రచన మౌనం గా ఉండి పోయింది ..
ఎందుకో పెదవిపై మౌనం చేరిన మెదడు లో ఆలోచన శరాలు మాత్రం సంధిస్తూనే ఉంది ..
నిజాల్ని వెతుక్కోవటం కన్నా .. నిజం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వెతకటం మంచిది .. బసవరాజు .. తను మాత్రమే
నాకు జరిగింది చెప్పగలడు ... ఆ ఆలోచన వచ్చిందే తడవుగా చుట్టూ పరికించి చూసింది ఎక్కడన్నా బసవరాజు
కనిపిస్తాడేమోనని ... కానీ మల్లి ఆమె అవగాహన చేసుకుంది .. యశ్వంత్ ,శివ ఉన్నారు .. బసవరాజు నన్ను
కలవడు ... నేనే బసవరాజు ఉండే చోటికి వెళ్ళాలి .. స్థిరం గా అనుకుంది రచన .
అదే సమయం లో యశ్వంత్ కి కూడా ఓ ఆలోచన వచ్చింది .. జరిగిన దంతా విధాత్రి కి తెలియదా ? తెలిసే
ఉంటుంది .. ఆమె నే అడగాలి .. అనుకున్నాడు .. కానీ రాకుమారి రచన ,శివ ఉండగా రాదేమో .. నేనే ఒంటరిగా
మహాల్లోకి వెళ్ళాలి అనుకున్నాడు యశ్వంత్ .
రచనా ... గట్టిగా పిలిచాడు ..
ఏదో ఆలోచన లో ఉన్న ఆమె .. తల తిప్పి యశ్వంత్ వైపు చూసింది ..
ఆమె అతని వైపుకి నడిచింది .. ఆమె దగ్గరకి రాగానే .. రచనా .. నేను మహాల్లోకి వెళ్లి వెతుకుతాను .. ఏదైనా
ఆధారం ఉండొచ్చు .. ప్రయత్నిస్తాను .. తాళం చెవి ఇస్తావా ? అన్నాడు ..
ఆమె తన మెడ లో లోకెట్ లా కట్టి ఉన్న తాళం చెవి తీసి యశ్వంత్ చేతిలో పెట్టింది ..
మీరిద్దరూ ఇక్కడంతా వెతకండి .. నేను లోపల వెతుకుతాను .. అన్నాడు యశ్వంత్ ..
యష్ .. నేను మహల్ వెనుక వైపు చూస్తాను .. అన్నాడు శివ ..
సరే శివ ... నేను మహల్లొకి వెళ్తున్నాను .. అన్నాడు యశ్వంత్ ..
నేను ముందు భాగం అంతా వెతుకుతాను యష్ .. అంది రచన .
సరే .. అని యశ్వంత్ .. సింహద్వారం వైపు ,శివ మహల్ వెనుక వైపు వెళ్ళారు ..
యశ్వంత్ మహల్ లోపలి కి వెళ్ళటం చూశాక .. మెల్లిగా గేటు దాటి బయటకి వచ్చేసింది రచన ..
కొంత దూరం మట్టి రోడ్ లో నడిచి ఆ తరువాత దట్ట మైన అడవి లోకి నడిచింది .... ఆమె పయనం బసవరాజు
సమాధి వైపు సాగింది .. ఆరోజు చీకట్లో వచ్చినా .. ఆమె దారినంతా గుర్తు పెట్టుకుంది ...
కొద్ది సేపట్లోనే ఆమె బసవ రాజు సమాధి ముందర ఉంది .. సమాధి చుట్టూ దట్ట మైన పొడవాటి చెట్లు ఉండటం
వలన సమాధి పై సూర్య రశ్మి పడటం లేదు ..
సమాధి పరిసరాల్లో బసవరాజు కనబడతా డెమో అని చుట్టూ చూసింది .. కనబడక పోయే సరికి .. మెల్లిగా ..
బసవరాజు .. బసవరాజు .. ఎక్కడున్నావు ? నేను నీతో మాట్లాడాలి ఒక్కసారి రా .. అని పిలిచింది రచన ..
సమాధి నుండి ఎటువంటి స్పందనా లేదు ..
బసవరాజు .. నేను పిలవక పోయినా వచ్చేవాడివి .. ఇప్పుడెందుకు రావటం లేదు ?? బసవ రాజూ .. గట్టిగా
అరచింది ... ఆమె అరుపు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది ..
అరె ... ఎందుకని బసవరాజు రావటం లేదు ? రాముడ్ని ఎవరు చంపారో తెలుసుకోవాలి ? వైజయంతా ? లేదంటే

అక్కడకోస్తున్నట్లు .. అడుగుల సవ్వడి వినిపించసాగింది ..
క్రమేపీ ఆ సవ్వడి దగ్గరగా వినబడసాగింది .. ఎవరో
వస్తున్నారు .. నేను ముందు దాక్కోవాలి అని .. గబగబా
ఓ చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంది రచన ..
ఎవరో ఇద్దరు వ్యక్తులు .. అక్కడ కి వచ్చారు .. వాళ్ళ
మాటలు లీలగా వినబడుతుంటే చెవులు రిక్కించింది ..
వాళ్ళలో ఓ గొంతు తనకి సుపరిచతమ్ గా అనిపించింది ..
ఈ గొంతు భూపతి ది ... ఆ ఆలోచన రాగానే ఆమె విస్తు పోయింది .. మెల్లిగా చెట్టు చాటు నుండి తొంగి మాటలు
వినిపిస్తున్న వైపు చూసింది .. ఆమె అంచనా సరయినదే .. అక్కడ భూపతి ,ఒక వ్యక్తి తో పాటు ఉన్నాడు ..
భూపతి తో ఉన్న వ్యక్తీ భయంకరం గా ఉన్నాడు .. చూడడానికి మాంత్రికుడిలా ఉన్నాడు ..
ఎవరితడు ? భూపతికి బసవరాజు సమాధి దగ్గర పనేంటి ? అని వాళ్ళనే గమనించసాగింది రచన ..
చూడు వీరాస్వామి .. నే చెప్పిన పని చెప్పినట్ల చేసినావంటే నిన్ను డబ్బు లో ముంచెస్తాను ... ఇక నుంచి నువ్వు
ఈడనే ఉండు .. ఎవరూ ఇక్కడికి రారు .. అంటున్నాడు భూపతి ..
నా మీద నమ్మకం లేదా ? మీరు చెప్పిన పని ఒకటి పూర్తీ చేసినా ?? దీర్ఘం గా అడిగాడు ఆ వీరాస్వామి అన్నవాడు ..
ఆత్మ ని బంధించినావు .. కానీ ఆడు ఘటికుడు .. ఆ కోట రహస్యం తెలిసినోడు .. బయటికి రాకూడదు .. జాగ్రత్త ..
అన్నాడు భూపతి .
(ఇంకా ఉంది )
No comments:
Post a comment