భళ్ళున తెల్లవారింది . సరస్వతి ఇంటి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు .. యశ్వంత్ ,శివ ,రచన ముగ్గురూ
పోలిసుల కోసం ఎదురు చూస్తున్నారు . వాళ్ళ ఎదురుచూపు ఫలించినట్లు గా అంబులెన్స్ కూత పెట్టుకుంటూ
వచ్చింది.. రాముడి శవాన్ని సరస్వతి కి అప్పగించారు .. ఏడుపు లంకించు కున్నారు అక్కడున్న ఆడవాళ్ళంతా ..
వెనుకనే వచ్చిన పోలీసు జీప్ నుంచి పోలిస్ ఆఫీసర్ కిందకి దిగి సరాసరి యశ్వంత్ దగ్గరకి వచ్చాడు ..
హలో సర్ .. అని చేయి అందించాడు యశ్వంత్ ..
అతను పలకరింపుగా నవ్వి .. యశ్వంత్ .... ఇది పల్లెటూరే కావొచ్చు .. కాని రాముడ్ని చంపిన హంతకుడు
మాత్రం చాలా తెలివైన వాడు .. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎవరి చేతి ముద్రలు లేవు .. కానీ అతడు గొంతు నులవబడి
చనిపోయాడు .. అతని కాళ్ళ దగ్గర ఎవరో గట్టిగా పట్టుకోవడం వల్ల .. ఎంత గట్టిగా పట్టుకున్నారంటే .. రక్త ప్రసరణ
ఆగిపోయింది . హంతకుడు అతన్ని రాత్రి 1గం కి హత్య చేసాడు .. అన్నాడు పోలీసు ఆఫీసర్ .
వ్వాట్ ? రాత్రి ఒంటి గంట కా ? ఆశ్చర్యం గా అడిగాడు యశ్వంత్ ..
అవును .. అని అన్నాడు అతడు ..
"రాత్రి ఒంటి గంట .. ఆ సమయం లో మహల్లొనె ఉన్నాం .. అంతా మిస్టరీ లా ఉంది .. " అని మనసులో అనుకొని
పైకి మాత్రం ... థాంక్స్ ఆఫీసర్ .. అన్నాడు యశ్వంత్ .
ఈ వూరి వాళ్ళు దెయ్యం చంపింది అంటారే .. అది నిజం కాదు యశ్వంత్ .. ఎవరో ప్లాన్ వేసి చంపారంటే ఆశ్చర్యం గా
ఉంది .. విచారణ కి సాక్ష్యాలని సేకరించాల్సి ఉంది .. అతని భార్యని ప్రశ్నిస్తాం .. అన్నాడు అతడు .
స్టేషన్కి తీసుకురావటానికి ప్రయత్నిస్తాను . అన్నాడు యశ్వంత్ ..
సరే .. మీరు చెప్పినట్లే చేద్దాం .. మాకేం అభ్యంతరం లేదు .. కాని ఇది సహజ మరణం మాత్రం కాదు .. అందుకే ఆమె
ని ఈ కేసు విషయం లో సహకరించమని చెప్పండి .. అన్నాడు ఆఫీసర్ ..
అలాగే .. నాకు పోస్టుమార్టం రిపోర్ట్ కాపీ ఒకటి ఇవ్వగలరా ? అన్నాడు యశ్వంత్ ..
స్యూర్ .. అని ఓ కాపీ ఇచ్చాడు ఆఫీసర్ .
థాంక్స్ .. అన్నాడు యశ్వంత్ .
ఇట్స్ ఓకే యశ్వంత్ .. మళ్ళి కలుద్దాం .. అవ్వాల్సిన ఫార్మాలిటీస్ చూడండి అన్నాడు అతడు ..
చిన్నగా తల పంకించాడు .. యశ్వంత్
పోలిస్ జీప్ వెళ్ళిపోయింది .. శవాన్ని కింద పరుండబెట్టి అందరూ చుట్టూ చేరి ఏడుస్తున్నారు . .. శవానికి కొంచెం
దూరం లో దీన వదనాలతో నిలబడి ఉన్నారు శివ ,రచన .. తిన్నగా వారి వద్దకి నడిచాడు యశ్వంత్ ..
తమ వైపు వస్తు న్న యశ్వంత్ చూసి .. వాళ్ళు కొంచెం పక్కకి వచ్చారు .
యష్ .. పోలిస్ ఏమంటున్నారు ? అని అడిగాడు .. శివ .
పోలిస్ ఆఫీసర్ చెప్పిందంతా వారిద్దరికీ వివరించి చెప్పాడు ..
ఓహ్ గాడ్ .. మన అంచనా తప్పింది యష్ .. అంది రచన .. ఈ ఊరికి మనం సమాధానం చెప్పాలి .. అంది రచన .
నో రచనా .. ఇప్పుడు స్వయం గా నేనే రంగం లోకి దిగుతాను .. రాముడి అంత్యక్రియలు అవగానే మహల్ కి వెళ్లి
ఏదన్న క్లూ దొరుకుతుందేమో చూస్తాను .. అన్నాడు పట్టుదల గా యశ్వంత్ .
సరే .. మేము కూడా వస్తాం .. అని ఏం శివా ? అంది రచన .
ఎస్ .. అన్నాడు శివ
సరే .. ఇక అంత్యక్రియలు మొదలుపెట్టడం మంచిది అని ..
ఆ ఏడుస్తున్న వారి దగ్గరకి వెళ్లి .. పోస్టుమార్టం చేసాక ఎక్కువసేపు శవాన్ని ఇలా ఉంచడం మంచిది కాదు ..
అంత్యక్రియలకి ఏర్పాట్లు మొదలుపెడదాం .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ కళ్ళలోకి దిగులు గా చూసింది సరస్వతి ..
మెల్లిగా అక్కడున్న పెద్దమనుషులు శవాన్ని స్మశానానికి తరలించడానికి సిద్ధపడ్డారు ..
మరో రెండు గంటల్లో సరస్వతి తాత రాముడి చితికి నిప్పంటించాడు ..
రాముడి అంత్యక్రియలు ముగిసాక యశ్వంత్ బృందం సరాసరి మహల్ వైపే నడిచింది .
మహల్ ప్రాంగణం లో ఆణువణువూ గాలిస్తున్నారు .. ఎటువంటి ఆధారము కనబడలేదు వారికి ..
యష్ .. రాముడ్ని వైజయంతే చంపేసుంటుందని నాకూ అనిపిస్తుంది .. అంది రచన ..
నువ్వు కూడా ఏంటి రచనా ? అన్నాడు యశ్వంత్ .
రాత్రి ఒంటిగంట .. ఆ టైం లో అంటే .. నాకలానే అనిపిస్తుంది .. పరిస్థితి ని మనం చూసాం కదా .. అదృష్టం బావుంది ..
మనం బ్రతికి బయట పడ్డాం .. కానీ రాముడు ? అని ఆగిపోయింది రచన
మన ప్రయత్నం మనం చేద్దాం రచనా .. ఏదో ఒక నిర్ణయానికి మనం అప్పుడే వచ్చేయడం ఎందుకు ? అన్నాడు
శివ .
(ఇంకా ఉంది )
2 comments:
really interesting
screenplay baundi Radhika...
Post a Comment