Powered By Blogger

Friday, 28 February 2014

రుధిర సౌధం 83


యశ్ ... అంటూ పరుగున వచ్చాడు మురారి .

ఆ వెనుకే శివ వగరుస్తూ .. యశ్ .. ఆర్ యు ఓకే ? అంటూ .

నేనిక్కడ ఉంటానని మీరెలా ఊహించారు ? వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యం గా అడిగాడు .

సొరంగ మార్గం అంటే మహల్ కె కదా .. అందులోనూ నీళ్లన్నీ ఈ మార్గం గుండా వచ్చాయంటే .. మహల్ లో ఆ

నీళ్లన్నీ ఒక చోట చేరడానికి ఏర్పాటు తప్పనిసరిగా ఉంటుంది . అప్పుడే ఈ ఎండిపోయిన మడుగు  గుర్తొచ్చింది .

నిన్నిక్కడ చూడగానే మా అంచనా నిజమైంది .. అన్నాడు మురారి .

యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మురారీ .. అన్నాడు యశ్వంత్ నవ్వుతూ .

యశ్ .. నీకేం దెబ్బలు తగల్లేదు గా .. యశ్వంత్ ఒంటి మీద చేయి వేసి ఆందోళన గా అడిగాడు శివ .

శివా .. ఏం కాలేదు . సరాసరి ఇక్కడొచ్చి పడ్డాను అంతే .. అన్నాడు యశ్వంత్ .

యశ్ .. మహల్ కి ఆ చెరువు కి సొరంగ మార్గం ఉంది సరే .. మరి గుడి ... అన్నాడు మురారి సాలోచనగా .

నాకూ అదే అర్థం కావడం లేదు . మనమీ విషయం లో ఫెయిల్ అయామని పిస్తుంది . ఎక్కడో మిస్ అయ్యాం ..

గుడి ద్వారం ఎక్కడుందో ఆలోచించాలి .. .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. ఆ రాతి మీది గుర్తులు అవన్నీ చూస్తే గుడికే దారి అనుకున్నాం . అనుకోకుండా నువ్వు ఆ మార్గం

గుండానే ఇక్కడకి చేరుకున్నావు కాబట్టి నువ్వేమన్నా మార్గమధ్యం లో చూసావేమో గుర్తు తెచ్చుకో .. అన్నాడు

మురారి .

కొంచెం ముందుకి నడిచి మడుగు లో ఉన్న నీళ్ళ వంక తేరిపార చూశాడు యశ్వంత్ .

యశ్ .. ఆ చెరువు లో ఉన్న నీటితో ఈ మడుగు నిండింది . మళ్ళి ఈ నీళ్ళని ఖాళీ చేయాలంటే ఏం చేస్తారు మరి ..

అన్నాడు శివ యశ్వంత్ వెనకాలే వచ్చి మడుగు లో నీటిని చూస్తూ .

ఎందుకో ఆ ప్రశ్న యశ్వంత్ మనసు లో కొత్త ఆలోచన ని రేకెత్తించింది .

శివా .. చాలా మంచి ప్రశ్న .. మురారీ నాకు ఇప్పుడు ఓ ఆలోచన వచ్చింది . ఈ మడుగు ఎప్పట్నుంచో ఎండి

పోయుంది . సో కిందంతా మట్టి పొరలు కట్టి ఉండి పోయి ఉండుంటుంది . కానీ ఇప్పుడీ మడుగు నీటి తో నిండటం

వల్ల మట్టి మెత్తగా మారుతుంది కదా .. అన్నాడు యశ్వంత్ .

అవును .. అని .. అయోమయం గా శివ వంక చూసి .. ఐతే .. అని మళ్ళి యశ్వంత్ వైపు చూసాడు మురారి .

ఆ చెరువు లో ఉన్న రాతి పలక లా ఈ మడుగు లోనూ ఉందేమో .. మట్టి మెత్తగా మారితెనేగా మనం అలాంటి

దేదన్నా ఉంటే కనిపెట్టగలిగేది .. ఉత్సాహం గా అన్నాడు యశ్వంత్ .

ఒక్కసారి గా ఇద్దరి మొహాలు వెలిగాయి .

నిజమే యశ్ .. ఆ అనుమానాన్ని మాత్రం మనం ఎందుకు నివృత్తి చేసుకోకూడదు ? అన్నాడు శివ .

అవును యశ్ .. కానీ మట్టి కాస్త మెత్తగా మారటానికి కాస్త సమయం పడుతుంది . మనం రేపు ఈ మడుగు లో

వెతుకుదాం . అలాంటి రాతి పలకలు ఏమైనా ఉన్నాయేమో .. అన్నాడు మురారి .

సరే .. మురారి .. అన్నాడు యశ్వంత్ .

ఓహ్ గాడ్ .. యశ్వంత్ ఏమైయ్యాడో అన్న కంగారులో ఆ పడవ వాడికి డబ్బివ్వటం మర్చిపోయాను . మీ ఇద్దరూ

ఇంటికి పొండి . నేను మళ్ళి ఆ చెరువు దగ్గరకి వెళ్ళాలి అన్నాడు శివ .

ఓకే శివ .. మాఇద్దరి బట్టలు తడిసి పోయున్నాయి . మేము ఇంటికే వెళ్తాం . నువ్వు వాడికి డబ్బు ఇచ్చి మళ్ళి

అవసరం ఉన్నప్పుడు కావాలని చెప్పు . అన్నాడు మురారి .

సరే అని ఆ ముగ్గురూ చెరొదారీ పట్టారు .

(ఇంకా ఉంది )

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

నీవు లేని నేను

నిదుర రాని రాతిరి లా నిశ్శబ్దం అలముకుంటుంది ..

ఎదురు తెన్నుల రోజులా నిరాశ ఆక్రమించింది ..

నల్లమబ్బు కమ్ముకున్న నింగి ఉరుముతూ ఉంది ..

హోరుగాలి చెలరేగి రాలి పడిన పూల మౌన రోదన వినిపిస్తుంది ..

జోరు వాన ఆనకట్టల్ని తెంపి ఉధృతం గా మారి నట్లుంది ..

విశ్వమంతా నిశిలోన కలసి ఉనికి వీడి నట్లుంది ..

మాటరాని మౌనమేదో మనసుని నిలదీస్తుంది ..

ప్రళయ ఝంఝామారుతమ్ లా పెనుగాలి చుట్టు ముడుతుంది ..

వీడలేని నేస్తమల్లె బాధ వెన్ను తడుతుంది ..

వాడిపోవు ఆశ పరిమళాన్ని వెదజల్లింది ..

భావి రక్కసల్లె మారి వికృతం గా చూస్తుంది ..

నీవు లేని నేను ఒంటరి నని తెలిపింది ..

ఓడిపోయిన ప్రేమ నన్ను నానుండి దూరం చేస్తుంది .


Thursday, 27 February 2014

రుధిర సౌధం 82అతని ఆలోచనలు ఓ కొలిక్కి రావటం లేదు . ఆలయం దారి ఎక్కడుంటుంది .. ఇలా ఆ చెరువు లోంచి సరా సరి ఈ

మడుగు లోకి రావటం వెనుక కూడా ఏదో అంతరార్థం ఉండి ఉంటుందా ? అని మడుగు వంక తీక్షణం గా చూడ

సాగాడు యశ్వంత్ .

                                                **********************************

సత్యా .. ఫోన్ మాట్లాడటం అయిపోయిందా ? అని అడిగింది రచన .

ఆమె బుగ్గ పై ముద్దు పెట్టి .. చాలా హాప్పీ గా ఉంది రచనా .. ఎన్ని రోజులైందో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి .. అంది

సత్య .

ఇంతలో వారి దగ్గరకి వచ్చింది సరస్వతి .

సరస్వతి .. ఆఫీసర్ అడిగిన ప్రశ్న లన్నింటికి సమాధానాలు చెప్పావా ? అని అడిగింది రచన .

చెప్పాను ధాత్రమ్మ .. ఇక మనం వెల్లొచ్చన్నారు .. అంది సరస్వతి .

సరే .. అని సత్య పద .. అంది రచన .

ధాత్రమ్మా .. ఈ వూళ్ళో నాకు తెలిసినోళ్ళు ఉన్నారు . రాముడి తద్దినానికి వారిని పిలవాలే .. మీ ఇద్దరూ వెళ్ళండి ..

నేను తరువాత వస్తాను .. అంది సరస్వతి .

కానీ సరస్వతీ .. మేము నిన్ను తీసుకొచ్చాం .. మళ్ళి నిన్ను క్షేమం గా తిరిగి ఇంటి దగ్గర దిమ్పవలసిన బాధ్యత

మాదే కదా .. అంది రచన .

ఫరవాలేదమ్మా .. ఈ వూరు నాకు తెలిసినదే .. నేను వెళ్ళగలను .. అంది సరస్వతి .

ఆమె కి పని ఉందని అంటోంది కదా .. తనని విడిచి పెట్టె మనం వెళ్దాం ధాత్రీ అంది సత్య .

సరే .. నువ్వు ఊరికి వచ్చిన వెంటనే నన్ను మళ్ళి కలవాలి సరస్వతీ .. అంది రచన .

అలాగే అంది సరస్వతి .

సరే .. ఐతే .. జాగ్రత్త .. అని ఇద్దరూ వెహికల్ వైపు నడిచారు .

రచనా .. నిన్నిలా రెండు పేర్లతో పిలవటం కష్టం గా ఉంది తెలుసా .. అంది సత్య .

ఆమె చిన్నగా నవ్వి .. సత్యా .. రేపు మురారి బర్త్ డే కదూ .. అంది రచన .

హే .. నిజమే రచనా .. నీకు బాగానే గుర్తుంది .. నేనెలా మర్చి పోయాను .. అంది ఆశ్చర్యానందాలతో సత్య .

నాకు గుర్తుందిలే గానీ .. తనకోసం ఏమీ కొనవా .. ఇంతకి ముందు పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ ని అడిగాను ..

ఇక్కడ కి కొంచెం దగ్గరలో మంచి బొకే షాప్ ఉందని చెప్పాడు వెళ్దామా ? అంది రచన .

ష్యూర్ .. అంది సత్య .

వెహికల్ స్టార్ట్ చేసి నాక .. బొకే షాప్ వైపు బండి ముందుకి సాగిపోయింది .

కాసేపట్లో ఆ బోకే షాప్ ముందు కార్ ని ఆపింది రచన .

రచనా .. ఇక్కడ పూలు చాలా బావున్నాయి .. చాలా ఎక్కువగా తీసుకువెలదామ్ .. అంది కిందకి దిగి వాటి

వంక అబ్బురం గా చూస్తూ సత్య .

ఇంకా ఆలస్యమెందుకు తీసేసుకుందాం పద . అంది చిరునవ్వుతో రచన .

ఇద్దరూ కలసి ఆ షాప్ దగ్గరికి నడిచి పూలు కొనుగోలు చేయసాగారు .

సత్య పూలు సెలెక్ట్ చేస్తుంటే రచన మాత్రం ఆలోచన లో పడింది .. ఈ పాటికి యశ్వంత్ వాళ్లకి ఆలయం గురించి

ఏదన్నా క్లూ దొరికి ఉండుంటుoదా ? ఈ మహల్ గొడవలో పడి వీళ్ళెవరు తమ ఆనందాలని దూరం

చేసుకోకూడదు  . రేపు మురారి పుట్టిన రోజు సంతోషం గా జరుపుకోవాలి . తనకెదన్నా గిఫ్ట్ ఇద్దామంటే దగ్గరలో

గిఫ్ట్ షాప్ కూడా లేదాయే .. అనుకుంది రచన .

ఈలోపు పూలతో వెహికల్ ని నింపేసింది సత్య .

ఆమె వైపు చూసి చిరునవ్వుతో .. షాప్ ఖాలీ చేసేసావు గా సత్యా .. అంది రచన .

ఆమె అల్లరిగా నవ్వేసింది .

ఇక రావనపురమ్ బయల్దేరదాం . అని కార్ వైపు నడిచింది రచన .

                                               ********************************

(ఇంకా ఉంది )
రుధిర సౌధం నవల ని మొదటి భాగం నుండి చదవాలనుకొంటే క్లిక్ ఆన్ naarachana.com

నా రచన వెబ్ సైట్ లో క్లిక్ ఆన్ older posts. తద్వారా మీరు మొదటి భాగం నుండి నవలని చదవగలరు .

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది.. తెలియజేయుటకి సంశయించ వద్దు . " పోస్ట్ కామెంట్" పై క్లిక్ చేసి

మీ అభిప్రాయాలని సలహాలని తెలియజేయండి . ధన్యవాదాలు 

భువనైక సుందరుడు భువనేశ్వరీ వరుడు ..

భువనైక  సుందరుడు భువనేశ్వరీ వరుడు .. 

ఆ చంద్ర శేఖరుడు .. చంద్రవదనకి ప్రియుడు .. 

ముల్లోకములనేలు వాడు .. మూడు కన్నులు గలిగినోడు .. 

శిరమున గంగ నుంచాడు .. గంగాధరుడు అయినాడు .. 

తాపసి వాడు .. నిరాడంబరుడు .. అంబరం అంతా వ్యాపించి ఉన్నాడు .. 

హిమ నగమునకి అల్లుడైనాడు .. గిరి తనయ వరముల మూట వాడు .. 

సోమ శేఖరుడు .. ఓంకార రూపుడు .. పిణాక పాణి వాడు సర్వేశ్వరుడు .. 

ఆది భిక్షువు వాడు .. జ్ఞాన దాత వాడు .. కోరిన వరముల నిచ్చువాడు .. 

కైలాస శిఖరాన వెలుగు రేడు .. సతీ దేవి హృదయాన నిలుచువాడు .. 

బొజ్జ గణపయ్య కి తండ్రి వాడు .. షణ్ముకునికి మురిపాలు పంచువాడు .. 

అర్థ నారీశ్వరుడు .. నాగేశ్వరుడు .. వ్యాఘ్ర చర్మం ధరియించు వాడు .. 

ప్రమధ గణాదీషుడు  ... ఈశ్వరుడు .. నంది పూజల నొందు వాడు .. 

కొలిచిన వారి కొంగు బంగారు వాడు .. సృష్టి కి మూలమగు పరమ శివుడు .. 

ప్రకృతి పార్వతి ని మనువాడిన వాడు ప్రకృతి పురుషుడు మహాదేవుడు .. 

హరుడు ... శుభకరుడు .. మహేశ్వరుడు .. దక్షిణ మూర్తి గా జ్ఞానం ప్రసాదించువాడు . 

భీమేశ్వరుడు .. రామలింగేశ్వరుడు .. శంకరుడు .. గరళముని   సేవించి నోడు  .. 

దీవేనలన్దించువాడు .. అభిషేక ప్రియుడు .. బిల్వ దళ పూజ కె కరునించువాడు .. 

హరహర మహాదేవ .. శంభో శంకరా .. దయగొను తండ్రీ .. 

రుధిర సౌధం 81

యష్ .. త్రిశూలం ఈ రాతినే చూపిస్తుంది . అన్నాడు మురారి .

ఓసారి రాతిని కదిపి చూద్దాం .. అన్నాడు యశ్వంత్ .

సరే అని నీటి అడుగుకి మల్లి చేరుకొని బరువైన ఆ రాతిని మెల్లిగా కదిపారు .. రాయి కదలలేదు .

మరోసారి ప్రయత్నించారు . రాయి కదల సాగింది .. రాయి కొంచెం స్థాణ భ్రంశం చెందగానే ఆ రాతి కిందకి నీరు

మెల్లిగా ఏదో కన్నం ఉన్నట్లు వెళ్ళసాగింది .ఇద్దరూ కలిసి రాతిని పక్కకి బలం గా తోశారు . రాయి పక్కకి తొలగ గానే అక్కడొక రాతి పలక ఒక గోతిని కప్పి

ఉంచిన మూతలా కనబడింది . యశ్వంత్ ,మురారిలా మోహంలో సంతోషం వెల్లివిరిసింది .

ఇద్దరూ కల్సి ఆ రాతి పలక ని తొలగించారు .. అంతే రాతి పలక తొలగించగానె చెరువు లోని కొంత నీరు  ఆ సొరంగ

మార్గం లోకి వెళ్ళటం ప్రారంభించింది . నీటి ఫోర్సు వలన నీతితో పాటూ యశ్వంత్ కూడా ఆ సొరంగం లోకి

చొచ్చుకుపోయాడు .

ఆ హతాత్పరినామానికి విస్తుపోయి నీటి పైభాగానికి తేలాడు మురారి .

అప్పటికే హటాత్తుగా చెరువులో నీటి మట్టం తగ్గటం గమనించిన శివ కంగారుగా..  పైకి తేలిన మురారిని చూసి

ఏం జరుగుతుంది మురారి ? అన్నాడు ఆందోళన గా .

లోపల సొరంగం ఉంది .. యష్ ఆ సొరంగం లోపలికి వెళ్ళిపోయాడు ..  ఆందోళనగా అన్నాడు మురారి .

వ్వాట్ ? అరిచాడు శివ .


శివ కంగారు పడకు .. ఈ సొరంగ మార్గం గుండా మహల్ కి దారి ఉండుంటుంది . మనం త్వరగా అక్కడికి వెళ్దాం ..

నాకెందుకో యశ్వంత్ అక్కడికి చేరుతాడని పిస్తుంది అన్నాడు మురారి .

తెడ్డు ఓ చేత్తో అందుకొని రా మురారీ .. అని మురారికి చేతిని అందించాడు శివ .

ఇద్దరూ త్వరత్వరగా ఒడ్డుని చేరుకొని పడవని అక్కడే వదిలేసి ఊర్లొకి పరుగు పెట్టారు .

                                         ******************************

మెల్లిగా కళ్ళు  తెరిచాడు యశ్వంత్ .

ఓ క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు అతడికి . లీలగా అతని మెదడు జరిగిన దాన్ని గుర్తు చేసింది .

ఓహ్ .. అని నిట్టూర్చి చుట్టూ చూసాడు .

అతని అనుమానం నిజమయింది . అతడు రాణి మహల్ వెనుక భాగం లో ఉన్న మడుగు లో ఉన్నాడు . మడుగు

అంతా నీటితో నిండుగా ఉంది .

అతను మెల్లిగా లేచి మడుగు లోంచి బయట కి వచ్చి మళ్ళి మడుగు వైపు ఆశ్చర్యం గా చూసాడు .

ఆ చెరువు లో నీళ్ళు సొరంగ ద్వారం తెరవగానే ఈ మడుగు లోకి చేరాయి .. ఎంత చిత్రం గా ఉంది ఇదంతా ..

ఆశ్చర్యం గా అతడు మడుగు వంక చూస్తూనే ఉన్నాడు .. కానీ మరి గుడి ద్వారం ఎక్కడుంది ? అని ఆలోచన లో

పడ్డాడు యశ్వంత్
(ఇంకా ఉంది )

Wednesday, 26 February 2014

విన్నపం


పల్లవించింది హృదయం నీ పాట లో ..

పరిమళించింది ఉదయం నీ మాట తో ..

పరవశించింది తనువు నీ తలపుతో ..

పులకరించింది వలపు నీ పిలుపు తో ..

మనో శిఖర ఫలకాలపై నీ ప్రేమ ఝరులు ఉప్పొంగనీ ..

జాలువారు నా కురులలో నీ తపన పూలు మరులు గొలపనీ ..

విరుల సాటి నా నవ్వు లో నీ కొంటె చూపు వికసించనీ ..

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 80

చెరువు దగ్గరకి చేరుకున్న ముగ్గురు మిత్రులు మొత్తం ఆ చెరువు సరిహద్దుల్ని చుట్టి వచ్చారు .

యశ్వంత్ .. నీకేమన్నా క్లూ దొరికిందా .. ? నాకైతే ఏదో దీనిలో దాగుందన్న ఆలోచనే రావటం లేదు అన్నాడు శివ .

లేదు శివ .. కొన్ని సార్లు మన కళ్ళు మనకి మోసం చేస్తాయి .. ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది . బోటు అర్రేంజ్

చేయమన్నాను .. చేసావా ? అన్నాడు యశ్వంత్ .

అది రెడీ గానే ఉంది .. గంటకి అద్దె పే చేస్తానని చెప్పాను అన్నాడు శివ .

వీరికి కొంచెం దూరం లో బైనాక్యులర్స్ లో చెరువు నంతటినీ పరికించి చూస్తున్న .. మురారి .. యష్ .. కం థిస్ సైడ్ .

అని అరిచాడు .

శివ , యశ్వంత్ ఇద్దరూ రెండు అంగల్లొ మురారి ని చేరుకున్నారు .

ఏంటి మురారి ? anything is there ? అని అడిగాడు యశ్వంత్ .

యశ్వంత్ ఇందులో చూడు .. చెరువు మథ్యలొ ఓ రాక్ ఉంది .. దాని మీద ఒక గుర్తు ఉంది .. త్రిశూలం గుర్తు ..

అన్నాడు మురారి .

మురారి చేతిలో ఉన్న బినాక్యులర్స్ తీసుకొని చూసాడు యశ్వంత్ .. అతని పెదవులపై చిరునవ్వు విరిసింది ..

బినక్యులర్స్ శివ కి అందించి .. మురారి .. యు  డిడ్ స్ప్లెండిడ్ జాబ్ .. అని మే బి అదే క్లూ కావొచ్చు . అన్నాడు

యశ్వంత్ సంతోషం గా .

నాకూ అలానే అనిపిస్తుంది యశ్వంత్ .. మనం వెంటనే ఓ సారి ఆ రాక్ దగ్గరికి వెళ్ళటం మంచిది .. అన్నాడు శివ .

ష్యూర్ .. లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ ,శివ ఒడ్డున ఉన్న బోటు ని బలం గా నీటిలోకి తోసారు . తర్వాత ముగ్గురూ బోటు నెక్కి రాయి ఉన్న

వైపు ముందుకి సాగారు .

కాసేపట్లో వాళ్ళు ఆ రాక్ దగ్గర ఉన్నారు . రాతి పై కాస్త అస్పష్టం గా త్రిశూలం గుర్తు ని చెక్కారు కానీ ఆ త్రిశూలం

ఈశాన్యం వైపు చూపిస్తుంది .

యశ్వంత్ .. దీన్ని గీసిన విధానం చూస్తుంటే నీటిలోకి చూపిస్తుంది . మనం చెరువు లోకి దిగాల్సిందే అన్నాడు

మురారి .

శివా నువ్వు బోటు లోనే ఉండు .. అని మురారి లెట్స్ డైవ్ అన్నాడు యశ్వంత్ .

శివ చూస్తుండగానే ఇద్దరూ నీటిలోకి దూకారు .. నీటిలోపల అంతా గమనించారు . నీటి అడుగున నాచు పట్టిన

మరో రాయి కనబడింది .

యశ్వంత్ ఆ రాయి వద్దకి చేరుకున్నాడు .. మురారి ఇదే అని సైగ చేసాడు ..

ఇద్దరూ కలసి ఆ రాతిని చేరుకున్నారు . నీటి పైభాగం లో శివ ఆత్రుత గా చూస్తున్నాడు .

మురారి ఆ రాయి ని చూసి ఒక్కసారి నీటి పైభాగానికి రావటం తో యశ్వంత్ కూడా పైకి తేలాడు .

(ఇంకా ఉంది )

Wednesday, 19 February 2014

రుధిర సౌధం 79

 


కొంచెం ముందుకి అలా నడిచే సరికి సిగ్నల్ వచ్చింది  రచన సంతోషానికి అవధులు లేవు . వెంటనే గిరిజ నెంబర్

కి డయల్ చేసింది . అటువైపు గిరిజ ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ్మా... అంది ఆర్ద్రం గా రచన . 

రచన గొంతు వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లని పించింది గిరిజ కి .. రచనా .. నువ్వేనా .. తల్లీ .. అంది గద్గద 

స్వరం తో . 

ఎలా ఉన్నవమ్మా ? అంది రచన బాధ గా . 

అమ్మ నీకు ఇప్పుడు గుర్తు కొచ్చిందా ? చిరు కోపం గా అంది గిరిజ . 

అమ్మని ఎవరన్న మర్చిపోతారా ? అంది రచన . 

ఎలా ఉన్నావు ? ఎక్కడున్నావు ? ఏ ప్రమాదాల జోలికి పోవడం లేదుగా .. అంది గిరిజ ఆత్రం గా . 

 లేదమ్మా .. ఐన నేనేం ఇక్కడ ఒంటరిగా లేనుగా .. నాకు తోడుగా యశ్వంత్ ,మురారి ,శివ ,సత్య ఉన్నారు గా . 

ఐనా నేను వచ్చిన పని కూడా కొంత వరకు కొలిక్కి వచ్చినట్లే .. అంది రచన . 

నువ్వు సంతోషం గా ఉంటె నాకదే పెద్ద నిశ్చింత . .. అంది గిరిజ . 

స్వామీజీ ఎలా ఉన్నరమ్మా ?? అని అడిగింది రచన . 

బావున్నారు రచన .. నీ క్షేమం కోసం నాకన్నా ఎక్కువ గా ఆరాటపడతారు . అంది గిరిజ . 

నాకు తెలుసమ్మా .. నేను ఫోన్ చేసానని ఆయనకీ తెలియజేయు .. అంది రచన . 

రచనా .. మరో వారం లో అన్నయ్య అమెరికా నుండి వస్తున్నాడు .. ఫోన్ చేసాడు .. అంది గిరిజ . 

నిజమా ? నాకు చాలా సంతోషం గా ఉందమ్మా .. అంది ఉత్సాహం గా రచన . 

కానీ రచన .. వాడు నీ గురించి అడిగితె ఏం చెప్పను ? అన్నయ్య కోప్పడతాడు కదమ్మా .. అంది గిరిజ . 

నిజమే .. కానీ ఏదో ఒకటి చెప్పమ్మా .. అంతేగాని విక్రాంత్ అన్నయ్య కి నేనిక్కడ కి వచ్చానని చెప్పకు .. అంది 

రచన . 

సరే .. అంది గిరిజ . 

వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తానమ్మా .. నాకోసం బెంగ పడకు . వేళకి భోజనం చెయ్ .. మరిక ఉంటానమ్మా 

అంది రచన . 

నువ్వు కూడా తల్లీ .. జాగ్రత్త గా ఉండు .. వైష్ణవీ మాతా నిన్ను సదా కాపాడుతుంది . అంది గిరిజ . 

బాయ్ అమ్మా .. అని ఫోన్ పెట్టేసింది రచన .. "అన్నయ్య వస్తున్నాడు ... అమెరికా నుండి .. నీకోసం ఈ చెల్లెలు 

ఇచ్చే కానుక రాణి మహల్ అన్నయ్య ... అని మనసులో అనుకుంది రచన . 

ఇంకా ఉంది   

Tuesday, 18 February 2014

రుధిర సౌధం 78
తూర్పు తెలవారగానె సరస్వతి ని పట్టుకొని   రచన , సత్య ఇద్దరూ వెహికల్ లో వెళ్లి పోయారు ..

వాళ్ళు వెళ్ళాక రావణ పురానికి పశ్చిమాన ఉన్న చెరువు దగ్గరకి వెళ్ళటానికి యశ్వంత్ ,మురారి ,శివ బయలు

దేరారు .. దారిలో యశ్వంత్ ని అడిగాడు శివ సందేహ నివృత్తి కోసం .

యశ్ .. నాకో విషయం  అర్థం కావడం లేదు .. మహల్ లో దేవాలయం ఉందన్నావ్ .. అది సరే .. కాని ఆ

దేవాలయం కోసం ఊరవతల చెరువు దగ్గర వెతకటం ఏంటి ? యశ్వంత్ అన్నాడు శివ .

ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు శివా .. మన ఇంట్లో లైట్ ఒక దగ్గర ఉంటె స్విచ్ వేరే దగ్గర ఉంటుంది . ఇంటి

మొత్తానికి పవర్ ఇచ్చే మీటర్ బోర్డు ఇంటి బయట ఉంటుంది .. ఇదీ అంతే .. అన్నాడు యశ్వంత్ .

యష్ చెప్పింది నిజం శివా .. పూర్వం రాజులు శత్రు భయం తో తాముండే భవనాల లోనే సొరంగ మార్గాలను

ఏర్పరచు కునేవారు .. ఆనాటి భవనాల నిర్మాణ కౌశల్యం కోసం మాట్లాడాలంటే ఇప్పటి మన ఇంజినీర్స్ ఎందుకు

పనికిరారనే చెప్పాలి .. అన్నాడు మురారి .

కానీ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది .. మనం ఇది వరకెన్నడు ఇలాంటి కేసెస్ చూడలేదు .. అందులోనూ మన రచన

రాణి మహల్ కి వారసురాలు అని తెలిసాక చాలా exciting గా ఉంది అన్నాడు శివ .

ఇంతలో వాల్లొక గుట్ట చేరుకున్నారు .

ఆ గుట్ట మీద నుంచి చూస్తే దూరం గా ఉన్న చెరువు కనబడుతుంది .

యశ్వంత్ .. సీ  దేర్ .. నువ్వు చెప్పిన చెరువు అదేనా ? అని చేయి చూపిస్తూ అన్నాడు మురారి .

ఎస్ .. అదే అనుకుంటా .. ఏదో చిన్న చెరువు అనుకున్నా .. కానీ ఇది చాలా పెద్దది అన్నాడు యశ్వంత్ అబ్బురం

గా కనుచూపు మేరలో కనిపిస్తున్న చెరువు ని చూస్తూ ..

అవును యశ్వంత్ .. బోలెడన్ని చేప ఉంటాయి ఇందులో .. వెళ్ళేటప్పుడు నాలుగు చేపలు పట్టుకెల్దామా .. చేపల

పులుసు తిని చాలా రోజు లైంది .. అన్నాడు శివ నవ్వుతు ..

యశ్వంత్ , మురారి ఇద్దరూ నవ్వేసారు .

పదండి ఆ చెరువు దగ్గరకి వెళ్దాం .. అన్నాడు శివ .

ముగ్గురూ గుట్ట దిగి చెరువు వైపు నడిచారు

                                            *******************************

పోలీసు స్టేషన్ చేరు కున్నాక సరస్వతి ని పోలీసు ఆఫీసర్ ముందు కూర్చో బెట్టి సత్యా నువ్విక్కడే ఉంటావా ? నేను

వెళ్లి అమ్మ తో మాట్లాడి వస్తాను . నేను వెల్లొచ్చాక నువ్వు వెల్దువు గానీ .. అంది రచన .

సరే .. నువ్వు వెళ్లిరా .. అంది సత్య .

పోలీసు స్టేషన్ వెనుక వైపు కొంచెం దూరం నడిస్తే మీకు సిగ్నల్ వస్తుంది అన్నాడు ఆఫీసర్ ..

అలాగే అని ముందుకి నడిచి స్టేషన్ వెనుక వైపు నడుస్తూ కొన్ని రోజులుగా స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఆన్ చేసింది

రచన .

(ఇంకా ఉంది )

  

Monday, 17 February 2014

రుధిర సౌధం 77

అదీ నిజమే .. కాని రచన .. మీదే ఈ మహల్ ఐనప్పుడు నీకీ మహల్ రహస్యాలు తెలియాలి కదా .. అంది సత్య .

యశ్వంత్ రచన వైపు ఆసక్తి గా చూసాడు .

నాకు పెద్దగా తెలియదు సత్య .. కానీ వైజయంతి పేరు తెలుసు ఆమె వలెనే మేమీ మహల్ ని వదిలేయాల్సి

వచ్చిందని తెలుసు . కానీ అప్పుడేం జరిగిందో మాత్రం నాకు తెలీదు .. మా పెదనాన్న గారు మహల్ ని హస్తగతం

చేసుకోవటానికి వచ్చి మరణించారు . నాన్న డైరీ లో కొన్ని విషయాలు రాసి ఉన్నాయి .. దానిని బట్టి మహల్లో

వైష్ణవీ మాత ఆలయం ఉంది .. ఆ ఆలయం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు .. ఆ ఆలయాన్ని కనుగొనడానికి

పెదనాన్న ప్రయత్నించారు కానీ ఫలితం లేదు .. ఆయన మాత్రమె ఆలయం లోనికి ప్రవేశించ గలరట .. కానీ లేరు .

ఆయన తర్వాత మళ్లి నేను .. నాకు మాత్రమే అర్హత ఉందట .. చెప్పింది రచన .


మహల్లో ఆలయమా ? మనం మహల్ అంతా తిరిగాం .. మహల్లో ఆలయం ఉన్న జాడలే లేవు .. అన్నాడు శివ .

లేదు శివ .. ఆలయం ఉంది .. ఇది మనకొక పజిల్ అనుకుందాం .. ఆలయం లో దీపాలు వెలిగితే వైజయంతి

మహల్లో నిలవలేదు .. వైజయంతి లేకపోతె భయం ఉండదు .. ఐన చెడు నెప్పుడు మంచి తోనే ఎదుర్కోవాలి కదా ..

అన్నాడు యశ్వంత్ .

బావుంది .. మన లక్ష్యం ఇప్పుడు ఆలయాన్ని వెదకాలి .. అంతే నా ? అన్నాడు మురారి .

అవును ఆలయం మహల్ కి దక్షిణ దిశ లో ఉందని నా దిక్సూచి చెబుతుంది .. అంది రచన .

కానీ ఆ టెంపుల్ లోకి వెళ్ళటం అంత సులువైన పనైతే కాదు మరి .. ఈ ఊరి కి పశ్చిమాన ఉన్న చెరువు లో

అందుకు క్లూ ఉంది మనం అక్కడికి వెళ్లి ప్రయత్నించాలి .. అన్నాడు యశ్వంత్ .

అవునా ? ఈ విషయం నువ్వెలా చెప్పగలుగుతున్నావు ? అన్నడు మురారి .

చెప్తాను .. అన్ని వివరం గా రేపు మాట్లాడుకుందాం .. రేపే మనం ఆ చెరువు దగ్గరకి వెళ్తున్నాం అన్నాడు యశ్వంత్

కానీ యష్ .. మనం రేపు సరస్వతి ని స్టేషన్ కి తీసుకువెల్దాం అనుకున్నాం .. అన్నాడు శివ .

శివ .. అదీ నిజమే .. సరే ఓ పని చేద్దాం .. రచన ,సత్య ఇద్దరూ రేపు సరస్వతి ని తీసుకు వెళతారు .. అన్నాడు యష్

సరే అని తల ఊపారు రచన .సత్య

ఐతే రేపు వీళ్ళు స్టేషన్ కి వెళ్తారు మనం ఆలయం పని మీద వెళ్తున్నాము .. అన్నాడు మురారి .

రచనా ,సత్యా స్టేషన్ దగ్గర కాస్త సిగ్నల్ వస్తుంది .. మీ మీ ఇళ్ళకి ఫోన్స్ చేసుకోండి .. ఓకే అన్నాడు యశ్వంత్

సరే యష్ అంది సత్య .

కృతజ్ఞత గా చూసింది రచన వారందరి వైపు

(ఇంకా ఉంది )

Friday, 14 February 2014

రుధిర సౌధం 76


ఫ్రెండ్స్ .. నేను .. కాదు .. అని రచన వైపు చూసి .. రచన మీతో ఒక విషయం చెబుతుంది .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. అదీ .. అని కాస్త నిట్టూర్చి సరే .. నేనే చెప్తాను .. అని అందరి వైపు ఓసారి చూసి .. నేను మీలా .. నా

డ్యూటీ చేయడానికి రాలేదు .. అంది రచన .

అంటే .. అంది సత్య నిద్రమత్తు వదిలిందేమో ..

శివ , మురారి ఆమె వైపు విచిత్రం గా చూసారు .

మీకర్థం కాలేదు .. కానీ నేను ఎదురు చూసిన అవకాశం నాకు బలేశ్వర్ గారి ద్వారా దొరికింది . నేనీ మహల్ కి

రావాలని ముందు నుంచే ఎన్నో కలలు కన్నాను .. అదిప్పుడు జరిగింది .. అంది రచన .

అంటే బలేశ్వర్ చెప్పక ముందే నీకీ మహల్ గురించి తెలుసా ? అన్నాడు శివ .

అవును శివ .. తెలుసు .. తెలియకుండా ఎలా ఉంటుంది మహల్ మాదే ఐనప్పుడు .. అంది మెల్లిగా రచన .

వ్వాట్ ? అదిరిపడ్డాడు మురారి .. సత్య మాన్ప్రడి పోయి చూసింది

ఏం మాట్లాడుతున్నావు రచనా .. ? ఆశ్చర్యం గా అడిగాడు శివ .

అవును శివా .. రచన చెప్పేది నిజం .. రచన వంశీకులదే ఈ మహల్ .. కొన్నేళ్ళ కిందట మహల్ లో జరిగిన

ఘోరాల  వల్ల  రచన వాళ్ళ తాత గారి ఫామిలీ మహల్ ని వదిలి పెట్టేసి వచ్చేసింది .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. నీకీ విషయాలన్నీ ముందే తెలుసా ? కాస్త కటువు గా అడిగాడు శివ .

నాకు గనుక ముందే తెలిసి ఉండుంటే మీకూ తెలిసి ఉండేది .. రచన నాతోనూ చెప్పలేదు .. మీతోను తను చెప్పక

పోవటానికి కారణం మీరు తనని స్వార్థ పరురాలు అనుకుంటారనే భయం తోనే .. అన్నాడు యశ్వంత్ .

అనుకోవటానికి ఏముంది .. ? అది స్వార్థ మేగా .. అంది సత్య కోపం గా ..

నువ్వాగు సత్యా .. అని .. రచన ని చూసి .. రచనా .. మాకు నీ గురించి తెలుసు .. మేమంతా నీకోసం వచ్చాం ..

కానీ నీకు మాతో చెప్పాలని పించలేదా ? అడిగాడు మురారి .

మురారి .. నేను ఆఫీసు లో ఏ ఒక్కరి సహాయం ఎందుకు తీసుకోలేదో తెలుసా ? ఆ మహల్ కోసం ప్రయత్నించి న

మా కుటుంబం లో వాళ్ళు ఎవరూ మరి తిరిగి రాలేదు . అంతా చని పోయారు .. నేను ఒంటరి గానే

ప్రయత్నించాలను కున్నను .. ప్రాణం పొతే నా ఒక్కదానిదే పోతుంది .. అంతే కాదు ఆ మహల్ లో ఉన్న బంగారం

కోసమో ఆస్తి కోసమో నేనిక్కడికి రాలేదు .. మా నాన్నగారి కోరిక తీర్చాలని వచ్చాను .. మా కుల దైవం వైష్ణవీ

మాత గుడి లో మల్లి పూజలు జరగాలని .. జరిపించాలని .. వచ్చాను . ఆ దుష్ట శక్తి ని ఈ మహల్ నుండి దూరం గా

తరిమేయాలని వచ్చాను .. ఆ తరువాత ఐన ఈ ఊరికి ,ప్రజలకి మంచి రోజులు వస్తాయి అని ఆశగా వచ్చాను ..

నేను చెబుతున్నది పూర్తిగా నిజం .. అంది కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ రచన .

రచన .. వుయ్ ఆర్ సారీ .. బాధ పడకు .. నువ్వు మాతో చెప్పలేదని బాధ అనిపించింది అంతే .. అన్నాడు మురారి .

అవును .. నీమీద మాకు నమ్మక ముంది .. మహల్ నీదే కావొచ్చు .. కానీ నీ లక్ష్యం .. మా లక్ష్యం ఒక్కటే .. లక్ష్యం

ఒకటే అయినప్పుడు కలిసి పోరాడటం లో తప్పేముంది ? అందునా మా స్నేహితురాలికి కూడా సహాయం చేయ

గలిగితే అంత కన్నా ఇంకేం కావాలి ? అన్నాడు శివ .

(ఇంకా ఉంది )love song/ ఓ ప్రేమ గీతం
                              కుదురులేదు మనసులొ.. ఎదురుచూపు కనులలో

                              ఎక్కడ నువ్వని? ఏ దిక్కున ఉన్నావని ....

                              ఎవరిని అడగాలని ,ఏ చోటని వెతకాలని ...

                               ప్రేమ తప్ప తోడు లేని పిచ్చి మనసుకు.. బదులు మనసునిచ్చి నన్ను చేరవెందుకు?
                                                                                                                               ii   కుదురు11

                                మల్లె లాంటి మనసులోన పరిమళమే ప్రేమ ...
                               
                                అది నిన్ను తాకి నన్ను చేర్చు రోజు  ఎప్పుడమ్మా....

                                వెన్నెలున్న రేయిలోన చందమామ ప్రేమా ...

                                నువ్వు నాతో ఉంటే  పున్నమల్లె రాత్రి మారునమ్మా ...

                                నీ తలపుతోనే  రేయి పవలు  గడపగలనుకానీ ...

                                నిన్నొక్కసారి చూడాలి నన్ను చేరవేమి ?                                        కుదురు

                               
                                 గుండెలోన సవ్వడల్లె నాలోన కలిసె ప్రేమా ...

                                  నువు రావు అంటే గుండె కూడా ఆగిపోవునమ్మ

                                  తేనే లోని తీపిమల్లె నాలోనే నిలిచే ప్రేమా

                                  నువ్వు లేవు అంటే   చేదు నాలో మిగులునమ్మా

                                  నీ పిలుపు కొరకు వే చిఉన్న మనసు కలలు కననీ ..

                                  ఆ కలల నైన కన్న కనులు కనీరు దాచనేమీ ?                         కుదురు       

                 

ప్రేమికుల రోజు శుభాకాంక్షలురెండు పాదాల నడక ఒకటైనట్లు .. రెండు కన్నుల దొక చూపై నట్టు ..

రెండు తనువుల ఒక ఆత్మని మొదటి సారి చూస్తున్నా ..

నా చెంపపై కన్నీరు నీ చేయి తుడిచింది .

నా పెదవులు విచ్చుకుంటే నీ కళ్ళు మెరిసాయి .

ఒంటరి తనం నువ్వు దూరం గా ఉన్న నను చేరదు ..

ఎందుకంటే నీ తలపు నన్ను ఎప్పుడూ వీడి ఉండదు .

ఆకలిదప్పులు మరచిపోతా నీ కబుర్లు వింటూ ఉంటే ..

కాలం ఎపుడు గడిచిందో .. గమనించనైనా గమనించను నీ తోడులో ..

ఈ ప్రపంచం లో నా భద్రమైన చోటు నీ కౌగిలే ..

నీకు తప్ప మరెవరికీ స్థానం లేని నా మనసు నీ లోగిలే ..

నా పేరు అందం గా వినిపిస్తుంది నీ పిలుపులో ..

నా రూపం అపురూపం అవుతుంది నీ కనులలో ..

నా మౌనమైనా నీతో మాటాడుతూనే ఉంటుంది ..

నా ధ్యాస అంతా నీ పరిమళం ఆక్రమించింది ..

సంద్రాన్ని సైతం ఓడించగల ధైర్యం తోడైంది ..

 తిరిగి తీసుకోలేని నా మనసు ని నీలో చూసి మురిసింది ..

నీ చేయి పట్టి నడిస్తే దూరం ఎంతుంటే ఏం అలుపైనా రాదుగా ..

ప్రపంచం కొత్తగా కనిపిస్తే అది  ఈ ప్రేమ మహిమేగా .. ప్రేమికులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు 


ప్రేమతో లోకాన్నే జయించొచ్చు . ప్రేమ కి కావలసినది సమన్వయం . ప్రేమ కోసం ఆత్మహత్య లు

చేసుకోకండి . ప్రేమ ని బ్రతికిన్చుకోవటం అంటే ఓటమి ని కూడా ధైర్యం గా ఎదుర్కోవడం .. ఎక్కడో మీకు

దక్కే ప్రేమ మ్మీకోసం ఎదురుచూస్తూoడ వచ్చు . మీ ప్రేమ మిమ్మల్ని తప్పని సరిగా చేరుకుంటుంది . అది గుర్తెరిగి

కాదన్న ప్రేమ ని బాధించటం , లేదా మీరే మీ జీవితాలని నాశనం చేసుకోవొద్దు .  ప్రేమ బలవంతం గా పొందేది

కాదు .. తనకు తానుగా దక్కేది . మీ అందరికి నిజమైన ప్రేమ దక్కాలని మనసారా ఆసిస్తూ ..


                                                                                                                         రాధిక :మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 75విధాత్రి తో నీ రూపం సరిగ్గా సరిపోతుంది .. ఆమె ఈ మహల్ లో కొన్నేళ్లుగా ఒక గాజు జాడీ లో బందీ గా ఉంది ..

ఆరోజు .. అమావాస్య రోజు .. నువ్వే అనుకోకుండా ఆ జాడీ ని బద్దలు గొట్టి ఆమెకి విముక్తిని ప్రసాదించావని ఆమె

నాకు చెప్పింది . అన్నాడు యశ్వంత్

అంటే ఆరోజు ఆ చీకటి కొట్టు లోంచి నేను బయట పడటానికి ప్రయత్నించి నపుడు ఒక జాడీ పగిలి పోయింది ..

నువ్వు ఆ జాడీ కోసం చెప్పటం లేదు కదా .. అంది రచన .

అయ్యుండొచ్చు రచనా .. అంతే కాదు నేను వైజయంతి ని కూడా అతి సమీపం గా చూసాను .. ఆమె నన్ను

హతమార్చ డానికి ప్రయత్నించింది .. కానీ ఆరోజు నన్ను విధాత్రి కాపాడింది .. అప్పుడే నేను విధాత్రి ని చూసాను .

అన్నాడు యశ్వంత్ .

విధాత్రి ని ఎవరు అలా బంధించి ఉండుంటారు ? వైజయంతి ఎందుకిలా మారిందో .. అసలప్పుడు ఏం జరిగిందో ..

అంది రచన .

అప్పుడేం జరిగిందో విధాత్రి తప్పని సరిగా చెబుతుంది . మనమిప్పుడు చేయాల్సిన దల్లా ఆలయం ఎక్కడుందో

కనిపెట్టడం . నాకు విధాత్రి కొన్ని క్లూస్ ఇచ్చింది .. వాటి సహాయం తో మనం ఆలయం కోసం కనుక్కుందాం ..

కానీ మన వాళ్లతో అన్ని చెప్పేద్దాం అన్నాడు యశ్వంత్ .

యష్ .. ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు నన్ను స్వార్థ పరురాలు అనుకోరా ? బేలగా అంది రచన .

లేదు రచనా .. అభ్యంతరం ఉంటె వాళ్ళు వెళ్ళిపోతారు అంతే కదా .. కానీ నాకు నమ్మకం ఉంది .. వాళ్ళు స్నేహానికి

ఎంత విలువ ఇస్తారో నీకూ తెలుసు అన్నాడు యశ్వంత్ .

సరే యశ్ .. నీ మాట మీద గౌరవం ఉంది నాకు .. అంది రచన .

సరే .. నేను చెప్పింది విను రచనా .. ఈ ఊరికి పశ్చిమాన ఉన్న చెరువు దగ్గరకి వెళ్తే మనకి ఏదన్న మార్గం దొరక

వచ్చు .. అంతే కాక ఇక్కడ ఈ ఎండి పోయిన మడుగు చూడు .. ఒక వైపు రాతి తో  మూయబడి ఉంది .. నాకు

తెలసి ఈ అమరిక వెనుక ఏదో రహస్యం దాగి ఉంది .. అన్నాడు యశ్వంత్ .

నాకేం తెలియడం లేదు యశ్వంత్ .. కానీ నువ్వు చెప్పేదానిలో కొంత నిజం ఉందని పిస్తుంది .. అంది రచన .

ముందు మనం ఇంటికి వెళదాం .. మనవాళ్ళతో విషయం మొత్తం చెబుదాం .. ఇక నుంచీ ఒక్కరోజు కూడా వ్యర్థం

కాకుండా జాగ్రత్త పడదాం .. ఎందుకంటే పౌర్ణమి లోపు మనం ఆలయాన్ని కనిపెట్టి తీరాలి .. విధాత్రి చెప్పింది ..

అన్నాడు యశ్వంత్ .

అలాగే యశ్వంత్ .. మనం తెల్లవారక ముందే ఇక్కడ్నుంచి వెళ్లి తీరాలి అంది రచన .

పద రచనా .. అని ముందుకు కదిలాడు యశ్వంత్ .. అతన్ని అనుసరించింది రచన .

                                                     ************************

హటాత్తుగా నిద్రలేపి ఏదో మాట్లాడాలనే సరికి బిత్తర పోయి లేచారంతా ..

యశ్వంత్ .. ఏమయింది ? ఆందోళన గా అడిగాడు శివ .

ఈ టైం లో మాట్లాడాలన్నవంటే అదెంత ముఖ్యమైనదో అర్థమయింది యశ్వంత్ చెప్పు .. అన్నాడు మురారి .

సత్య నిద్రమత్తు లో అయోమయం గా చూస్తుంది వారివంక . రచన మాత్రం మెడలో లోకెట్ ని అటుఇటు తిప్పుతూ

విషయం విన్నాక వీరెలా రియాక్ట్ అవుతారో అని ఆలోచన లో ఉంది ..

(ఇంకా ఉంది )

Thursday, 13 February 2014

రుధిర సౌధం 74

యష్ ఏం చూస్తున్నావు ? ఏమయింది నీకు ? ఆందోళన గా అంది రచన .

రచనా .. నీకు ఆలయం మార్గం కావాలి కదా .. అన్నాడు యశ్వంత్ ఆ మడుగు వంకే చూస్తూ ..

అవును .. నీకు మార్గం గురించి తెలిసిందా ? అంది యశ్వంత్ వంక తేరిపార చూస్తూ రచన .

లేదు .. కానీ కచ్చితం గా లేదని కూడా చెప్పలేను .. అని ఆమె వంక చూసి తన రెండు చేతుల్లోకి ఆమె మొహాన్ని

తీసుకుని .. రచనా మన ముందున్న లక్ష్యం కష్ట సాధ్య మయినది .. మన ఇద్దరమే చేయలేనిది .. ఒకసారి మనం

శివ వాళ్ళని అడిగి చూద్దాం .. వాళ్ళు కోరుకుంటే మనకి సహకరిస్తారు .. లేదంటే వాళ్ళని ఇక్కడ్నుంచి వెళ్ళిపోమని

చెబ్దాం .. ఏమంటావ్ ? అన్నాడు యశ్వంత్ .అతని చేతుల్లో ఉన్న తన మొహాన్ని తీసుకొని .. యష్ .. మీరంతా వృత్తి రీత్యా మీ కర్తవ్య నిర్వహణకి మాత్రమె

వచ్చారు .. కానీ నేను .. అలా కాదు .. ఇది నా కుటుంబం కోసం .. ఇది నా అస్తిత్వం కోసం .. మా ఉనికి కి కాపాడు

కోవటం కోసం .. ఇది స్వార్థం కావొచ్చు మరేదన్నా కావొచ్చు .. నా బాధ్యత కోసం మరెవర్నీ బలి పెట్టటం నాకిష్టం

లేదు .. ఈ మహల్ మా పూర్వీకులది .. కొన్ని పరిస్థితుల దీనికి దూరం కావాల్సి వచ్చింది . నా చిన్నప్పుడే అమ్మా

, నాన్న తో ఈ వూరొచ్చాను . కానీ నాన్న అశాంతి తో తిరిగి వెళ్ళాల్సి వచ్చింది .. మా మహల్ ని మేమే

వదిలేయాల్సి వచ్చింది .. మనం ఎంతో ప్రేమించే ఇంటిని పదిమంది దెయ్యాల కోటగా పిలుస్తుంటే ఆ ఆవేదన అర్థం

చేసుకోగలవా యశ్వంత్ ? ఓ రాచ కుటుంబం లో జన్మించి అనామకం గా ఏన్ని తరాలు వెళ్లిపోవాలి .. అలా

కాకూడదు .. ప్రయత్నం నేను మొదలు పెట్టాను .. నేను .. నా తర్వాత వేరొకరు .. ఏదో రకం గా దీనిని మనుషులు

స్వేచ్చ గా తిరిగే గూడు గా చూడ గలగాలి .. ఈ మహల్ వల్ల ఈ వూరి ప్రగతి ఆగిపోకూడదు .. ప్రజలకి మంచి

జరగాలి .. ఈ మహల్ ఈ ఊరికి శాపం అయింది .. నేను దీన్ని వరం గా మార్చాలని భావిస్తున్నాను .. అందుకోసం

నా ప్రాణం పణం గా పెట్టల్సోచ్చిన సరే వెనకడుగు వేయను . స్థిరం గా అంది రచన .

రచనా .. నేను నిన్ను అర్థం చేసుకున్నాను .. నువీ రాచ కుటుంబపు వారసురాలివని నువ్వు చెప్పక ముందే

నాకు తెలుసు . అన్నాడు యశ్వంత్ .

ఎలా యశ్వంత్ ? నీకెలా తెలుసు ? అంది రచన .

విధాత్రి .. రాకుమారి విధాత్రి వలన .. అన్నాడు యశ్వంత్ .

విధాత్రి ... ఏం మాట్లాడుతున్నావు నువ్వు ? నేనీ పేరు మా నాన్న గారి నోట రెండు సార్లు విన్నాను .. అంది

ఆశ్చర్యం గా రచన .

అవును రచనా .. విధాత్రి ని నేను చూసాను .. కలిసాను మాట్లాడాను .. అంతెందుకు ? కొద్ది సేపటి క్రితం నిన్నూ

నన్నూ ఆ వైజయంతి బారి నుంచి కాపాడింది కూడా విధాత్రే .. అన్నాడు యశ్వంత్ .

ఆమె మాన్ప్రడి పోయి చూసింది అతడి వైపు ..

(ఇంకా ఉంది )


ప్రకృతి ఒడిలో నేను

దూకే జలపాతం లా ఉరకాలని ఉంది ..

మెరిసే ఆ మేఘం లా కరగాలని ఉంది ..

వెలిగే భానుని మల్లే చీకట్లని తరమాలి ..

అరవిరిసే మల్లియ లా సువాసన పంచాలి ..

కూసే ఆ కోయిల లా తీయంగా పాడాలి ..

మురిసే ఆమని లాగా ప్రతి దిక్కు నీ పలకరించాలి ..

నీడ నిచ్చే మాదిరి ఇతరులకి సాయ పడాలి ..

ఎడారిలో ఒయాసిస్సులా దాహం తీర్చాలి ..

గలగలల సెలయేరల్లె నా పరుగులు ఉండాలి .

ప్రతిరోజూ పున్నమిలా వెన్నెల కురవాలి .

హేమంతపు తుషారం లా ప్రకృతి ఒడిలో ఒదగాలి .

సంద్రాన ఎగిసే అలలా నింగిని తాకాలి ..

చిరుగాలి తాకిన వెంటనే చిరుజల్లై మారాలి .

మెలికలు తిరిగే రహదారై గమ్యం చేర్చాలి ..

గగనం లో చుక్కల్లా మిరుమిట్లు గొలపాలి

పచ్చని ఆ పచ్చిక వలనే పాదాలను స్పృశిo చాలి ..

తలలూపే వరి పైరల్లే ఆకలి తీర్చాలి ..

పుష్పించే పూవుల్లోన అందం నే కావాలి ..

పరవశమే కలిగించే సంగీతం కావాలి ..

వణికించే చలిలోనా వెచ్చదనం నా తలపవ్వాలి .

ప్రతి ఒక్కరి సంతోషం లో నా వంతూ ఉండాలి ..


Wednesday, 12 February 2014

నా ఇష్టం

తూర్పు ని వేడెక్కించే సూరీడు రాక నాకిష్టం ..

చురుక్కు మనిపించే నును లేత ఉదయ కిరణాలు నాకిష్టం ..

గగన సీమలో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు నాకిష్టం ..

కానీ ఆ సమయం లోనే ముసుగు తన్ని నిద్ర పోవటమంటే మరీ ఇష్టం ..

నిద్ర లేపుతూ అమ్మ వేసే మొట్టికాయలు కాస్త ఇష్టం ..

భగవంతుని ముందర బామ్మ చదివే సుప్రభాతం ఇష్టం .

ఓ పక్క మేను సూర్య రశ్మి తాకుతుంటే మరో పక్క చన్నీళ్ళ స్నానం ఇష్టం ..

అమ్మ చేసే వేడి వేడి ఇడ్లీ ,కొబ్బరి పచ్చడి .. అబ్బా .. ఇంకా ఇష్టం ..

చాడీలు చెప్పే చెల్లాయి అల్లరి భరించటం నాకెంతో ఇష్టం

నాన్న చెప్పే నీతులు ఓ చెవిన వింటూ మరో చెవిన వదిలేయటం ఇష్టం .

నీతులు చెప్పాక బుగ్గ మీద ముద్దు పెట్టి నాన్న ఇచ్చే చిల్లర ఇష్టం

ఇష్టం లేకపోయినా బుద్ధి నటించి బడికి వెళ్ళటం  ఎందుకో తెలియని ఇష్టం .

తెలుగు మాస్టారి పద్యాలు వింటూ క్లాసు లో నిద్ర పోవటం ఇష్టం .

ఆయన కి కోపమొచ్చి విసిరిన డస్టర్ నాకు తగలక పొతే .. చాలా ఇష్టం .

నాన్నిచ్చిన చిల్లర తో కొనుక్కున్న పుల్ల ఐస్ .. నా కెంతో ఇష్టం ..

ఒళ్ళు అలిసేలా స్నేహితులతో ఆటల్లో మునగటం ఇష్టం ..

అలసి సొలసి ఇల్లు చేరి ఎదురు చూసే అమ్మ ని వాటేసుకోవటం ఇష్టం .

బామ్మ ఇచ్చే తాయిలం తో పాటూ కథ చెప్పమని అడగటం ఇష్టం ..

అమ్మ పెట్టె గోరుముద్దల తో కడుపు నింపుకోవటం ఇష్టం .

ఆకసాన చుక్కలెన్నో లెక్క పెట్టటం ఇష్టం ..

మబ్బు చాటు నుండి జాబిల్లి బయటకి వచ్చి నపుడల్లా చప్పట్లు కొట్టడం ఇష్టం ..

బామ్మ చెప్పే కథలు వింటూ ఆకాశాన చంద్రున్ని చూస్తూ నాన్న ఒడి లో నిదురపోవటం ఇష్టం .

ఆ తీయని బాల్యాన్ని మరల మరల నెమరు వేసుకోవటం ఎందుకనో చెప్పలేనంత ఇష్టం .


నా ఇతర పోస్ట్ లను కూడా చదవాలనుకుంటే క్లిక్ ఆన్ www.naarachana.com

రుధిర సౌధం 73

ఆ ఆలయం ప్రవేశ రహితమై ఉంది యశ్వంత్ .. కానీ మీరు ప్రవేశానికి ప్రయత్నించవలసి ఉంది . నేను మీకు

ఆలయం జాడ తెలుసు కోవడానికి కొన్ని సూచనలు మాత్రమే ఇవ్వదలిచాను . ఆలయం ఈ మహల్ ప్రాంగణ

మందే ఉన్నది .. సింహద్వారానికి సరిగ్గా దక్షిణం లో .. ఆలయాన్ని జల దేవత సంరక్షిస్తున్నది .. ఆలయ

ప్రవేశానికి ప్రయత్నించేవారు అర్హులైతే ఆమె అనుమతి ఇస్తుంది . ఆ అర్హత రచన కి ఉన్నది . ఆమె కి తోడువైన

నీకూ అనుమతి లభించ వచ్చు .. కానీ మీకు ఆలయం జాడ అయితే తెలియవచ్చు గానీ .. ఆలయ ద్వారం

మాత్రము వైష్ణవీ మాత యే స్వయం గా మూసి వేసి ఉన్నందున ఆమె అనుమతి తప్పక కావలెను . ఆలయ

ద్వారం లోపల నుండి మూసి వెయ బడింది . కావున మహల్ ప్రాంగణ మందున ఆలయం జాడ మీరు తెలుసు

కున్నా ఆలయ ప్రవేశం మాత్రం మీకు వీలు కాదు . అన్నది విధాత్రి మీనాల్లాంటి తన కళ్ళని తిప్పుతూ ..మరి రాకుమారీ .. ఆలయ ద్వారం తెరవటం ఎలా ? ఉత్సుకతగా అడిగాడు యశ్వంత్ .

సందేహం వలదు యువకుడా .. మనసు తో ఆలోచించి చూసిన యెడల మార్గం దొరకక పోవునా ? సమయం

తానంతట అదే దారి చూపును . అంది విధాత్రి .

కానీ ... ఈ మార్గం లేకపోతె ఇంకో మార్గం ఉండాలి కదా .. అన్నాడు యశ్వంత్ .

ప్రతీ సమస్య కి పరిష్కారం ఉన్నట్లే ఒక దారి మూసుకు పొతే ఇంకో దారి తెరచే ఉంటుంది .. ప్రయత్నం అవసరం .

అంది విధాత్రి .

ఆ ఇంకో దారి ఎక్కడ ఉంది ? అన్నాడు యశ్వంత్ చురుగ్గా ..

ఆమె మనోహరం గా నవ్వింది ..

ఈ గ్రామానికి పశ్చిమ దిశలో ఒక కొలను ఉంది .. ఆ కొలను లో నే మార్గం ఉంది .. అన్వేషించండి .. అంది విధాత్రి .

రాకుమారీ .. ఎంతో సహాయం చేసారు .. ఇంకొక్క మాట .. రాముడి గురించి అడగాలి .. అని యశ్వంత్ అనే లోపు

తెలిసిన విషయాల గురించి మళ్ళి తెలుసుకోవటం అనవసరం .. శతృత్వం సాలె గూడు లా అల్లుకోక మునుపే

రాబోయే పౌర్ణమి కి ఆలయం జాడ తెలుసు కోండి .. మళ్ళి వచ్చే పౌర్ణమి ఆలయం లో సహస్ర హోమాలతో

ప్రజ్వరిల్లాలి .. ఇది గనుక ఇప్పుడు జరగక పొతే మరో 60 ఏళ్ళ వరకూ ఆలయం జాడ తెలిసే శుభ ముహూర్తం

రాబోదు .. సమయం లేదు .. మార్గాన్వేషణ గావించి రచన చే ఈ ఉత్తమ కార్యం జరిపించాలి .. దీని కోసమే

కొన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాను .. ఆలయం తిరిగి తెరవబడితే .. అటు వైజయంతి కి ,నాకూ .. ఈ మహల్

లో కొన్నేళ్ళుగా అకాల మరణాలు పొందిన వారికి ముక్తి లభిస్తుంది . అంది విధాత్రి .

అలాగే రాకుమారీ .. సాధ్యా సాధ్యాలని మరచి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను .. ఇంత మంచి పని లో నాకు

భాగస్వామ్యం కల్పించినందుకు .. మీకెంతగానో ఋణ పడిపోయాను .. అన్నాడు యశ్వంత్ ..

ఇప్పుడు రచన నుండి నేను వేరై పోతాను .. ఇక సెలవు అంది రాకుమారి ..

ఓ క్షణం రచన శరీరం నుండి ఓ కాంతి వెళ్ళిపోయింది .

ఆమె తోట కూర కాడలా కింద పడిపోయింది .

రచనా .. రచనా .. అని ఆమె ని తట్టి లేపాడు యశ్వంత్ .

యష్ ..  ఏమయింది నాకు మగత గా అడిగింది ఆమె ..

ముందు లే .. అనగానే దిగ్గున లేచి .. మనం మహల్లో ఉన్నాం కదూ .. నీకేం కాలేదు కదా .. అంది కంగారుగా ..

అన్నీ తరువాత మాట్లాడుకుందాం .. ముందు నాతొ రా .. అని ఆమె చేయి పట్టుకొని భవనం వెనుక వైపు కి

వెళ్ళాడు యశ్వంత్ .. చుట్టు పరికించి చూస్తే ఎండిపోయిన మడుగు కనబడింది .

అతడు దానివైపు పరీక్ష గా చూసాడు .. ఎందుకో ఓ క్షణం అది నిండుగా నీరు తో ఉన్నట్లు కనబడింది యశ్వంత్ కి .

(ఇంకా ఉంది )


Tuesday, 11 February 2014

మనసుంటే మార్గం కనరాదా ఎపుడైనా ...

               నింగీ నేలా కలవవని .. నీరూ ,నిప్పు పొసగవని ..

               రాత్రీ పవలు కలిసుండవని   .. అంటూనే జతగా పలికామే ..

               సాధ్యం కానిది ఉందా ఏదైనా ? మనసుంటే మార్గం కనరాదా ఎపుడైనా ...


               డబ్బు కి లోకం దాసోహం అని అంటే తీరునా నీ దాహం ..

                ఆకలి దప్పుల ఈ లోకానికి పరిచయం చేసావు ధన దాహం ..

                అవసరం మేర కూడు గూడు అత్యాశ మేర ఆ భవంతులు ..

               గగన సీమ లో కాలు ని మోపి నేల ని మరచిన సామంతులు ..

               తృప్తి నీయని ఐశ్వర్యం , శాశ్వతం కానిదీ సౌందర్యం ..

                అందరాని ద్రాక్షపండు ని మరచి చంద్రున్ని చూసే నైజం .

             
                చెప్పేటందుకే నీతులు .. ఆ నీతిని కనరాని చేతలు ..

                 తీసెవన్ని గోతులు .. చూడలేరు వెనకున్న నూతులు ..

                  కాసుల కోసం కోతలు .. పదవుల ఊచ కోతలు ..

                  పేదవాడికి ఎదురీతలు .. ఎదురిస్తె మిగులు గుండె కోతలు ..

                  పక్కవాడి పై అసూయ దేనికి నీ పక్క సామర్థ్యం ఉన్నంతకి

                 పగవాడినైన గౌరవించ గలిగితే పగ కైనా ఉండదు స్థానం ..


                నిన్ను నువ్వు మలచుకో నవ సమాజాన ఒక ఇటుక గా ..

                నిన్ను నువ్వు కలుసుకో సంస్కార మున్న మనిషిగా ..

                ఒక చినుకు తోనే మొదలవును వరద ..

                 ఒక అడుగు తో నీ పయనం మొదలవదా ..

                  తలచుకుంటే సాధ్య మవదా .. వెలుగు నీయదా సంకల్ప ప్రమిద
                     
               
                       

రుధిర సౌధం 72

ఆ ప్రేతం భయంకరం గా గర్జించింది . తుళ్ళి పడి చూసాడు యశ్వంత్ . రచన మాత్రం తొణకలేదు . బెనకలేదు .. 

కొంపదీసి రచన లో విధాత్రి లేదు కదా .. అని రచన వంక పరీక్ష గా చూస్తున్నాడు యశ్వంత్ .. 

లెట్స్ గో యశ్వంత్ .. అంది రచన .. యశ్వంత్ చేతిని పట్టుకుంటూ .. 

ఐతే ఈమె రచన .. విధాత్రి కాదు అనుకున్నాడు యశ్వంత్ . 

కానీ రచన అడుగు ముందుకి వేయగానే .. ఆ హాలు లో ఉన్న వస్తువులన్నీ ఎగురుకుంటూ వీరి వైపు దూసుకు 

రాసాగాయి .. వాటిని తప్పించుకొనే ప్రయత్నం లో యశ్వంత్ ఓ పక్క రచన ఓ పక్క ఎగిరి పడ్డారు .. 

యిద్దరూ చెరో వైపు పడ్డారు .. ఆ ప్రేతం భయంకరం గా నవ్వింది .. ఆ నవ్వు కర్ణ కఠోరం గా ఉంది .. 

యష్ .. నా దగ్గరికి రా .. కింద పడిన రచన లేవడానికి ప్రయత్నిస్తూ అంది .. 

యశ్వంత్ లేచి నిలబడటానికి ప్రయత్నించే లోపు ఒక్కసారిగా గాలిలో విసురుగా గుమ్మం తలుపుల్ని నెట్టుకుంటూ 

బయటకి  వెళ్లి పడ్డాడు .. యశ్వంత్ బయటకి విసిరి వేయబడగానే సింహద్వారం మరలా మూసుకు పోయింది .. 

అంత గట్టిగా కింద పడటం తో మోకాళ్ళు ,మోజేతులు గీరుకు పోయాయి .. పైకి లేవడానికి ఇబ్బంది పడ్డాడు యష్ . 

ఐన విశ్వప్రయత్నం చేసి లేచాడు .." రచనా .. లోపల ఒక్కతే ఉండి పోయింది .. ఎలా అని లేని బలాన్ని తెచ్చుకుని 

సింహద్వారం దగ్గరకి పరుగున వెళ్లి తలుపు నెట్టడానికి ప్రయత్నించాడు . కానీ తలుపులు తెరవబడ లేదు .. 

ఓహ్ గాడ్ .. రచన ని ఒంటరిని చేయడానికి ఆ ప్రేతం నన్ను బయటికి పంపేసింది .. రచన మానసిక స్థైర్యాన్ని దెబ్బ 

తీయడానికి ప్రయత్నిస్తుంది .. రచన బలహీన పడే లోపు నేను ఎలాగైనా వెళ్ళాలి .. భవనం వెనుక వైపు కి పరుగు 


తీసాడు యశ్వంత్ . 

కానీ యశ్వంత్ కి లోపలకి వెళ్ళే మార్గం కనబడ లేదు .. ఎలా ఇప్పుడు ? అని మధన పడుతున్న యశ్వంత్ కి 

విధాత్రి గుర్తుకు వచ్చింది . రాకుమారీ .. ఎక్కడున్నారు ? విధాత్రీ ... గట్టిగా అరిచాడు యశ్వంత్ ... 

ఇంతలో అతని వెనుకవైపు ఏదో సవ్వడి వినిపించి వెనక్కి తిరిగాడు .. 

అతని కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి .. అక్కడ కారిడార్ లో నేల పైన ఓ కాంతి చిన్నగా ఉద్భవించి అది దట్ట 

మయిన కాంతి పుంజం గా మారి అతని వైపు వచ్చి నట్టే వచ్చి మూసి ఉన్న తలుపుల లోపలికి చొచ్చుకు 


పోయింది ... 

"ఆ కాంతి .. తను ఖచ్చితం గా విధాత్రే .. ఆ కాంతి మహల్ లోపలికి వెళ్ళింది .. విధాత్రి రచన శరీరం లోనికి తప్పక 

వెళుతుంది .. " యశ్వంత్ .. ఆ ఆలోచన లో ఉండగానే మహల్ వెనుక భాగం తలుపులు భళ్ళున  తెరచు 

కున్నాయి.. 

మహల్ వెనుక భాగం తలుపు కూడా తెరచుకుందే .. అని ఉద్వేగం తో మహల్లొనికి ప్రవేశించాడు యశ్వంత్ . 

మహల్ అంతా పురాతనం గా లేదు .. కొత్త వెలుగు సంతరించు కుంది .. అతడు ఆశ్చర్యం గా చూస్తూనే హాల్ లోనికి 

ప్రవేశించాడు .. అక్కడ అంతవరకూ భీబత్సం చేసిన వైజయంతి లేదు .. కానీ కాంతులు చిమ్ముతూ ఓ స్త్రీ రూపం 

రా యశ్వంత్ .. అని ఆప్యాయం గా ఆహ్వానించింది .. 

రాకుమారీ .. అన్నాడు యశ్వంత్ .. సంతోషం గా .. 

అంత నమ్మకం తో పిలిచాక రాకుండా ఎలా ఉండగలను ? అంది ఆమె ముగ్ధ మనోహరం గా నవ్వుతూ .. 

రచన ... అని ఆగిపోయాడు యశ్వంత్ .. 

తనకేం కాలేదు .. తన శరీరము నే కదా నే ధరించినది .. అంది విధాత్రి . 

రాకుమారీ నేను మీతో చాలా మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ 

నీ అనుమానాలు నాకు తెలుసు యశ్వంత్ .. ముందుగా మీరిరువురు వైష్ణవీ మాత ఆలయం పై దృష్టి పెట్టండి .. 

ఆలయం లో దీప కాంతులే ఈ మహల్ లో సంతోష కాంతులను నింపుతాయి అంది విధాత్రి .. 

ఆ ఆలయం ఎక్కడుంది ? అడిగాడు యశ్వంత్ . 

(ఇంకా ఉంది )  

Monday, 10 February 2014

పల్లె అందాలు

ఓ వారం క్రితం నేను తూర్పు గోదావరి  జిల్లా వెల్లటం జరిగింది.తిరుగు ప్రయాణం లొ స్టేషన్ కి వెల్తుండగా ఆటొ

లోంచి నేను తీసిన కొన్ని ఫోటోలు ఇవి ..

పల్లె అందాలు.. ఓ పక్క పొలాల మథ్య లోంచి వెల్తున్న రైలు..మరో పక్క అస్తమిస్తున్న భానుడు. మీరూ చూడండి