అప్పుడే తెలవారుతోంది .. తూర్పు ఎర్రగా ఉంది .. పల్లె నిద్రలేవటానికి సమాయత్త మవుతూ వుంది ..
యష్ .. తెల్లవారక ముందే మనం ఇక్కడ కొఛ్చెసామ్ .. బాగానే ఉంది .. కాని రచన ఇంకా రాలేదు .. తను రాక
పొతే మనకి దారెలా తెలుస్తుంది .. అన్నాడు శివ .
రచన వస్తుంది శివా .. తను బంగ్లా నుండి రావాలి కదా ఆలస్యం కావొచ్చు .. బట్ రచన త్వరగానే వస్తుంది .. తన
ఉత్సుకత గురించి మనకి తెలియదా .. అన్నాడు యశ్వంత్ .
యష్ .. రచన వస్తుంది అదుగో .. అన్నాడు మురారి ..
ఉదయపు కాంతి ఆమె మొహం మీద పడి అందం గా మెరుస్తుంది ..
కంగారు గా వీళ్ళ దగ్గరకి పరుగున వచ్చింది రచన ..
లేట్ అయ్యానా ? అంది వగరుస్తూ ..
ఏం చేయను ? రత్నం నేనెక్కడికి వెళ్ళినా వెనుక వస్తానంటాడు .. ఆ బాలయ్య నిద్రలేవక ముందే నేను వచ్చేయాలి
గా .. వెంగమ్మ ఒక్కతే లేచింది .. మార్నింగ్ వాక్ అని చెప్పి వచ్చేసా .. అంది రచన .
రచనా .. ముందు మనం ఎటు వెళ్ళాలో చెప్పు .. అన్నాడు మురారి .
అటు .. ఆ మట్టి రోడ్ లో కొంచెం నడిస్తే ఒక అడవి వస్తుంది .. అక్కడికే వెళ్ళాలి మనం .. అంది రచన .
ఐతే పదండి .. మనల్ని ఎవరూ గమనించక ముందే మనం ఇక్కడి నుంచి ఆ అడవిలోకి వెళ్ళాలి అని యశ్వంత్
ముందుకి సాగాడు . మిగతా వారంతా యశ్వంత్ ని అనుసరించారు .. కాసేపట్లో అందరూ మట్టి రోడ్ దాటి అడవిలోకి
ప్రవేశించారు .. రచన ముందు వెళ్తుంటే మిగిలిన వాళ్లు ఆమెని అనుసరించారు .. ఇంతలో అటునుంచి ఎవరో
వస్తున్న సవ్వడి వినిపించింది ..
ఎవరో వస్తున్నారు అంతా తలో దిక్కు దాక్కోండి .. అంది రచన .
యశ్వంత్ రచన ఒక వెడల్పాటి చెట్టు వెనక నక్కారు .. శివ ,మురారి,సత్య అక్కడున్న పొదల వెనుక దాక్కున్నారు .
క్రమేపీ ఆ వ్యక్తి దగ్గరైన సవ్వడి వినిపించింది .. రచన కొo చెం తొంగి చూసింది .. అతడు వీరాస్వామి ..
యష్ .. వాడే .. ఆ వీరాస్వామి .. యష్ చెవిలో గొణిగింది మెల్లిగా ..
యశ్వంత్ కూడా కొంచెం తొంగి చూసాడు .. ఆగి ఆగి .. చుట్ట తాగుతూ వెళ్తున్నాడు ..
యశ్వంత్ అతడిని పరీక్షగా చూసాడు .. నిద్రలేని కళ్ళు .. వాటం చూస్తే ఊరి వైపే వెళ్తున్నట్లు ఉన్నాడు .. అతడు
అక్కడనుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకి వచ్చారు ..
ఎవరై ఉంటాడు అడవిలోంచి వస్తున్నాడు అన్నాడు శివ ..
శివా .. వాడే ఆ వీరాస్వామి .. పోన్లే వాడిప్పుడే బయట కి వెళ్తున్నాడు .. ఈలోపే మనపని కానిచ్చుకోవాలి .. అంది
రచన.
లెట్స్ గో గైస్ .. వాడు వచ్చేలోపే మనం అక్కడకి చేరాలి అని ముందుకి నడిచాడు యశ్వంత్ ..
అందరూ కలసి కాసేపట్లో బసవరాజు సమాధి దగ్గరకి చేరుకున్నారు ..
శివ ఆ ప్రాంతాన్ని అంతటినీ వీడియొ తీస్తున్నాడు .. మురారి సమాధి ని పరీక్ష చూస్తూ అదెప్పుడు కట్టబడిందో
అంచనా వేయసాగాడు ..
ఇదుగో ఇక్కడే ఏదో పాతి పెట్టారు .. అని వీరస్వామి పాతి పెట్టిన స్థలం చూపించింది రచన యశ్వంత్ కి ..
యశ్వంత్ .. ఓసారి ఇటు చూడు .. ఇక్కడ ముగ్గు వేసి ఉంది .. నిమ్మకాయలు కూడా .. గట్టిగా అరచింది సత్య ..
సత్య నిలుచున్న దగ్గరికి అందరూ పరుగున వెళ్లారు .. శివ వెంటనే ఫోటో తీసాడు ..
చూసావా యష్ .. మన అనుమానం నిజమే ఇదంతా క్షుద్రపూజలె .. ఇలాంటి ముగ్గులు నిమ్మకాయలు .. ఆ రక్తం ..
ఇంకా అనుమానం అక్కర్లేదు .. అన్నాడు మురారి .
నిజమే గానీ మురారి .. రాముడు చనిపోయాడు కదా .. కానీ ఈ ముగ్గు, నిమ్మకాయలు చూస్తే నైట్ వీరస్వామి
ఇక్కడే ఉన్నట్లున్నాడు ... అంటే వీల్లింకా ఈ పని కంటిన్యూ చేస్తున్నారా ? అన్నాడు యశ్వంత్ .
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment