Powered By Blogger

Thursday, 16 January 2014

రుధిర సౌధం 50 వ భాగం

రుధిర సౌధం 50 వ భాగం 

యష్ .. నువ్వన్న మాట కి రచన సర్రున లేస్తుంది అనుకున్నాను ... అలా నవ్వి ఊరు కుందేంటి ? ఆశ్చర్యం గా

ఉందే ... అంది సత్య .

ఓహ్ .. అదా .. ఇన్నాళ్ళకి మేడం గారికి నా మీద దయ కలిగిందిలే .. అన్నాడు యశ్వంత్ ..

అంటే .. రచన నీ ప్రేమని అంగీకరించిందా ? అన్నాడు మురారి ..

ఇక్కడేదో ఇంటరెస్టింగ్ టాపిక్ నడుస్తున్నట్లు ఉంది .. అంటూ వారి మధ్య లోకి వచ్చి కూర్చున్నాడు శివ ..

శివ కి కూడా ఓ ప్లేట్ అందించింది సత్య .

అవును .. అదీ రాత్రే .. జరిగింది .. షీ అగ్ర్రీడ్ ... అన్నాడు యశ్వంత్ రచన వైపు  ఆరాధన గా చూస్తూ ..

ఓహ్ గాడ్ .. ఇంత సంతోషమయిన వార్త ఇంత సైలెంట్ గా చెబుతారా మీరిద్దరూ .. అదే ముంబై లో ఉండుంటే

మంచి పార్టీ చేసుకొని ఉండేవాళ్ళం .. అన్నాడు శివ ..

అమ్మ దొంగా .. నాతొ మాట కూడా చెప్పలేదు .. అంది సత్య రచన బుగ్గ పుణుకుతూ ..

చాలా హ్యాపీ న్యూస్ ఇది .. యష్ .. congratulations .. అన్నాడు మురారి ..

చిరునవ్వు తో అన్నాడు యశ్వంత్ .. థాంక్స్ రా .. అని

అయితే ఇంకా పెళ్ళే .. అన్నాడు శివ .. 

ఒక్క క్షణం "పెళ్లి" అన్న మాట వినగానే రచన మొహం లో ఎందుకో కాసింత బాధ కనబడింది .. 

అది గమనించాడు యశ్వంత్ .. 

రేయ్ .. రచన నా ప్రేమకి ఓకే చెప్పింది కానీ మేమిద్దరం ఇంకా ఏం మాట్లాడు కోలేదు .. మా  భవిష్యత్ కోసం ఏ 

ప్రణాళికలు వేసుకోలేదు ... అవన్నీ ఇక్కడ నుంచి వెళ్లాకే .. .. అన్నాడు యశ్వంత్ .. 

యశ్వంత్ వైపు కృతజ్ఞత గా చూసింది రచన . 

యశ్వంత్ .. ఇక్కడ నుంచి మనం ఎప్పుడు వెళ్తున్నాం ? అడిగింది సత్య సాలోచన గా .. 

అందరూ ఆమె వైపు వింతగా చూశారు .. 

ఏం లేదు ? ఆ మహల్ రహస్యమేమిటో తెలుసుకోవటానికి వచ్చాం .. మనం చేసేదేముంది ? మనక్కూడా ఆ 

మహల్ లో అతీత శక్తి ఉందని తెలిసి పోయింది కదా .. దాన్ని ఎదురించటం మనవల్ల కాదుగా .. ఇంకా ఇక్కడ 

ఉండి  ప్రయోజనం ఏముందని ? అంది సత్య . 

సత్యా .. ఏం మాట్లాడుతున్నావు ? అని మురారి ఇంకేదో అనబోతుండగా తన చేతితో అతన్ని వారించాడు యశ్వంత్ . 

సత్యా .. ఏ రోజు అయినా ఏ కేసు లోనైనా మనం సమస్య కి కారణం మాత్రమే కనిపెట్టామా లేదంటే ఆ సమస్యని 

సమూలం గా పరిష్కరించామా ? అని అడిగాడు యశ్వంత్ .. 

పరిష్కరించాం .. అంది తల దించు కొంటూ సత్య .. 

మరిప్పుడు మనం ఏం సాధించామని ఇక్కడనుండి వెళ్ళాలి  ? అన్నాడు యశ్వంత్ . 

నీకు నమ్మకం ఉందా యశ్వంత్ ? ఈ సమస్య ని మనం పరిష్కరించగలం అని ... అన్నదామె . 

నమ్మకం లేకుండా మనం ఏ పని చేయకూడదు .. ఏ వివరాలు తెలియకుండా నువ్వూ ఇక్కడకి రాలేదు .. 

అన్నింటికీ సిద్ధపడే వచ్చాం .. అవునా ? అన్నాడు యశ్వంత్ . 

సత్య మౌనం గా ఉండి పోయింది .. 

సత్యా జరిగింది చూసి నీకు భయం వేసింది .. నువ్వెంతగానో ప్రేమించిన మురారి ని అలా చూసి ఇంకా భయ పడు 

తున్నావు .. కదూ అన్నాడు శివ .. 

సత్య సమాధానం చెప్పకుండా మిన్నకుండి పోయింది .. 

ప్రేమిస్తే అంతే .. అది సత్య భయం కాదు .. మనసున్న వాళ్ళు ఎవరైనా మన మనసుకి దగ్గరైన వాళ్ళు గాయపడినా ,

బాధ పడినా తట్టుకోలేరు .. అది బాధ తప్ప .. భయం కాదు .. సత్య ఎంత డేరింగ్ పెర్సనొ మనకి తెలీదా?అంది రచన . 
సత్య కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి .. రచన వంక కృతజ్ఞత గా చూసింది .. 

చూసారా .. ఎంతైనా ఆడపిల్లలు .. ఆడపిల్లలే .. రచన ,సత్య ని ఎంత బాగా అర్థం చేసుకుందో .. అన్నాడు మురారి .. 

అంతా నవ్వేశారు ... హాయిగా 

అదిసరే .. రచనా .. నేను నిన్ను అడగటం మర్చిపోయాను .. నేను నిన్న నీ గదికి వచ్చి చూసాను .. నువ్వు గదిలో 

లేవు .. అసలెక్కడికి వెళ్లావు ? అడిగాడు యశ్వంత్ .. 

అవును .. నువ్వు మహల్ వేల్లిపోయావేమో అనే కదా అందరం మహల్ కి వెళ్ళింది ?తీరా చూస్తే నువ్వు తర్వాత 

సత్య తో పాటూ వచ్చావు ? అన్నాడు  శివ .. 


(ఇంకా ఉంది )

No comments: