నా రచన రీడర్స్ అందరికి ..
నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు .
సంక్రాంతి తెలుగువారి పండగ .. పల్లెలకి వెలుగునిచ్చే పండగ .. ప్రతి ఒక్కరికి ఉన్న ఊరిని ,కన్న వాళ్ళని
గుర్తుకు తెచ్చే పండుగ ... రైతన్న కష్టానికి విలువ ఈ పండుగ .
అలనాటి సంప్రదాయాలని అలవోక గా తెలిపే పండుగ ... ఎంతో దూరాల లో ఉన్న వారిని ఒకచోటికి చేర్చే
పండుగ .. ఆత్మీయతలు ,అనుబంధాలను పెంచే పండుగ .. కొత్త జంట లకి , బావా మరదల్లకి ,అత్తా మామలకి
అల్లుళ్ళ అలకల పండగ .. మూడు రోజుల ముచ్చటైన పండుగ . పది రోజుల సెలవుల పండుగ ..
నిజంగా .. ఇప్పటి సంక్రాంతి అలానే ఉందా ? లేక పాత జ్ఞాపకాలను నెమరు వేయిస్తుందా ? నాకు తెలిసి అలనాటి
సంక్రాంతి ఓ జ్ఞాపకం మాత్రమె .. ఆ సరదాలు ,సంతోషాలు ,ఉదయాన్నే లేచి భోగి మంట వేయడాలు .. అన్నీ
తీయని జ్ఞాపకాలే .. సంక్రాంతి కి రైతు ఇంటికి ధాన్య లక్ష్మి నేడు వస్తుందా ? పెట్టుబడి తప్ప లాభం లేని ఆ కర్షకుడిని
సంక్రాంతి లక్ష్మి కరుణి స్తుందా ? పండగ కి రావలసిన అయిన వాళ్ళు ,బంధువులు బస్సు ప్రమాదాలనుండి ,
రైలు ప్రమాదాలనుండి ,పని వొత్తిళ్ళ నుండి బయట పడి ఇల్లు చేరుతున్నారా ?
ఉదయాన్నే భోగి మంట ... కాని నెల ముందు నుండి పిడకలు తయారు చేయడం .. ఎవరి పిడకల దండ పెద్దదో
అని మాట్లాడు కోవటం .. ఆ దండల్ని మంట లో వేయటం .. కాలిన పిడకల బూడిదని బొట్టులా పెట్టుకోవడం ..
మరలా ఇంటికి చేరటం .. అమ్మ చేసిన కుడుముల్ని లాగించేయటం .. కోలాటం .. తిరునాళ్ళు అంటూ పరుగులు
పెట్టడం .. మరునాడు సంక్రాంతి కి నలుగు తో స్నానం .. కొత్త బట్టలు ధరించటం ,గుమ్మం లో రంగు ముగ్గులు ,
హరిదాసుల పాటలు ,బసవన్నల ఆటలు ,కోడి పందేలు ,ఎద్దుల పోటీలు ,,,,,అబ్బా ఎన్ని జ్ఞాపకాలు ..
మన తరానికి ఇవి కొందరికి జ్ఞాపకాలు .. మరికొందరికి ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలనే తాపత్రయాలు ..
మరి రేపటి తరానికి .. కేవలం మనం చెప్పే కథలు ..
నేటి సమాజం లో నైతిక విలువలు చచ్చిపోతున్నాయి .. ... సంప్రదాయాలు కొత్త తొడుగులు వేసుకుంటున్నాయి ..
పండగలు మాసి పోతున్నాయి .. ఇలానే జరగనిద్దామా ?
పండగలు జరుపుకు0దామ్ .. ఆనందం పంచుకుందాం .. సంక్రాంతి మన ఉనికి , మన తేజస్సు .. అందుకే
సంక్రాంతి ని కాపాడుకుందాం ..
మీ అందరికి భోగి ,సంక్రాంతి ,కనుమ శుభాకాంక్షలు ...
ఈ పండుగ మీ చిన్నారుల తలల మీద భోగి ఫలాలు వేయాలి ... భోగి మంట వెచ్చదనం బద్దకాన్ని తరమాలి ..
మీ ముంగిట ఆ నింగి హరివిల్లే రంగవల్లి కావాలి .. మీ లోగిళ్ళలో సంక్రాంతి లక్ష్మి నాట్య మాడాలి .. పిండి వంటలు ,
విందు వినోదాలలో మీరూ మీ బంధు జనం చిరునవ్వులు వెదజల్లాలి .. అని మనసారా కోరుతూ ....
మీ
రాధిక
2 comments:
చక్కగా చెప్పారు, రాధిక గారూ !మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు .
chala chakkaga cheparandi radhika garu...meku me kutumbamlo andariki Sankrathi subhakankshalu
Post a comment