డియర్ రీడర్స్ ..
రేపే గణతంత్ర్య దినోత్సవం ... భారత జాతికి పండుగ రోజు .. దేశభక్తి పెల్లుబికే రోజు .. కానీ నేటి తరం ఇలాంటి
రోజులని మరచిపోతుంది . ఈ కింద రాసిన పాట నా చిన్నతనం లో ప్రతి స్వాతంత్ర్య దినోత్సవానికి ,గణతంత్ర్య
దినోత్సవానికి జెండా ఎగురవేసాక పాడే వాళ్ళం .. ఇప్పటికి శ్రీకాకుళం జిల్లా ,సారవకోట మండలం లో చాలా
స్కూల్ లలో ఈ పాట ని పాడు తున్నారు .. కానీ ఈ పాట రాసిన వారిని మాత్రం వాళ్ళెవరు ఎరుగరు .
ఈ పాట రచయిత కె . నాగేశ్వర రావు గారు .. సారవకోట మండలం ,నౌతల గ్రామం లో టీచర్ గా పని చేస్తున్న
దశ లో ఆయన స్వయం గా పాటలు వ్రాసి విద్యార్థుల చేత పాడించేవారు . అలా వ్రాసిన పాటల్లో ఈ పాట కూడా
ఒకటి . ఆకాలం లో బాగా ప్రాచుర్యం పొందిన పాట ఇది . ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థిని గా ఇది నా చిన్న
నాటి జ్ఞాపకం . ఆయన కుమార్తె గా ఈ పాట ని ఈ సందర్భం గా మీ అందరికి తెలియజేయటం నా సంతోషం .
అందరికీ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు . జై హింద్
భారతీయులకు నవోదయం ..
భారతావనికి శుభోదయం ..
నవశకానికి నాందీ దినం .. !నేడే !
ఐక్య భారతం వెలసింది లౌకిక భావం తో ...
బానిసత్వం లేదింకా భారత దేశం లో ... 2
సమతా భావం మన ఆదర్శం .. ప్రజాక్షేమమే మన లక్ష్యం .. 2
ఎగరేద్దాం మన జాతి పతాకం ..
ఎగరేద్దాం మన జాతి పతాకం .. ! నేడే !
No comments:
Post a Comment