మది వెల్లువై ప్రవహించే రాగ సుధలా ...
ఇది పల్లవై పులకించు గీత లహరా ...
ముకుందా మురారీ ... ఏ పేరున పిలవాలి హరీ ...
నీ పెదవినే తాకి పిల్లన గ్రోవి ... ప్రేమను తోడగల బావి ..
మది వెల్లువై పులకించే రాగాల సుధలా ...
వేచి ఉన్న బృందావని ... పిలిచింది తోడుగా ఆమని ..
ఆ రాధ అంటే ఆరాధన ... మిగిలించనేల ఆవేదన ?
రేపల్లె లోన శిరోమణి ... పొందావు బిడ్డగా ప్రేమని ..
యశోద మనసు ఉప్పొంగ బాధ నింపావు బిడ్డవే కావని ..
ఎవరికి నువ్వు సొంతం కావే .. అందరి వాడవు అంటావేమి ?
ఈ విధి నాటకమేమిటి స్వామీ ? నీ మది కొందరి పరమగునేమి ?
విశ్వం అంతటా వ్యాపించావే విష్ణువు నీవని పించావే ..
మరి నా కన్నులకి కానరావే .. సొంతం కమ్మని నేనడుగుట లేదే ...
నిను చేరామని పూలకి గర్వం .. నిను గెలిచానని మురళి కి గర్వం
నీవే మురళీ మోహన రాగం ... కావా నువ్వే నాకిక సర్వం
కుచేలుని స్నేహం నీ ఋణ పాశం .. ఆ పార్ధుని చరితం నీ ప్రేమ మయం
గీతా మాధవా ... ఓ జనార్ధనా .. నిను చూడాలను కన్నుల దాహం
తీర్చాలి కదా నీవే స్వయం ...
దర్శన మీయర ఓ గోపాల ... జన్మని ధన్యము చేయగా చూపర లీలా
ఓఓ నందలాలా ... ఆనంద లీలా ...

No comments:
Post a Comment