ఐతే మనకి కావాల్సిన బుక్ దొరికి నట్టే ... అంది సంతోషం గా .. రచన .
అవును .. ఈ బుక్ తరవాత చదువుదాం . ముందు ఈ బుక్ బాగ్ లో పెట్టేయాలి . అని ఆ పుస్తకాన్ని తన బాగ్ లో
పెట్టేసాడు యశ్వంత్ .
వెళ్ళండి .. వెళ్ళండి .. ముందు అన్ని బుక్స్ వెతకండి .. ఇంకా ఏదన్నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు ..
అన్నాడు మురారి .
మల్లి అంతా పుస్తకాల వేట లో పడ్డారు .
యశ్వంత్ కూర్చున్న చోటే ఇంకో పుస్తకం ఏదో దొరకటం తో దాన్ని చదవటం మొదలు పెట్టాడు .
ఇంతలో రచన కేదో పుస్తకం కనబడింది .. అందులో విషయాన్ని చదువు తుంటే ఆమె భ్రుకుటి ముడి పడింది .
ఆమె మనసు సంతోషం తో ఉరకలేసింది ..
యష్ .. అంటూ యశ్వంత్ దగ్గరకెళ్ళి మోకాళ్ళ పై కూర్చుని .. యష్ .. ఈ బుక్ ఇక్కడ దొరికిoది . నేనీ పుస్తకం
కోసం చాలా వెతికాను ... తెల్సా ? అంది సంతోషం గా ..
ఏంటా పుస్తకం ? అన్నాడు యశ్వంత్ .
ఇదా ? మన భారతదేశం లో ప్రాచీన కాలం లో ఋషులు చాలా రకాల విద్యలని అభ్యసించే వారట . అవి సామాన్య
విద్యలు కావు .. ఎలాంటి వంటే .. ఈరోజు మనకి అంతు చిక్కని ప్రశ్నలు గా ఉన్న సమస్యలన్నీ పారద్రోలే విద్యలు .
ఈ పుస్తకం కోసం నాకు రమణానంద మహర్షి చెప్పారు . ఈ పుస్తకం సంపాదించగలిగితే నువ్వు అనుకున్న వన్ని
మరింత సమర్థవంతం గా చేయగలవు అన్నారు . ఇన్నాళ్ళకి నాకీ పుస్తకం దొరికింది .. అంది రచన సంతోషం గ .
నువ్వింత హ్యాపీ గా ఉన్నావంటే అది నిజం గానే మనకి కావాల్సిన పుస్తకం అయి ఉంటుంది .. ముందు అది
దాచెయ్ .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ .. ఈ గ్రంధాలయం లో ఉన్న ప్రతి పుస్తకం అమూల్య మయినదె .. వీటి విలువ చాలా మందికి తెలీదు .
ఈ గ్రంధాలయాన్ని పూర్వ స్థితి కి తీసుకు రావాలి .. అంది రచన .
మన పని పూర్తి కాగానే ఆ పనే చేద్దాం .. ఓకే .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ ... పుస్తకాలన్నీ చూసాం .. ఇక మనం వెల్లొచ్చను కుంటా .. మనకి కావలసినవి ఇంకా ఏమి లేవు ..
అన్నాడు శివ వీరి వద్దకొచ్చి .
చాలా వరకు పుస్తకాల్ని ఆ చెద పురుగులే మాయం చేసేసాయి .. యష్ .. ఆ ముసలోడు పురుగులు లేవన్నాడు ..
అని వచ్చింది సత్య .
సత్యా .. ఆ ముసలాయన చెప్పింది చదివే పురుగుల గురించి .. చెద పురుగుల గురించి కాదు .. అన్నాడు
యశ్వంత్.
యష్ .. ఆ ముసలోడు వస్తున్నాడు .. పదండి ఇక మనం బయల్దేరదాం ... అన్నాడు మురారి ..
ఆ ముసలాయన లోపలికి వస్తూ ఏం బాబూ .. చదివారా పుస్తకాలు ? అని అడిగాడు ..
ఆ తాతా .. పుస్తకాలు అన్ని చెద పట్టి ఉన్నాయి .. ఓ పని చెయ్ .. అని యశ్వంత్ తన జేబు లోంచి కొంత డబ్బు
తీసి అతనికి ఇచ్చాడు .. ఈ గ్రంధాలయానికి పనికొస్తుంది .. ఉంచు తాతా .. అని ఇచ్చాడు ..
ఇంత డబ్బా ? ఇలా ఎవ్వరు నాకివ్వలేదయ్య ... పుస్తకాల విలువ తెలసిన వాడివయ్యా .. అన్నాడు ముసలాయన .
ఈ పుస్తకాలే తాత .. గతానికి .. భవిత కి వంతెన వేసేది .. సరే మేము వెళ్తాం .. అని వచ్చేసాడు యశ్వంత్ .
బయటికి వచ్చి వెహికల్ ఎక్కుతూ యష్ .. ఆ ముసలోడికి అంత డబ్బు యిచ్చావు .. అతడు నిజం గా ఈ
గ్రంధాలయం బాగు చేయిస్తాడో లేక తన సొంతానికి వాడు కుంటాడో ఎవరికి తెల్సు ? అంది సత్య .
సత్యా .. నువ్వొకటి గమనించలేదు .. ఈ గ్రంధాలయం చాలా పాతది .. దీన్ని నిర్వహించాల్సిన అవసరం కూడా
ఆయనకి లేదు .. ఇలా పుస్తకాలు చదివే వాళ్ళు అతనికి ఎంత ఇస్తారు ? దానితో అతనేం బతుకుతాడు ?
పుస్తకాలన్నీఅమ్మేసి కూడా అతను బతకాలను కోవొచ్చు .. కానీ అతనలా చేయలేదు .. కారణం అతను
పుస్తకాలను , ఈ గ్రంధాలయాన్ని ప్రేమిస్తుండాలి .. లేదంటే ఈ గ్రంధాలయం తో అనుబంధం ఉండి ఉండాలి . ..
అన్నాడు యశ్వంత్ .
యష్ .. చెప్పింది నిజం .. ఇది రాజుల సారథ్యం లో నడిచి ఉంటుంది .. ఇప్పుడు దీని నిర్వహణ కష్టం .. కానీ
అతను కొనసాగిస్తున్నా డంటే .. ఆయన్ని మెచ్చుకోవాల్సిందే .. అంది రచన .
లెట్స్ గో శివా .. మరి కొంత దూరం వెళ్తే తినడానికి ఏమన్నా దొరకొచ్చు .. అందరం భోజనం చేసి కావాల్సిన
వస్తువులేవన్నా కొనుక్కుందాం .. అన్నాడు మురారి .
ముందు రెండు సైకిల్ లు కొనుక్కుందాం .. ఆ ఊరిలో బావుంటుంది .. అన్నాడు శివ ..
సరే .. ముందు స్టార్ట్ చెయ్ .. అన్నాడు యశ్వంత్ .
వాహనం ముందుకి సాగిపోయింది .
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment