Powered By Blogger

Thursday, 23 January 2014

రుధిర సౌధం 57
చెపుతాను .. చేతబడి ఎలా చేస్తారు అంటే .. ? ముందుగా ఎవరిని చేతబడి చేయాలను కున్నారో వారి గోళ్ళు ,తల

వెంట్రుకలు సేకరిస్తారు .. ఏదో పూజ చేస్తారు .. ఒక బొమ్మ .. ఆ బొమ్మ లో ఆ వ్యక్తి అధీనమై ఉంటాడు .. ఆ

బొమ్మకి మేకు కొడితే ఈ వ్యక్తి కి నొప్పి కలుగుతుంది .. ఆ బొమ్మ ని విసిరితే ఈ వ్యక్తి అల్లంత దూరం లో వెళ్లి

పడతాడు.. ఆ విధం గా ఆ మనిషి ప్రాణం కూడా తీసేయొచ్చు .. అన్నాడు మురారి .

నిజంగా ఇవన్ని జరుగుతాయా ? నమ్మకం గా లేదు .. ఒక వ్యక్తి ని తాక కుండా ఇవన్ని చెయొచ్చా ? అంది రచన

కళ్ళింత చేస్తూ ..

ఇదంతా నిజం అని నేను బలం గా చెప్పలేను .. కానీ భగవంతుడు ఉండటం నిజం .. దానికి సాక్ష్యం మన ఊపిరే ..

ఇక దుష్ట శక్తులు ,దుష్ట విద్యల మాటికొస్తే మహల్లో మనం ఎదుర్కున్న దానిని బట్టి ఏం అనుకోవాలి ? నాగరిక

మానవుడు  ఇలాంటి వాటిని నమ్మలేనంటాడు .. కానీ అనుభవమైతే వీటిని తోసిపుచ్చలేడు .. నిప్పు లేందే పొగ

రాదు..  ఇంతో కొంతో వీటిలో నిజం లేక పోతే ఇప్పుడు మనం వీటికోసం మాట్లాడుకొనే పరిస్థితే ఉండదు కదా ..

అన్నాడు మురారి

నిజమే మురారి చెప్పింది వింటే నాకెందుకో రాముడి హత్య ఇలాగే జరిగిందనిపిస్తుంది .. అందుకే రాముడి ఒంటి

మీద ఎవరి చేతి గుర్తులు లేవు .. కానీ రాముడి శవం మహల్ దగ్గరకి ఎలా వచ్చింది ? అన్నదే ఆలోచిస్తున్నాను

..అన్నాడు యశ్వంత్ ..

అదీ వశీకరణ విద్య కావొచ్చు .. ఈ మథ్య కొన్ని సినిమాల్లో చూపించటం

లేదూ ... మనుషులు ఏదో మంత్రం వేసి నట్లు అలా ఎక్కడికో వెళ్ళిపోతూ

ఉంటారు .. అన్నాడు శివ ..

శివ చెప్పింది కుడా కొంతవరకు నిజమే యశ్వంత్ .. ఇది కూడా చేతబడి లో

భాగమే .. చేతబడి ఎవరికి చేయాలనుకుంటున్నారో ఆవ్యక్తి ని కావాల్సిన స్థానానికి తీసుకువేల్లోచ్చు .. ఆ వ్యక్తి కి

కూడా తెలియకుండా ..


అతడే అక్కడకి స్వయం గా మంత్రప్రభావితుడై వెళ్ళిపోతాడు .. అన్నాడు

మురారి ..

వావ్ .. చిక్కుముళ్లన్నీ వాటంతట అవే వీడిపోతున్నట్లు అనిపిస్తుంది ..

యు ఆర్ గ్రేట్ మురారీ .. రాముడి హత్య ..ఈ పధ్ధతి లోనే జరిగుండాలి ..

మహల్ దగ్గరికి రాముడు వెళ్ళేలా వాళ్ళే చేసుంటారు .. ఎందుకంటే

రాముడు మహల్ దగ్గర చనిపోతే అనుమానం అమావాస్య పిశాచి

వైజయంతి మీదకి పోతుంది .. చాల తెలివైన వాడు భూపతి.. అన్నాడు యశ్వంత్ .

కానీ యష్ .. మనమెలా ఇదంతా ప్రూవ్ చేయగలం ? అన్నది అo తా  రెండు బుగ్గల మీద చేతులు వేసుకుని

వింటున్న రచన ..

చేతబడి చేసిన వాడు ,చేయించిన వాడు నిజాలు చెప్పాలి .. అంతే .. అన్నాడు శివ ..

కానీ వాళ్ళెందుకు నిజాలు చెప్తారు ? అంది సత్య .

వాళ్ళు చెప్పరు మనమే చెప్పించాలి .. ఒక నిజం ఒకడి లోనే దాగిపోతే ఆ నిజం బయటికి రావటం కొంచెం కష్టమే

కావొచ్చు.. కానీ అదే నిజం ఒకరి కంటే ఎక్కువ మంది దగ్గర దాచబడితే .. ఎక్కడో ఒక ఆ రహస్యం బలహీన

పడిపోక తప్పదు .. మనిషన్న వాడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది .. ఆ బలహీనత ఎదుటి వాడికి బలం కావొచ్చు ..
అన్నాడు యశ్వంత్ ..

 అర్థమైంది యశ్వంత్ .. కానీ ఇదంతా మన అనుమానం .. ముందు నిజమో కాదో నిర్థారించుకోవాలి .. అంది రచన .

నిజమే .. ముందు మన అనుమానం నిజమో కాదో తేల్చుకోవాలి .. అందుకోసం రేపు బసవ రాజు సమాధి దగ్గర కి

వెళ్దాం .. అన్ని నిజాలు అక్కడ తేలి పోతాయి అన్నాడు యశ్వంత్ .

ఓకే యష్ .. రేపు మన ముగ్గురం అక్కడకి వెళ్దాం .. అన్నాడు శివ ..

రేపటి టాస్క్ కి నేను కూడా సిద్ధమే యష్ .. నేను వస్తాను .. అన్నాడు మురారి .

నువ్వా ? నువ్వింకా రెస్ట్ తీసుకోవాలేమో .. అన్నాడు శివ ..

నా ఆరోగ్యం బాగానే ఉంది .. ఇలా ఇక్కడ కూర్చోడానికి రాలేదు నేను అన్నాడు మురారి ..

యశ్వంత్,శివ ,రచన ముగ్గురూ సత్య వంక సందేహం గా చూసారు ..

ఏంటి ? అంతా నా వైపు చూస్తున్నారు .. నేను కూడా సిద్ధమే .. నాలో ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు .. అంది

సత్య .

అంతా నిజమా అన్నట్లు చూశారు ఆమె వైపు ..

నమ్మండి యష్ .. అవర్ సత్య ఇజ్ బాక్ ... అన్నాడు మురారి కన్ను గీటుతూ ..

అంతా హాయిగా నవ్వేసారు .

(ఇంకా ఉంది )3 comments:

Anonymous said...

Good and Nice

సతీష్ కొత్తూరి said...

మీ బ్లాగు ఇప్పుడే చూడడం. నవల ఇంట్రస్టింగ్ గా ఉంది.
మొదటి నుంచి చదువుతాను... సమయం దొరికినపుడు... మంచి రచయిత మీరు. అలాగే మీకు కామెంట్ పెట్టినపుడు లెటర్ వెరిఫికేషన్ అడుగుతోంది. అది డిసేబుల్ చేస్తే చాలా మంది స్పందించే అవకాశం ఉంటుంది. డిసేబుల్ చేయడం మీకు ఒకవేళ తెలియకపోతే.. ఆప్షన్ ఎలాగో నేను చెప్పగలను. ధన్యవాదాలు.

రాధిక said...

ధన్య వాదాలు సతీష్ గారూ ..
మీరు చెప్పే సలహా ని తప్పక పాటిస్తాను .
మీ ప్రశంస కి కూడా శత కోటి ధన్యవాదాలు