Monday, 13 January 2014

సంక్రాంతి సంబరమొస్తే .. ఊరంతా పండగలే ..

హరిదాసు వచ్చాడు .. బసవన్న ని తెచ్చాడు ..

హరివిల్లు రంగులతో ముంగిలి ముగ్గు లే చూడు ..

ఆనందం పొంగాలే .. పొంగల్లె చేయాలే ..

పదిమంది కలవాలే .. సరదాగా గడపాలే ..

సంక్రాంతి సంబరమొస్తే .. ఊరంతా పండగలే ..

సిరిలక్ష్మి తానై వస్తే ... పలకాలి ఆహ్వానాలే ...

ఎర్ర ఎర్రాని మంట .. చలి నే పోగొట్టే మంట ..

ప్రతి వీదిలోనా ... సందడి చేసే భోగి మంట ..

కుడుములతో ప్రారంభం .. నోరూరించే పిండి వంట ..

నడుమ సంకురాత్రి ... సూరీడు తోలికాంతి

ఇంట్లోన చేరేలోపు ... వాకిలి రంగుల ముగ్గులతో నింపు ..

ప్రతి ఇంటా బంధుజనం .. అల్లుళ్ళ ప్రభంజనం

మితిమీరే మర్యాదలతో .. మృష్టాన్న భోజనం

కొత్త కొత్త దుస్తులు .. కళగా తిరిగే దోస్తులు ..

సిరిధాన్యం ఇంటికి వస్తే లేవింక ఏ ఇంట పస్తులు

గారెలతో విందులు అంట కనుమ నాడు సంబరమంతా ..

ఊరవతల పందేలంట .. గెలిచినోడిదే ఆనందమంతా ..

మొత్తానికి సంక్రాంతంటే తెలుగువారి పండగంటా ..

 ఊరు వాడా కలసి ఒకటయ్యే పండుగ అంటా ..


No comments: