గోవింద గోవింద గోవింద 2 గోవింద ...
హరి గోవిందా ..2
గోకుల బాలా గోవిందా హరి గోప కిశోర గోవిందా ..
ఏడు కొండలు ఎక్కి గోవిందా .. కాలి నడకన వచ్చి గోవిందా ..
శరణు శరణు అని గోవిందా .. ముమ్మార్లు తలిచెము గోవిందా ..
గోవిందా హరి గోవిందా హరి గోవిందా హరి గోవిందా ..
నీ నామ జపము చేస్తూ గోవిందా .. కష్ట మంతా మరచి గోవిందా ..
నీ వైపు నడిచేము గోవిందా .. నీ చూపు కోరాము గోవిందా .. 2
మొక్కుల్ని తీర్చంగా గోవిందా .. తల నీలాలు ఇవ్వంగ గోవిందా ..
పిల్లా పాపల తోనూ గోవిందా .. ముసలి ముతకా తోడా గోవిందా
దూర దురాల్నుంచి గోవింద .. నీ కొరకు వచ్చాము గోవిందా 2
ఆపదలు బాపేవు గోవిందా .. కోర్కెలు తీర్చేవు గోవిందా ..
కష్టాలు కడతేర్చు గోవిందా .. మా ఇష్టాలు ఒన గూర్చు గోవిందా ..
ముడుపులు తెచ్చాము గోవిందా .. నీ వడ్డీలు తీర్చేము గోవిందా .. 2
ఏడు కొండలు దాటి గోవింద .. నీ వైకుంట వాసానా గోవిందా ..
అడుగు పెట్టినాక గోవిందా .. మా మనసు మురిసినాక గోవిందా ..
నీ దర్సనం లేదు గోవిందా .. ధనవంతుల కేనట .. గోవిందా 2
నీకూ మాకూ నడుమ గోవిందా .. స్వార్థ రాజకీయం నడిచే గోవిందా ..
నిన్ను కూడా మరచి గోవిందా .. నీ ధనిక భక్తుల సేవ గోవిందా ..
పేదవాడి గొడవ గోవిందా .. వినే నాథుడే లేడంత గోవిందా .. 2
మనసు లోన నువ్వు గోవిందా .. ఎంత మధన పడుతున్నవో గోవిందా ..
కలియుగం లోన గోవిందా .. అవతార పురుషుడవే గోవిందా ..
లక్ష్మినొదలి భువి న గోవిందా .. నీవు కూడా మనలేవయ్య గోవిందా 2
అసలైన భక్తి ఏది గోవిందా .. వి ఐ పి లదా గోవిందా ..
ఎర్ర దుప్పటి పరచి గోవిందా .. రాచ మర్యాదలేనయా గోవిందా ..
వి ఐ పి దేవుడా గోవిందా .. మా ఇంట్లోనే కొలిచేము గోవిందా 2
నిజమైన భక్తులు గోవిందా .. నీవు కనరాని బాధితులు గోవిందా ..
దేవాలయమున కూడా గోవిందా .. న్యాయమ్ము నసియించె గోవిందా ..
కలిప్రభావమో ఏమో గోవిందా .. నీక్కూడా తప్పదు గోవిందా ..
గోవిందా హరి గోవిందా .. 2
No comments:
Post a Comment