Powered By Blogger

Monday, 20 January 2014

రుదిరసౌధం 54


నీకింకా ఏవన్నా అవసరమున్నాయా ? అడిగాడు భూపతి ..

చెబుతాను .. బలి దొరికాక ఆవిడ ఏం పలుకుతుందో ? వరమే ఇస్తుందో లేక ఇంకో బలి కావలంటుందో .. అన్నాడు

వీరాస్వామి ..

ఇంకో బలా ? కష్టం .. ఊర్లో ఆ పట్నం వాళ్ళు ఉన్నారు .. ఆవులిస్తే ప్రేవులు లెక్కెట్టే ట్టు ఉన్నారు .. వాళ్ళు

వెళ్ళేదాకా కొంచెం జాగ్రత్త గా ఉండాలి .. అన్నాడు భూపతి గంభీరం గా .

వాళ్ళ మీద నా పొడి చల్ల మంటారా ? చెప్పండి .. ఊరొదలి పోతారు .. ఊరొదలంగనె ప్రాణాలు గాల్లో కలసి పోతాయి

.. అన్నాడు ఆ వీరాస్వామి ..

ఆ విషయం తర్వాత .. ముందు ఈ ఘటికుడ్ని జాగ్రత్తగా పెట్టు అన్నాడు భూపతి ..

భూపతి అలా అన్న తర్వాత .. వీరాస్వామి అక్కడే నేల మీద కూ ర్చుని ఏవేవో మంత్రాలు చదివాడు .. తరువాత

చిన్న గోతిని తవ్వాడు .. తను తెచ్చిన జోలె లాంటి సంచీ లోంచి చిన్న బుడ్డి లాంటి దాన్ని తీసి పాతి పెట్టాడు ..

తరవాత  మళ్ళి దానిపై మట్టి ని యధావిధి గా వేసి మంత్రాలేవో చదివి .. అక్కడ నుంచి లేచాడు ..

చెట్టు చాటు నుంచి అంతా గమనిస్తున్న రచన కి అక్కడ జరిగిందేది అర్థం కాలేదు .. కానీ భూపతి ఏదో తప్పు

చేస్తున్నాడని మాత్రం అర్థ మయింది ..

అయ్యింది స్వామీ .. పొద్దు గుంకాక ఇక్కడి కొచ్చి పూజ మొదలెడతా .. అన్నాడు

వీరాస్వామి ..

సరే .. పద .. అని భూపతి ముందు కి నడిచాడు .. వీరాస్వామి అక్కడి నుండి

కదిలాడు ..

వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారని నిర్థారించుకొన్నాక చెట్టు చాటు నుండి బయటికి వచ్చి వాల్లిద్ద్దరు అంత

వరకూ నిలబడ్డ స్థలం దగ్గర కి వచ్చి నేల ను పరికించి చూసింది రచన .

ఆమె కి అక్కడంతా మామూలు గానే కనబడింది .. నేల ని తవ్వి ఏదో దాచిపెట్టిన ఆనవాళ్ళు లేవు ..

స్ట్రేంజ్ .. నా కళ్ళ ముందే అతను ఏదో పాతి పెట్టాడు .. మరి నాకేం ఇక్కడ కనబడటం లేదు .. ఈ భూపతి ఏం

చేస్తున్నాడో ? బలి అన్నాడు .. రాముడి గురించే కాదు కదా .. అయ్యో .. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది ..

ఒకదాని తర్వాత ఒకటి సమస్య లు ముందు నిలుస్తూనే ఉన్నాయి .. కానీ దేనికి పరిష్కారాలు ,సమాధానాలు

అంతు చిక్కడం లేదు .. ఈ బసవరాజు ఏమయ్యాడో .. ఇంకా ఇక్కడ వేచి ఉండి ప్రయోజనం లేదు .. యష్ వాళ్ళు

నాకోసం వెదుకుతున్నరొ ఏమో అని వెనక్కి తిరిగింది రచన ..

మహల్ వైపు వచ్చిన దారినే తిరుగు బాట పట్టింది రచన .
                                                   *******************************

మహల్లొకి వెళ్ళిన యశ్వంత్ కి విధాత్రిని ఎలా కలవాలో అర్థం కాలేదు .. అప్పటికి మెల్లిగా రెండు సార్లు రాకుమారీ

అని పిలిచాడు .. కానీ ఫలితం లేదు ..

ఏం చేయాలి ? అసలు విధాత్రి ని కలవట మెలా ? అని ఆలోచించాడు ..

అప్పుడు గుర్తొచ్చింది అతడికి .. అసలు రచన లేకపోతె విధాత్రి ఎలా వస్తుంది ?రచన ఉంటె కదా ... ఆమె శరీరం

లోకి విధాత్రి రాగలుగు తుంది .. రచనని మహల్లొకి పిలుచుకు వస్తే ... ఆ ఆలోచన  వచ్చిందే తడవుగా మహల్

బయటికి నడిచాడు యశ్వంత్ .. కానీ శివ లోపలికి వస్తూ కనబడ్డాడు ..

యష్ .. లోపలే సమస్యా రాలేదు కదా .. అన్నాడు శివ ..

లేదు శివ . రచన ఎక్కడ ? అన్నాడు యశ్వంత్ .

తను లోపలి కి రాలేదా ? బయట లేదే .. అన్నాడు శివ ..

అవునా ? ఇంతవరకు ఇక్కడే ఉంది కదా .. అన్నాడు యశ్వంత్ ..

అవుననుకో .. నేను మహల్ వెనుక వైపు నుండి వచ్చేసరికి తను కనబడలేదు .. లోపలికి వచ్చిందనుకున్నాను

యష్ .. అన్నాడు శివ ..

ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది .. పద వెతుకుదాం అన్నాడు .. యష్ ..

అని ఇద్దరూ మెట్లు దిగి కిందకి వచ్చేలోగా గేటు తీసుకుంటూ రచన లోపలికి వస్తూ కనిపించింది ..

యష్ .. రచన బయట నుండి వస్తుందేంటి ? అన్నాడు శివ ..

అవును .. వెళ్లి అడుగుదాం పద .. అని రచన వైపు ఇద్దరూ నడిచారు ..

తన వైపు వస్తున్నా శివ ,యష్ లను గమనించి .. అయిపొయింది .. వీళ్ళు నన్ను వెతికినట్లున్నారు .. నిజం

చెప్పెయడమే మంచిదేమో .. అనుకొని .. యష్ .. కంగారు పడ్డారా ? అంది చిరునవ్వు తో ..

ఎక్కడకి వెళ్లావు ? అన్నాడు యశ్వంత్ కొంచెం కోపం గా ..

యష్ .. నీతో ,శివ తో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి .. ముందలా కూర్చుని మాట్లాడుకుందాం .. అంది రచన .

సరే .. అని దగ్గరలోనే ఉన్న మండపం మెట్ల మీద కూర్చున్నారు ..

చెప్పు అన్నాడు యశ్వంత్ ..

(ఇంకా ఉంది )


No comments: