మే బి .. యష్ . వాళ్ళ ఉద్దేశ్యం లో రాముడు ఒక పావు మాత్రమె .. ఐ మీన్ బలి ఇచ్చారు .. అంతే .. అన్నాడు
మురారి.
సరే .. ముందు వాళ్ళెం పాతి పెట్టారో తెలుసుకోవాలి .. ముందు అక్కడ తవ్వి చూద్దాం .. అన్నాడు యశ్వంత్ .
మళ్ళి అందరు రచన చూపించిన స్థలం దగ్గరకి వచ్చారు ..
ఇక్కడే అని చూపించింది రచన .
నిజమేనా ? ఇక్కడయితే ఏమి పాతి పెట్టిన ఆనవాళ్ళు లేవు .. అన్నాడు శివ .
ఉండొచ్చు .. అంది రచన .
మురారి అందుబాటు లో ఉన్న ఓ కర్ర తీసుకుని అక్కడ తవ్వటం మొదలు పెట్టాడు . శివ కూడా మరో కర్ర తీసుకొని
మురారి కి సహాయం చేసాడు ..
.jpg)

యశ్వంత్ ,రచన తీక్షణం గా మట్టి వైపే చూస్తున్నారు ..
సత్య వాళ్ళు తవ్వుతుంటే మట్టి పక్కకి తొలగిస్తోంది ..
శివ కర్ర కి ఏదో తగిలింది .. ఏదో ఉంది అని మరింత ఉత్సాహం గా
తవ్వసాగాడు శివ ..
మట్టి పొరలు లోంచి ఓ జాడీ బయట పడింది .. దాన్ని చూడగానే రచన
మొహం వికసించింది .. దొరికింది... అంది .
యశ్వంత్ తన రెండు చేతులతో ఆ జాడీ ని బయటకి తీసాడు ..
ఇదొక గాజు జాడీ .. అన్నాడు శివ .
ఇందులో ఏమి లేదు అంది సత్య ..
ఉంది సత్యా .. ముందు ఆ మట్టినంతా ఆ గోతిలో వేసి పూడ్చేయండి అన్నాడు యశ్వంత్ ..
మురారి, శివ ఇద్దరూ ఆ పనిలో పడ్డారు ..
యష్ జాడీ మూత తీద్దామా ? అoది రచన ..
ఆ మూత తీయటానికి ప్రయత్నించాడు యశ్వంత్ ..రాలేదు ..
ఇది చాలా టైట్ గా బిగించి ఉందే .. రావటం లేదు అన్నాడు వగరుస్తూ యశ్వంత్ ..
అందరూ ఒకరి తర్వాత ఒకరు గట్టి ప్రయత్నమే చేసారు .. ఐన ఫలితం లేకపోవటం తో .. యష్ .. ముందు ఇక్కడి
నుంచి వెల్లిపోదాం .. ఆ వీరాస్వామి వస్తే సమస్య అవుతుంది .. అంది రచన .
సరే అని ఆ జాడీ ని తన భుజానికి ఉన్న బాగ్ లో భద్రపరచి లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ ..
మరి కాసేపట్లో వారు అడవి దాటారు .. ఇంకాసేపట్లో ఇంటికి చేరారు ..
ఇంటికి చేరాక మళ్ళి జాడీ మూత తీయటానికి ప్రయత్నించారు ..
అబ్బా !ఎలా తీయటం దీన్ని ? అని విసుక్కుంది సత్య ..
నాకిలా ఇవ్వు మరోసారి ప్రయత్నించనీ .. అని రచన అడిగింది ..
బరువుగా ఉన్న ఆ జాడీ ని రచన అందుకొనే లోపు సత్య చేతి నుండి కిందకి జారి నాలుగు ముక్కలైంది ఆ జాడీ ..

అంతే .. ఆ జాడీ లోంచి విసురుగా ఓ గాలి వచ్చి తక్షణం
మాయమయింది ..
అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ..
ఏం జరిగింది ? జాడీ లోంచి బసవరాజు వెళ్ళిపోయాడా ?
వణుకు తున్న గొంతు తో అంది సత్య ..
అవును మనకి కనీసం థాంక్స్ కూడా చెప్పకుండానే ..
అన్నాడు శివ ..
రచన చిన్నగా నవ్వి .. జాడీ పగిలితే పగిలింది .. బసవరాజు కి విడుదల .. ఐ యాం హ్యాపీ .. అంది నిట్టుర్చుతూ ..
కానీ యష్ .. వాళ్లకి మనమే ఆ జాడీ తీసామని తెలియడం పెద్ద కష్టం కాదు .. కాబట్టి మనకి భూపతి ఇక ప్రత్యక్ష
శత్రువే కాగలడు .. అన్నాడు మురారి .
అవును మురారి .. అడుగడుగునా ప్రమాదాలు ఉండొచ్చు .. మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అన్నాడు యశ్వంత్
ఒక్క విషయం లో మాత్రం నాకు హ్యాపీ గా ఉంది .. రాముడి హత్య వైజయంతి చేయలేదు .. సో ఆరోజు అమావాస్య
హిస్టరీ ని మనం నిజం గానే బ్రేక్ చేసాం .. అన్నాడు శివ .
"కానీ ఇటు భూపతి , అటు వైజయంతి ఇద్దరూ ఇప్పుడు అవకాశం కోసం చూస్తారేమో " మనసులోనే
అనుకున్నాడు యశ్వంత్ .
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment