వస్తున్నప్పుడు  ఒక  వ్యక్తి మాకు ఎదురు పడ్డాడు .. మేమైతే అతని మొహాన్ని సరిగ్గా గమనించ లేదు .

ఎందుకంటే దట్టం గా పొగ మంచు ఉంది కదా .. అతను ఒక దుప్పటి కప్పుకొని వచ్చాడు .. అతనికి

కనిపించకూడదని మేము దాక్కున్నాం .. కానీ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గర అదే దుప్పటి పడి ఉంది ... సో

అతనే అని మేము అనుకుంటున్నాం .. అo ది రచన .

రచనా నువ్వు చెప్పే విషయం లో ఏదో సరిగా లేదు ... నీకేం అనిపించడం లేదా ... అన్నాడు మురారి .

అవును మురారి .. రాత్రంతా అలసట వల్ల బుర్ర సరిగ్గా పనిజేయలేదు .. ఉదయం మేము ఆ వ్యక్తి మొహాన్ని

సరిగ్గా చూడలేదు .. ఈ చనిపోయిన వ్యక్తే ఆ వ్యక్తని ఖరాఖండి గా చెప్పలేము .. ఈ వ్యక్తి ని ఆ దుప్పటి కప్పుకొని

వచ్చిన వ్యక్తే చంపి ఉండొచ్చు .. అప్పుడు ఆ దుప్పటి అక్కడ పడిపోయి ఉండొచ్చు .. అంది సాలోచనగా రచన .

లేదంటే ఇతడ్ని హత్య చేస్తుండగా లేదా హత్య చేసిన తరువాత ఆ దుప్పటి వ్యక్తి చూసి ఉండొచ్చు .. భయం తో

పారిపోయి ఉండొచ్చు .. అప్పుడు ఆ దుప్పటి అక్కడ పడిపోయి ఉండొచ్చు .. అన్నాడు మురారి ..

కాని మహల్ దగ్గర కి ఎవరూ రారు కదా .. యితడు అక్కడికి ఎందుకొచ్చి నట్లు ? అంది రచన .

ఈ హత్య వెనుక అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు నా మైండ్ లో మెదులుతున్నాయి .. అన్నాడు మురారి ..

అవును మురారీ .. దాదాపు నా పరిస్థితి కూడా అంతే .. కానీ యష్ ఆలోచన ఏంటంటే .. మహల్ దగ్గరకు ఎవ్వరూ

రారు ... వచ్చినా రాత్రి మనం అక్కడే ఉన్నాం కాబట్టి మనకి తెలిసి ఉండేది .. ఉదయాన్నే అతడ్ని మేము చూడటం

ఆ దుప్పటి ని గుర్తు పట్టడం . వచ్చిన కొద్ది సేపట్లోనే అతను చనిపోయాడని వార్త రావటం తో ఉదయం మేము

చూసింది రాముడ్నే నని తను నిర్థారించుకున్నాడు . ఓ రకం గా తన ఎనాలిసిస్ కూడా నిజమే అనిపిస్తుంది ..

కాని రాముడు సరస్వతి భర్త కనుక రాముడు ఎప్పుడు బయటకి వెల్లాడన్నది సరస్వతి కి తెలుస్తుంది కదా ..

ఒకవేళ ఆ విషయం సరస్వతి చెప్పగలిగితే .. మేము ఉదయం చూసింది రాముడ్నో కాదో తెలిసి పోతుంది .. అంది

రచన.

అవును రచనా .. నువ్వు సరస్వతి తర్వాత ఈ విషయం కోసం వాకబు చెయ్యి .. అప్పుడు మనం ఓ క్లారిటీ కి

రావొచ్చు.. అన్నాడు మురారి .

ఇంతలో టవల్ తో తల తుడుచుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన యశ్వంత్ .. మురారీ .. అన్ని విషయాలు

చెప్పిందా రచన ? రెస్ట్ తీసుకోమంటే డ్యూటీ చేస్తానంటావు .. కాసేపు ఈ ఆలోచనలు వదిలేయోచ్చు కదా ..

ఇంతకీ మీ ఆవిడ గారు మాకు తినడానికేమన్న రెడీ చేసారా లేదా ? అన్నాడు   .

యష్ .. రెడీ .. నూడుల్స్ .. తీసుకో ప్లేట్ .. అని ఓ ప్లేట్ .. యష్ చేతికి అందించింది ..

సత్యా .. శివ కూడా వచ్చేస్తాడు మరి .. అని రచన వంక తిరిగి .. ఏం మేడం గారు .. వంట మీరు చేస్తామన్నారు ..

సత్య కి అప్పజేప్పేసార ? అన్నాడు యశ్వంత్

సత్య అందిస్తున్న నూడుల్స్ ప్లేట్ అందుకుంటూ .. తను చేస్తానంది .. నేను ఛాన్స్ ఇచ్చాను .. తప్పేముంది ?

అంది రచన బుంగమూతి పెడుతూ ..

ఇలా ఐతే పెళ్ళయ్యాక నా పని పస్తె ... అన్నాడు యశ్వంత్  ఆమె వంక కొంటె గా చూస్తూ ..

ఆ మాట కి రచన బుగ్గలు ఎర్రబడ్డాయి .. చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్ది ..


(ఇంకా ఉంది )


  

No comments: