Powered By Blogger

Tuesday, 28 January 2014

రుధిర సౌధం 60యష్ .. ఏంటి ? చాలా దీర్ఘాలోచన లో ఉన్నట్టు ఉన్నావు ? యశ్వంత్ దగ్గరికి వచ్చి అంది రచన .

ఏం లేదు రా ... భూపతి నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నా .. మొన్న రాముడి చావు విషయం లో

అతడ్ని మనం ఎదురించి నందుకు మనకి భోజనం కట్ చేసాడు .. ఇప్పుడు మనం వాళ్ళు దాచి పెట్టిన జాడీ

మాయం చేశాం .. కాబట్టి మనల్ని ఈ వూరి నుంచి పంపిoచేయాలని  ఇప్పుడు చూస్తాడు .. అతని ఎత్తుగడ కి

ముందు గానే మనం పై ఎత్తు వేయాలి కదా .. అదే ఆలోచిస్తున్నా .. అన్నాడు యశ్వంత్ .

దానికేం టెన్స్ పడాల్సిన అవసరం లేదు యశ్వంత్ .. నువ్వేం వర్రీ కాకు .. పరిస్థితి శ్రుతి మించితే ఏం చేయాలో

నాకు  తెలుసు .. నా దగ్గర బ్రహ్మాస్త్రమే ఉంది .. కాని పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని  ఆలోచిస్తున్నాను .. అంది

రచన చిరునవ్వు తో .

నీ బ్రహ్మాస్త్రం ఏంటో మరి ? నాకు చెప్పవూ ... గోముగా అడిగాడు యశ్వంత్ ..

అబ్బా .. అప్పుడే చెప్పేస్తామేంటి ? లెట్స్ వెయిట్ సం టైం .. అంది రచన కొంటెగా ..

అయిపోయాయా కబుర్లు ? ఇద్దరూ ఒకరి చెవి ఒకరు కొరికేసు కుంటున్నారు .. ఇక ఇన్వెస్టిగేషన్ మాట

దేవుడెరుగు... మనం వీళ్ళిద్దరికీ కాపలా కాయాల్సిందే .. అంది సత్య నవ్వుతూ ..

శివ ,మురారి నవ్వేసారు .

అంతలేదు సత్యా .. ఇక్కడ రచన .. అంది రచన కల్లెగరేస్తూ .

సరేలే .. ఏం చేస్తాం ? ఎంత వారలైన కాంత దాసులే .. యశ్వంత్ లాంటి వాడే నీకు గులాం ఐనప్పుడు మాకెవ్వరికి

నిన్ననే ఛాన్స్ ఉంటుందా ? అంది సత్య .

అది సరే  గాని సత్యా .. ఆకలేస్తుంది .. తినడానికేమన్నా .. ఉన్నాయా ? అంది రచన .

మనం తెచ్చుకున్న కేక్స్ ,బిస్కట్స్ ,నూడుల్స్ పాకెట్స్ అన్ని అయిపోయాయి .. కేవలం కొన్ని ఏపిల్స్ మాత్రమె

ఉన్నాయి .. నేనవి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది సత్య .

యష్ .. మనం ఫుడ్ కి కూడా ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలి .. ఓసారి ఈ వూరు దాటి బయటకి వెళ్తే .. మన వాళ్లకి

ఫోన్స్ చేసుకోవొచ్చు .. ఏవన్నా తినడానికి తెచ్చుకొవోచ్చు.. అన్నాడు శివ .

ఓకే శివా .. వెళ్దాం .. కానీ అందరం ఒకేసారి ఊరు వదిలి వెళ్ళడం మంచిది కాదు .. ఒకసారి కొంతమంది ,మరోసారి

కొంత మంది .. అలానే వెళ్దాం .. పెట్రోల్ కూడా స్టాక్ పెట్టుకోవాలి .. అన్నాడు యష్ .

సరే .. అన్నాడు శివ .. ఈలోపు సత్య ఏపిల్స్ పట్టుకొచ్చింది .

 యష్ .. ఈ పక్కనే చిన్న హోటల్ ఉంది .. ఇడ్లి దొరుకుతుంది .. నేను వెళ్లి అందరికి తీసుకొస్తాను .. అన్నాడు

మురారి లేస్తూ .

సరే వెళ్ళు .. అని తలో ఆపిల్ అందుకున్నారు ..

ఇంతలో ఎవరో తలుపు కొట్టిన సవ్వడి వినిపించింది ..

బయటకి వెళ్ళడానికి గుమ్మం వరకు నడిచిన మురారి .. ఓ క్షణం ఆగి వెనక్కి తిరిగి వీరందరి వైపు ప్రస్నార్థకం గా

చూశాడు .

రత్నం ఏమో .. అంది రచన నోట్లో ఆపిల్ తీస్తూ ..

తలుపు తీయమన్నట్లు కళ్ళ తోనే సoజ్ఞ చేసాడు యశ్వంత్ .


మురారి తలుపులు తీసాడు .. ఎదురుగా సరస్వతి ..

మురారి ఆమె వంక ప్రశ్నార్థకం గా చూశాడు ..

యశ్వంత్ బాబు ఉన్నారా ? బలవంతం గా మాట

పెగల్చుకొని అంది సరస్వతి .

సరస్వతి .. యశ్వంత్ .. అని వడివడిగా గుమ్మం దగ్గర

కి నడచి .. సరస్వతీ .. రా లోపలికి .. అంది రచన.

ధాత్రమ్మ ... భర్త చనిపోయినాక ఎవరింటా కాలు

పెట్టకూడదు ఈ ఊరిలో .. కానీ నేను కూసింత మీతో

మాటాడాలి ..

అంది సరస్వతి .

ముందు లోపలికి రా సరస్వతీ .. ఏం ఫరవాలేదు .. మాకలాంటి భావాలేం లేవు కదా .. అంది రచన .

(ఇంకా ఉంది )

3 comments:

సతీష్ కొత్తూరి said...

మొత్తం చదువుదామని ట్రై చే్స్తున్నా గానీ.. బిజీబిజీలో పడి
అక్కడక్కడే చదువుతున్నాను. చాలా బాగా రాస్తున్నారు.
పబ్లిష్ చేయొచ్చు ఈ నోవెల్ ని. స్వాతిలో ఫ్లాట్ ఫాం ఉంది కదండీ.. ట్రై చేయలేదా...

రాధిక said...

లేదు సతీష్ గారూ .. నేనింత వరకు ప్రయత్నించలేదు .. ఎలా అప్రోచ్ కావాలో కూడా నాకు తెలీదు .. ఇదే కాదు మరో రెండు నొవెల్స్ కూడా రాస్తున్నాను . బట్ .. అవి నాదగ్గరే ఉన్నాయి .. అంతే .. రాయటం నాకిష్టం .. బ్లాగ్ లో రాస్తే అందరు చదువుతారన్న ఆశ తప్ప పేరు కోసం గాని డబ్బు కోసం గానీ ఆలోచించలేదు .. ఎనీవే .. మీరిచ్చిన ప్రోత్సాహానికి చాలా సంతోషం . నవల చదువుతూ ఉండండి .

రాధిక said...

లేదు సతీష్ గారూ .. నేనింత వరకు ప్రయత్నించలేదు .. ఎలా అప్రోచ్ కావాలో కూడా నాకు తెలీదు .. ఇదే కాదు మరో రెండు నొవెల్స్ కూడా రాస్తున్నాను . బట్ .. అవి నాదగ్గరే ఉన్నాయి .. అంతే .. రాయటం నాకిష్టం .. బ్లాగ్ లో రాస్తే అందరు చదువుతారన్న ఆశ తప్ప పేరు కోసం గాని డబ్బు కోసం గానీ ఆలోచించలేదు .. ఎనీవే .. మీరిచ్చిన ప్రోత్సాహానికి చాలా సంతోషం . నవల చదువుతూ ఉండండి .