Powered By Blogger

Wednesday, 29 January 2014

రుధిర సౌధం 61కొంచెం తటపటాయించినా లోపలికి అడుగు పెట్టింది సరస్వతి .

సరే నేను టిఫిన్ తీసుకొస్తాను .. అని మురారి బయటికి  వెళ్ళాడు ..

తలుపులు దగ్గరగా మూసి .. పద సరస్వతీ .. అంది రచన .

ఇద్దరూ యశ్వంత్ వాళ్ళు కూర్చున్న చోటికి వచ్చారు ..

ఎలా ఉన్నావు సరస్వతీ ? ఆర్ద్రం గా అడిగాడు యశ్వంత్ ..

సత్య .. "ఈమె నా .. వీళ్ళందరూ చెప్పే సరస్వతి"" .. అని మనసులో అనుకుంది .

యశ్వంత్ ప్రశ్న కి కళ్ళ నీళ్ళ పర్యంత మయింది సరస్వతి ..

బాధ పడకు సరస్వతీ .. నీకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది .. కాని గుండె నిబ్బరం చేసుకోక తప్పదు .. అంది

రచన .

ధాత్రి గారూ .. ఈ బాధ ఎప్పటి కయినా తప్పదని నాకూ తెలుసు .. కానీ నా భర్త మామూలు గా చచ్చి పోలేదు

కదమ్మా ... నా మనసు నాకు చెబుతోందమ్మ .. వాడి ఆత్మ ఘోషిస్తుందని .. అని వెక్కి వెక్కి ఏడ్చింది సరస్వతి ..

ఎందుకు సరస్వతీ అలా అంటున్నావు ?? అంది రచన ..

యశ్వంత్ ,శివ ,సత్య ఆమె వైపు ఆసక్తి గా చూసారు ..

ఒకే మనసుగా బతికేవోలం .. నాకు తెలవదా ... బాబూ .. ఆరోజు పోలీసు లు వచ్చిండ్రు కదా .. మీతో ఏం సెప్పినారు

? నా పెనిమిటి ని ఎవరో చంపేసిన్రని సెప్పిన్రా ? ఆవేదన గా అడిగింది సరస్వతి .

అవును సరస్వతి .. నీ భర్త ని చంపేశారు .. అది సహజ మరణం కాదు .. అలా అని వైజయంతి కూడా చంపలేదు ..

అనుమానా లున్నాయి .. కానీ ఋజువులు కావాలి .. నేను నీకు మాటిస్తున్నాను .. నీ భర్త ని చంపిన వాడిని

శిక్షించ కుండా మేమీ ఊరి నుండి కదిలేది లేదు ... అన్నాడు యశ్వంత్ .

మాకు భూపతి కన్నా శత్రువు లెవరు బాబూ .. ఆయన ఉన్నోడు .. నేను పోరాడగాలనా ఏమి ? అంది సరస్వతి ..

మేమంతా నీకు తోడుగా ఉన్నాం కదా .  అని సరస్వతీ .. నిన్ను ఓ విషయం అడగాలి .. అన్నాడు యశ్వంత్ .

అడగండి .. అని పమిట చెంగు తో కళ్ళను ఒత్తుకుంది ..

ఆ రోజు రాత్రి .. అదే ఆ అమావాస్య రాత్రి ... ఊరిలో ఎవరూ మహల్ వైపు వెళ్ళరు .. కానీ రాముడు వెళ్ళాడు ..

రాముడు అక్కడ వెళ్ళటం నీకు తెలియదా ? అని అడిగాడు యశ్వంత్ ..

తెలీదు బాబూ .. నిజానికి ఆ డికి ఆ రోజు ఒంట్ల బాలేదు బాబూ .. పెందలకడే పడుకున్నడు .. పనులు ముగించు

కొని నేనూ ,తాత కూడా నిద్దర పోనాం .. ఉదయాన్నే నాలుగింటికి లేవటం మాకలవాటు .. ఉదయం లేసి నప్పటికి

మా మావ లేడు .. ఎక్కడికి పోతడు ? ఏ తోట కాడికో పోయిండను కున్నాను .. కానీ మళ్లి తిరిగి శవమై వస్త డను

కోలే ... అని భోరుమంది సరస్వతి .

సరస్వతీ .. నువ్వో సారి పోలీసు స్టేషన్ కి వొఛ్చి ఈ వివరాలన్నీ చెప్పాలి .. చెబుతావా ? అన్నాడు యశ్వంత్ ..

నేనేనాడు ఆడికి పోలేదు బాబూ అంది .. సరస్వతి .

నువ్వేం భయపడకు మేము నీకు తోడుగా ఉంటాం గా .. ధాత్రి కూడా వస్తుంది .. అన్నాడు యశ్వంత్ .

అయిష్టం గానే వోప్పుకుంది సరస్వతి .

 ఈలోపు  మురారి అందరికి టిఫిన్స్ పట్టుకు వచ్చాడు .

బాబూ .. మీరు తినండి .. నేను వెల్లొస్తాను .. మీతో మాటాడాక నాకు కొంచెం శాంతం గా ఉంది అని లేచింది

.. సరస్వతి .

అదేంటి సరస్వతి .. నువ్వూ మాతో కొంచెం తిను .. ఎప్పుడు తిన్నావో ఏమో అంది రచన .

ఎంత అభిమానం చుపిస్తున్రమ్మ .. అదే పదివేలు .. ఈ ఇంట అడుగు పెట్టినానని భూపతి కి తెలిస్తే ఏమవుద్దో ...

నేను వెల్లొస్తను ,, అని వడి వడి అడుగులతో అక్కడి నుండి సరస్వతి వెళ్ళిపోయింది .

పాపం .. చాలా మంచిది లా ఉంది అంది సత్య ..

ముందు అందరూ టిఫిన్స్ చేయండి .. అన్నాడు మురారి .

అందరూ టిఫిన్స్ చేయడం లో మునిగి పోయారు ..

యష్ .. మొన్న నేను పోలీసు కి ఇన్ఫొర్మ్ చేయటానికి వెళ్ళినప్పుడు గమనించాను .. ఇక్కడ కొంత దూరం లో ఓ

పురాతన గ్రంధాలయం ఉంది .. నాకు తెలిసి ఆ గ్రంధాలయం లో ఈ రాణి మహల్ కోసం ఏమైనా బుక్స్

ఉన్నాయేమో ... అన్నాడు శివ .

గుడ్ ఐడియా శివా .. మనం టిఫిన్స్ కానిచ్చాక వెళ్దాం . అన్నాడు మురారి ..

"ఇక్కడ ఆ మహల్ వారసురాలే ఉంది .. ఈ విషయం తెలిస్తే మీరంతా ఎంత షాక్ అవుతారో .. రచన కి ఈ మహల్

చరిత్ర తెలియకుండా ఉంటుందా ? " అని మనసులో అనుకున్నాడు యశ్వంత్ ..

నాకూ తెలుసుకోవాలనుంది .. మనం అక్కడికి వెళ్దాం అంది సాలోచన గా రచన .. స్పూన్ ని పెదవులపై పెట్టి .

(ఇంకా ఉంది )


1 comment:

sukanya said...

going interesting.. next??