ఏడు రంగుల ఇంద్ర ధనుసు లో శ్వేత వర్ణమై యున్నా ..
అష్ట దిక్కులా నింగి హద్దులే చెరప టానికొస్తున్నా ..
సంతోషమే నా పేరని .. వాసంతమే నా తీరని ..
సుతి మెత్తని హృదయాలలో ఉయ్యాలలే ఊగనీ ..
పసిపాప నవ్వుల్లో హాయి నేనవ్వనీ ..
కనుపాప లోగిల్లో కల నవ్వనీ ..
పెదవింటి ముంగిట్లో చిరునవ్వు ముగ్గేయనీ ..
ప్రతి పెరటి తోటలో పూల సోయగమవనీ ..
కులమంటూ మతమంటూ నాకేది లేదని ..
రవికుల సోముని తిలకము నేనని ..
భవితకి ప్రాణం నన్నే కానీ ..
చరిత లో హృదయం నేనై పోనీ ..
ప్రతి ఒక్కరిలో ధైర్యం కానీ ..
ప్రతి ఇంట వెలిగే దీపాన్నవనీ ..
నింగికి నేలకి నిచ్చెన వెయనీ ..
స్వర్గాన్నే ఇలకే దింపే యనీ ..
ఇంతకీ నేనెవరో తెలుసా నీకని .. అడిగా చెప్పెయ్ జవాబునీ ..
అష్ట దిక్కులా నింగి హద్దులే చెరప టానికొస్తున్నా ..
సంతోషమే నా పేరని .. వాసంతమే నా తీరని ..
సుతి మెత్తని హృదయాలలో ఉయ్యాలలే ఊగనీ ..
పసిపాప నవ్వుల్లో హాయి నేనవ్వనీ ..
కనుపాప లోగిల్లో కల నవ్వనీ ..
పెదవింటి ముంగిట్లో చిరునవ్వు ముగ్గేయనీ ..
ప్రతి పెరటి తోటలో పూల సోయగమవనీ ..
కులమంటూ మతమంటూ నాకేది లేదని ..
రవికుల సోముని తిలకము నేనని ..
భవితకి ప్రాణం నన్నే కానీ ..
చరిత లో హృదయం నేనై పోనీ ..
ప్రతి ఒక్కరిలో ధైర్యం కానీ ..
ప్రతి ఇంట వెలిగే దీపాన్నవనీ ..
నింగికి నేలకి నిచ్చెన వెయనీ ..
స్వర్గాన్నే ఇలకే దింపే యనీ ..
ఇంతకీ నేనెవరో తెలుసా నీకని .. అడిగా చెప్పెయ్ జవాబునీ ..
3 comments:
already you told that your are simple and honesty :-)
ఇంతకీ మీరెవరు... బాగుంది. రెగ్యులర్ గా ఇలాగే రాస్తుండండీ...
చాలా తమాషాగా అడిగారు సతీష్ గారూ ... ఇంతకీ నేనెవరో ఆ కవితా లక్షణాలు బట్టి మీరే చెప్పాలి
Post a comment