అసలు నిన్న రాత్రి ఏం జరిగిందంటే .... అని మొదలుపెట్టి తను వెంగమ్మ ని చూడటం ,ఫాలో చేయటం .. అక్కడ
జరిగింది అంతా అందరికీ వివరం గా చెప్పింది రచన .
చాల వింతగా ఉంది .. అంటే బసవ రాజు కూడా ఆత్మే నన్న మాట .. అన్నాడు యశ్వంత్ ..
అవును .. నేను ఆ సమాధిని అలా చూసేసరికి నాకేం అర్థం కాలేదు .. అంది రచన .
అంటే మరి వెంగమ్మ కి ,బసవరాజు కి ఏంటి సంబంధం ?ఆమె కి ఎందుకు భయం వేయలేదు అమావాస్య నాడు
బయటకి రావడానికి ? అన్నాడు మురారి
అసలు వెంగమ్మ మూగ దానిలా ఎందుకు నటిస్తోంది ? అంది సత్య ..

వీటన్నిటికి నా దగ్గర సమాధానాలు లేవు .. తెలుసుకోవాల్సినది చాలా ఉంది .. అంది రచన ..
"చాలా ప్రశ్నలే ఉన్నాయి రచనా ... బసవరాజు కి వెంగమ్మకే కాదు .. నీకూ సంభందం ఉంది బసవరాజు తో ..
అందుకే అతడు నీకు కనిపిస్తున్నాడు .. సహాయం చేస్తున్నాడు .. చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే
విధాత్రి ని మరోసారి కలవాలి .. అప్పుడేం జరిగిందో తెలుసుకోవాలి .. అంతే కాక రచన ఏ ఉద్దేశ్యం తో ఇక్కడ కి
వచ్చింది తెలుసుకోవాలి " అని మనసులోనే అనుకున్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ ,మీరంతా బాగా అలసి పోయారు . కాసేపు పడుకోండి .. అంది సత్య ..
బాగా చెప్పావ్ సత్య .. కాసేపు నిద్రపోవటం అవసరం .. కళ్ళు పడిపోతున్నాయి .. అంటూ లోపలికి దారి తీసాడు శివ .
రచనా ! నీ సంగతేంటి ? అంది సత్య .
నేనూ వెళ్తాను .. వెళ్లి కాసేపు నిద్రపోతా .. అంది రచన .
యశ్వంత్ .. కూర్చున్న చోటే నిద్రపోయాడు ..
రచన కూడా సత్య ,మురారిలకి బాయ్ చెప్పి బంగ్లా కి చేరింది ..
బంగ్లా కి చేరగానే గుమ్మం దగ్గరే గుమస్తా శంకరం ఎదురు పడ్డాడు రచన కి ..
కళ్ళద్దాల కింద నించి ఆమె నదోలా చూస్తూ వెంగమ్మా ... అని కేకేసాడు ..
ఆమె పరుగున వచ్చింది .. కళ్ళ తోనే రచనని చూపి తన దారిన వెళ్లి పోయాడు . ఆమె రచనని చూసి నూతి దగ్గరకి
నడవమని సైగ చేసింది ..
రచన ఆశ్చర్యం గా ఆమె ని అనుసరించింది .. ఇద్దరూ నూతి దగ్గరకి వెళ్ళాక .. అక్కడ ఉన్న నీళ్ళ బకెట్ ఎత్తి రచన
తల మీదుగా పోసింది .. ఆ హటా త్పరి ణామానికి విస్తుపోయి చూసింది రచన .. అంతే తన పని ఐపోయిందన్నట్లు
గా బంగ్లా లోకి వెళ్ళిపోయింది వెంగమ్మ .
ఆమె ఆశ్చర్యం గా అలా ఉండి పోవటం అక్కడే ఉన్న ఓ పని వాడు గమనించి .. అమ్మాయి గారూ .. మీరు శవం
కాడి కెళ్ళారు కదా .. స్నానం చేయకుండా ఇంటి లోపలికి ఎల్ల కూడదు .. అందుగే వెంగి మీమీద నీళ్ళు పొసినాది ..
అన్నాడు రచన తో ..
ఆమె చిన్నగా తల పంకించి .. ఆ తడి బట్టల తోనే లోపలికి నడిచింది .. హాల్లో ఎవరూ లేరు .. సరాసరి తన రూం కి
వెళ్లి తడి బట్టలు విప్పి పొడి బట్టలు వేసుకుంది .. టవల్ జుట్టు వత్తుకుంటూ ఉండగా .. ఒంటి మీద చల్లని నీళ్ళు
పడటం,రాత్రంతా నిద్రలేకపోవటం తో ఆమె శరీరం విశ్రాంతి కోరింది .. అలానే సోఫా మీద వాలిపోయింది రచన .
ఆమె తనువు గాలిలో దూది పింజలా తేలిపోతుంది .. ఏదో అస్పష్టం గా కనబడ సాగింది ఆమె కి .. ఆ వూరు ...
బంగ్లా .. మహల్ .. అంతా .. మహల్ లోపల ఒక స్త్రీ అచ్చు తన రూపం లో .. దేవకన్యలా మెట్ల మీద నుండి కిందకి
దిగుతూ .. రచన ని చూసి ఆత్మీయం గా నవ్వుతుంది .
మెల్లిగా రచన మెదడు లో ఆ దృశ్యం అంతా చెరిగిపోయింది . కాసేపట్లోనే ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ..
కింద హాల్లో ధాత్రి వచ్చిందా ? అని వెంగమ్మ ని అడిగాడు రత్నం .
వచ్చిందన్నట్లు తల ఊపి పైన ఉందన్నట్లు గా చేయి చూపింది ..
సరే .. అలసి పోయుంటుంది విశ్రాంతి తీసుకోనీ .. అన్నాడు రత్నం .
***********************
(ఇంకా ఉంది)
3 comments:
really nice...keep going!
superb serial..keep going
superb serial..keep going
Post a comment