గుండెల్లో భారం దింపి .. పున్నమి నే తేవమ్మా ..
మనసింట బాధని ఆర్పి .. పెదవింట వెలుగై రామ్మా ..
కునుకంటూ ఎరుగని కన్నుల వెన్నెల వె కావమ్మా ... చుక్కల్లో చందమామా ... హొయ్
చినబోయినదమ్మ చిలకమ్మా .. పలుకైన లేనే లేదమ్మా
ఏం జరిగి ఉంటుందోయమ్మా ... ఎందుకని నొచ్చు కుందమ్మ ..
మిల మిల మెరిసే మోము .. వెలవెల బోతూoదేమి ..
కిల కిల నవ్వే సొగసరి .. వల వలా సోకాలేమి ?
నీకైనా తెలుసా జాబిల్లి .. కోపం గా ఉందేం సిరిమల్లీ ... చుక్కల్లో చoదమామా ... హొయ్
చిగురంటి పెదవుల పైన చిరునవ్వే అందమటమ్మా ..
చినుకంత వేదన కూడా మనసుని నిలవనీయదు లెమ్మా ..
ఎండా వానా కలిసే రోజే హరివిల్లోస్తుంది ..
సుఖమూ దుః ఖం లోనే జీవితమూ దాగుంటుంది ..
గ్రహణమ్ము వీడిన జాబిలీ .. వెలుగే నింపే లోగిలి... చుక్కల్లో చందమామా .. హొయ్
1 comment:
i know for whom you wrote this.......!!!
Post a comment