బసవన్నా బసవన్నా .. ఊరంతా తిరుగన్నా ..

బసవన్నా బసవన్నా .. దీవెనలే ఈయన్నా ..
హరిదాసు వచ్చాడన్నా .. ఓ ఆట ఆడన్నా ..
ఏ ఇంటి ముందర ముగ్గు తొక్కేయక ఆడన్నా .. బసవన్నా

కలగూర వండే మన్నా .. కుడుములతో విందన్నా ..
భోగి భోగాలను తెస్తే ఆనందం మాదన్నా ..
తరతమ అనుభేదాలు మంటల్లో వేద్దామన్నా ..
చలి మంట కాదన్నా సందేశం ఉందన్నా ..
పులగం ,పొంగలి ఇంకా ఆరగింపు లే మొదలన్నా ..
సాయంత్రం బొమ్మల కొలువు .. దేవతలకి అది నెలవన్నా .. బసవన్న
రేగిపళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోసేమన్నా ..
చిన్నారుల నవ్వులు ఏరి సంతోషం పంచెమన్నా ..
మకర రాశిలో సూరీడు ప్రవేశించి నాడే నన్నా ..
సంక్రాంతి పండుగ వచ్చే .. సరదాల సందడే నన్నా ..
ఉత్తరాయణ కాలం ప్రారంభం కాగానే ..
స్వర్గాల వాకిళ్ళు తెరిచే ఉంటాయన్నా ..
బెల్లం ,గుమ్మడికాయ పంతుళ్ళకి దానం రన్నా ..
చనిపోయిన పెద్దలకి తర్పణాలు వదిలేరన్నా ..
హరివిల్లు నేలకి చేరే రంగవల్లులెస్తారన్న ..
పేరంటాళ్ళ కింకా తాంబూలాలిస్తారన్న ..
గొబ్బెమ్మలు పెడతారన్న .. పూబంతులు పెడతారన్న ..
చామంతులు విరిసేనంటా మన ఇంతుల సిగలో రన్నా ..
కనుమ నాడు మినుము తినాలని అంటారో ఓ రన్నా ..
పశువుల్ని పూజించే పండుగ మరి కనుమన్నా ..
చుట్టాల్లకి ముక్కల విందు పెట్టక తప్పదు రన్నా ..
కనుమనాడు ఇల్లు కదలదు చివరికి ఆ కాకన్నా ..
బొమ్మల కొలువు ఎత్తి హారతులిస్తారన్న ..

పశువుల ఊరేగింపు జరిపేరు పెద్దన్నా ..
బసవన్నా బసవన్నా .. ఈ పండుగ నీదన్నా ..
పాడి పంటా క్షేమం అని నువ్ దీవించన్న ..

No comments:
Post a comment