గతుకుల మట్టి రోడ్ మీద సాఫీ గానే ముందుకు సాగుతుంది ఇన్నోవా .
కొంత దూరం లో కనబడుతున్న ఓ పాత కట్టడాన్ని చూపించి .. యష్ .. అదే నేను చెప్పిన గ్రంధాలయం .. అన్నాడు
శివ .
ఓహ్ .. అని దాన్ని పరీక్ష గా చూసాడు యశ్వంత్ .. ""'రాజా విక్రమ సింహ గ్రంధాలయం "" అని వ్రాసి ఉంది దాని
మీద .
ఆ అక్షరాలని చదువుతున్నపుడు రచన పెదవులపై ఓ సన్నని చిరునవ్వు విరిసింది .
ఇది చాలా పురాతన మైనది శివా .. నీ అంచనా సరైనదే కావొచ్చు .. మనకిక్కడ రాణి మహల్ వివరాలు
తెలియొచ్చు . అంది సత్య .
వెహికల్ ఆ గ్రంధాలయం ముందు ఆగింది . అందరూ కిందకి దిగాక శివ ఓ పక్కగా వెహికల్ ని పార్క్ చేసి వచ్చాడు .
మురారి గ్రంధాలయానికి కొన్ని ఫోటో లు తీసాడు ..
ఇక వెళ్దామా ? అన్నాడు యశ్వంత్ ..
అంతా లోపలికి నడిచారు . గ్రంధాలయం మొదటి గదిలో ఓ పాత బల్ల వేసుకుని దాని ముందు ఉన్న కుర్చీ లో
ఒక ముసలాయన ఉన్నాడు ..
లోపలికి వస్తున్న వీరిని కళ్ళద్దాలు తుడుచుకొని మరీ చూశాడు .
ఎవరు మీరు ? వణుకు తున్న గొంతు తో అడిగాడు అందర్నీ నఖశిఖ పర్యంతం గమనిస్తూ ..
తాతా ! ఈ గ్రంధాలయం చాలా పురాతన మైనదని తెలిసి వచ్చాము .. పుస్తకాలవీ ఉన్నాయి కదా ? కాస్త
అనుమానం గానే అడిగింది రచన .
పుస్తకాలకేం ? .. ఉన్నాయి .. కానీ పుస్తకాల పురుగులెక్కడున్నాయి ? వైరాగ్యం తో అన్నాడు .
పురుగులా ? పురుగులేమిటి ? అసహనం గా అంది సత్య .
తాత గారి ఉద్దేశ్యం వేరు సత్యా .. పుస్తకాలు చదివే వాళ్ళు ఇప్పుడు లేరని .. అన్నాడు మురారి .
తాతా మేము కొన్ని పుస్తకాలు చదవొచ్చా ? అడిగాడు యశ్వంత్ అతడిని ..
చదవండి బాబూ .. కానీ నాకు కొంచెం డబ్బు ఇవ్వండి .. కాస్త ఎంగిలి పడి వస్తాను .. దీనం గా అన్నాడు తాత .
వెంటనే శివ 100 రూపాయల నోటు తీసి అతడి చేతిలో పెట్టాడు ..
అతని మొహం వికసించింది .. మీరు చదువు కొండి బాబూ .. నేనిప్పుడే వస్తాను .. అని మెల్లిగా లేచి అడుగులో
అడుగు వేసుకుంటూ బయటికి వెళ్లి పోయాడు .
యశ్వంత్ బృందం లోపలికి నడిచింది .. చాల వరకూ బుక్స్ లేవు . రాక్స్ కొన్ని ఖాలిగా ఉన్నాయి .. మరి కొన్ని
మాత్రం బుక్స్ తో ఉన్నాయి .. అవి కూడా సరైన సంరక్షణ లేక చెదలు పట్టి ఉన్నాయి ..
ఏంటో ఇలా ఉంది లైబ్రరీ .. అంది దుమ్ము పడకుండా ముఖాన్ని స్కార్ఫ్ తో కట్టేసుకుంటూ .. సత్య .
ఇలానే ఉంటుంది .. ఇంకా ఇది ఇప్పటి వరకూ ఉందంటే గొప్పే .. అన్నాడు యశ్వంత్ ..
త్వరగా పని పూర్తీ చేసుకోవాలి .. ఇదెప్పుడు కూలిపోతుందో భయం గా ఉంది .. అన్నాడు మురారి ..
శివ అప్పుడే ఏవో బుక్స్ తిరగేయడం మొదలు పెట్టాడు .
రచన మాత్రం ఆ గ్రంధాలయం గోడల మీదున్న పెయింటింగ్స్ ని శ్రద్ధ గా చూడటం లో నిమగ్న మయింది .
ముందు పని కానీండి .. ఏదన్న పుస్తకం మనకి పనికొస్తుందంటే బాగ్ లో వేసేయండి .. అన్నాడు యశ్వంత్ ..
దొరికిపోతామేమో యశ్వంత్ .. నవ్వుతూ అంది సత్య .
ఒత్తినే ఇక్కడ పుస్తకాలన్నీ మాయ మయి పోయాయను కుంటున్నావా ? అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ కూడా రాక్ లో పుస్తకాలని తిరగేయసాగాడు .. కొన్ని రాజుల కథలు , స్వాతంత్ర పోరాటం గురించి ,కొన్ని
సాహిత్య గాధలు ,మరి కొన్ని సంఘ హితమైన బుక్స్ .. అతని చేతులు ఓ బుక్ మీద ఆగిపోయాయి .. ఆ పుస్తకం
అట్ట కొంత మేర చినిగి పోయి ఉంది .. దాని మీద "విచిత్ర దుర్గం" అని వ్రాసి ఉంది . అతని చేతులు ఆ పుస్తకం
పేజీలను తిప్పుతున్నాయి .. కళ్ళు వికసిస్తున్నాయి .. అలానే గోడకి జారగిల బడి ఆ పుస్తకాన్ని చదవడం
మొదలు పెట్టాడు ..
అందరూ మెల్లిగా ఏదో ఒక పుస్తకం చదవనారంభించారు .
శివా .. గట్టిగా పిలిచాడు యశ్వంత్ ..
యష్ .. ఏవన్నా దొరికిందా ?? అంటూ వచ్చాడు శివ .
సి థిస్ బుక్ .. అన్నాడు యశ్వంత్ .
విచిత్ర దుర్గం ... అంటే ? అన్నాడు శివ .
విచిత్ర దుర్గం అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం .. ఈ చుట్టు పక్కల గ్రామాలు కూడా ఈ విచిత్ర దుర్గం కిందికే వస్తాయి .
ఇప్పుడంటే ఊరి పేర్లు మారిపోయాయి గానీ .. ఒకప్పుడయితే ఇదే విచిత్ర దుర్గం .. అని చెప్పాడు యశ్వంత్ .
యశ్వంత్ ,శివ మాటలు విని రచన ,సత్య ,మురారి కూడా వీరి దగ్గరకే వచ్చారు .
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment