యష్ .. నేను బసవరాజు కోసం సమాధి దగ్గర కి వెళ్ళాను .. అంది రచన .
వ్వాట్ ? రచనా .. ఎందుకిలాంటి పనులు చేస్తావు ? వూళ్ళో పరిస్థితులు వేరేగా ఉన్నాయి .. మనం ఒంటరిగా
ఎక్కడకి వెళ్ళటం మంచిది కాదు .. నువ్వెందుకు అర్థం చేసుకోవు ? ఆవేశం గా అన్నాడు యశ్వంత్ .
రచన మొహం చిన్నబోయింది
యష్ .. నువ్వు ఆగు .. అని రచన వైపు తిరిగి .. రచనా నువ్వు రాముడి హత్యకొసమ్ బసవరాజు ని అడగటానికి
వెళ్ళావు కదూ .. అన్నాడు శివ ..
అవునని తల ఊపిన్ది రచన ..
బసవారాజేమన్న చెప్పాడా కుతూహలం గా అడిగాడు యశ్వంత్ .
ఎందుకు నీకు చెప్పాలి యష్ .. నేను అక్కడికి వెళ్లానని తిట్టావు గా .. మీ అందర్నీ పట్టుకు వెళ్తే బసవరాజు నన్ను
కలవడు .. కోపం గా అంది రచన ..
కోపం తో ఎర్రబారిన ఆమె మొహం చూసి నవ్వేసాడు యశ్వంత్ ..
శివా .. మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం .. నా రచన అలిగింది .. నేను తనని కాస్త కన్విన్స్ చేయాలిగా ..
అన్నాడు యశ్వంత్ ..
సరే యష్ .. మీరూ త్వరగా వచ్చేయండి .. అన్నాడు శివ చిరునవ్వుతో
నువ్వుండు శివా .. నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు ? ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నాను కదా అంది రచన
ఏం చేస్తాం మేడం రచనా ? యశ్వంత్ నా బాస్ .. తన ఆజ్ఞ పాటించక తప్పదు .. ఐనా మీ లవ్ బర్డ్స్ ఇద్దరికీ
కాసేపు మాట్లాడు కోవటానికి సమయమే చిక్కటం లేదు .. కాసేపు మాట్లాడుకోండి .. అన్నాడు శివ .
అయ్యో .. ఒంటరిగా తిరగకూడదు శివా .. అసలే వూళ్ళో పరిస్థితులు బాగాలేవు .. అంది రచన ..
శివ గట్టిగా నవ్వి నువ్వు యశ్వంత్ కి కరెక్ట్ రచనా .. ప్రస్తుతానికైతే మీ ఇద్దరి మధ్య నేను ఉండను .. బాయ్ ..
త్వరగా వచ్చేయండి .. అని వెళ్ళిపోయాడు శివ .
బుంగమూతి పెట్టిన రచన వంక ఆరాధన గా చూసాడు యశ్వంత్ ..
నా బంగారం కోపం పోవాలంటే ఏం చేయాలి ? అన్నాడు యశ్వంత్ ...
నా కోపం నువ్వేం పోగొట్టక్కరలేదు .. నేనేమన్నా చిన్నపిల్లనా ? నన్ను నేను రక్షించుకోలేక పోవటానికి ? కోపం గా
అంది .
నాకు తెలుసు రచన తెలివైంది ,చాలా ధైర్యస్థురాలు ,తను ఎలాంటి పరిస్థితి నైనా హేండిల్ చేయగలదు అని .. బట్
ఏం చేయను చెప్పు ? ప్రేమ మరి .. ఎక్కడ నా ప్రియురాలికి ముళ్ళు గుచ్చుకుంటుందో అన్న భయం ..
అన్నాడు యశ్వంత్ .. ఆమె కళ్ళలోకి చూస్తూ ..
ఆమె కోపం చటుక్కున ఎగిరిపోయింది ..
సారీ యష్ .. అంది చెవులు పట్టుకుంటూ ..
ఆమె రెండు చేతుల్ని ఆమె చెవుల మీదనించి తీసి ఆమె తల ని తన ఒడి లో పెట్టుకొని .. ఐ లవ్ యు రా .. నిన్న
సత్య బాధ అర్థమయింది కానీ నా బాధ అర్థం కాలేదా ? అన్నాడు ఆమె చెవి దగ్గర తన పెదవులని పెట్టి ..
ఆమె అతని ఒడిలో కళ్ళు మూసుకొని అంది .. నాకు తెలుసు .. కాసేపు నిన్నలా అల్లరి పెడదామని .. అంది రచన ..
అమ్మ దొంగా .. అని ఇంకెప్పుడు అలా ఒంటరిగా వెల్లొద్దురా .. అన్నాడు యశ్వంత్ ..
ఆమె అతని ఒడి లోంచి లేచి అతని చేతిని తన చేతిలోకి తీసుకొని .. ప్రామిస్ .. ఇంకెప్పుడు వెళ్ళను అంది రచన
సరే .. ఇప్పుడు చెప్పు అసలేమయింది ? బస్వరాజుతో మాట్లాడావా ? అన్నాడు యశ్వంత్ ..
యష్ .. ఆ మాట ఎత్తగానే ఆమె మొహం సీరియస్ గా మారిపోయింది ..
యష్ .. నాకెందుకో మన అనుమానం నిజం అనిపిస్తుంది .. రాముడు హత్య వెనుక భూపతి హస్తం ఉందని ..
అంది రచన ..
బసవరాజు చెప్పాడా ?అన్నాడు యశ్వంత్
లేదు యష్ . నాకెందుకో ఈసారి బసవరాజు కలవలేదు .. కానీ నే వెళ్ళిన చోటికి భూపతి వచ్చాడు .. అంది రచన .
వ్వాట్ ? భూపతి సమాధి దగ్గరకి వచ్చాడ ? ఆశ్చర్యం గా అన్నాడు యశ్వంత్ .
అవును .. అని తను చూసిన దంతా వివరం గా చెప్పింది రచన
(ఇంకా ఉంది )
1 comment:
very interesting! nice story
Post a Comment