అడుగు అడుగు ఎందుకు తడబడిందో ..
అడుగు మనసు ఎందుకు భయపడిందో ..
ఏ దిక్కు నుండి ఏ ప్రళయం ముంచుకొస్తున్నదో ...
నిను ధిక్కరించి ఏ విలయం నీ వెంట బడుతున్నదో ..
ఓ అతివా .. ఓ మగువా .. నీ జన్మపాప మేంటి ?
ఓ ముదితా .. ఓ .. వనితా .. నీ చుట్టూ శాప మేంటి ? !అడుగు !
కాల మెంత మారినా ఆధునికత ఎంత మరి పెరిగినా ..
మగవాడి కర్కసత్వాన ఆడ బతుకే కుములుతుంది ..
గడప దాటి నువ్వు కదిలినా .. అంతరిక్షాన్ని తాకినా ..
ఆట బొమ్మ వని తలచిన మగజాతి వెంట బడుతుంది ..
ఓ సహన శీలి .. అనురాగ కడలి .. నీ మది మధించి ..
నిలువునా నిను దహించి .. .... మహరాజులల్లె తిరిగే మగ పులులే .. !అడుగు !
పాలుగారే పసితనాలే కామంధుల చేతిలో వసి వాడు మొగ్గలై ..
ఏ చూపు లోన ఏ దురుద్దేశ్య ముందో .. ఆణువణువూ నిన్ను అది తడుము తుందో ..
నింగి కెగసిన కెరటమై ఎన్నెన్ని సాధించినా ..ఏ పడగ నీ గొడుగు లా కాచుకున్నాదో ..
మహలక్ష్మి నీవేనని తలచు వారేరమ్మ ? మృగ తృష్ణ కబలించగా వణికే నీ జన్మ .
పది మంది పగబడితే ఆది శక్తి వి కాని ఆశక్తురాలివై గాలిలో కలిసెవె ..
కన్నీటి చెమ్మా .. ఓ బాపు బొమ్మా .. దైవాని కయినా చెప్పి రావమ్మా ..
ఆడ జన్మే వద్దు .. ఈ ఆవేదనోద్దు ... నేల పై జీవించలేనని చెప్పమ్మా ..

4 comments:
it's really nice.
thanks for the responding heart
Thank you
thank you suprabha
Post a Comment