Saturday, 1 February 2014

రుధిర సౌధం 64


నాన్నగారూ .. పిలిచారా ? వినయం గా వచ్చి నిల్చున్నాడు రత్నం .

ధాత్రి ఎక్కడ ? గర్జించాడు భూపతి .

నాన్నా .. అది .. ధాత్రి ఉదయాన్నే బయటికి వెళ్ళింది . నేను తనని ఎక్కడకి ఏమిటని అడగలేదు ,, అన్నాడు

రత్నం .

వెంగమ్మ వీరి సంభాషణ తో తనకేం పని లేదన్నట్లు సోఫాలపై దుమ్ము దులుపుతుంది .

నువ్వు అడగవు .. నాకు తెల్సు .. నా కొడుక్కి అన్ని తెలివితేటలు ఉంటే .. నాకెందుకు సమస్యలొస్తాయి .. అని

ఆ పట్నం అమ్మాయి .. ఎక్కువ గా ఆ యశ్వంత్ వాళ్ళ తోనే ఉంటోందట .. అన్నాడు భూపతి ..

అదీ నాన్నా .. ధాత్రి పట్నం అమ్మాయి కదా .. ఈ వూళ్ళో తనకి తోచక వేల్లిపోతానంటే ... అందుకే .. నేను తనని

యశ్వంత్ వాళ్లకి పరిచయం చేసా .. వాళ్ళు మంచి స్నేహితులు అయినట్టున్నారు .. అంతే .. అన్నాడు .

ధాత్రి విషయం లో నువ్వు కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లున్నావు .. ఈ మధ్య పై వూళ్ళు కూడా వెళ్ళడం లేదు ..

ఏంటి విషయం రత్నం రాజు ? అడిగాడు భూపతి .

నాన్న గారూ .. మీరెందుకలా నన్ను అడుగుతున్నారో నాకు తెలియదు .. మీ ద్రుష్టి లో నేను చెడు తిరుగుళ్ళు

తిరిగే వాడిని .. ఆడవాళ్ళని అనుభవించి వదిలేసే వాడిని .. నిజమే .. కానీ ధాత్రి ఎందుకో నచ్చింది నాకు ..

నేనింత వరకు తిరిగిన ఆడవాళ్ళ జాబితా లోకి నేను ఆమె ను చేర్చ లేక పోతున్నాను .. ఆమె స్నేహం కావాలని

అనిపిస్తుంది నాకు .. ఆమె సంతోషం కోసం ఏమైనా చేయాలని పిస్తుంది . ఆమె ని సొంతం చేసుకోవాలని , పెళ్లి

చేసుకోవాలని అనిపిస్తుంది .. ధాత్రి ని కనుక మీరు నా భార్య ని చేయగలిగితే నేను నా చెడు అలవాట్లని మార్చు

కుంటాను .. అంతే కాదు మీకు నచ్చిన కొడుకు గా ఉండటానికి ప్రయత్నిస్తాను .. అన్నాడు రత్నం రాజు .

అతని వంక విస్తుపోయి చూసాడు భూపతి .

ఆ అమ్మాయి ఎవరో ఏమిటో .. తెలియకుండా .. అని ఏదో మాట్లాడ బోయాడు ..

నాన్నా .. మీరు నా సంతోషం కోసం ,నాకోసమే బ్రతుకు తున్నారని నాకు తెలుసు . ధాత్రి ని చూస్తేనే తెలుస్తుంది

కదా .. తనొక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయని .. తన కన్నా మంచి అమ్మాయి ని మీరు నాకెక్కడ

వెదకగలరు నాన్నా .. అన్నాడు ఆవేశం గా .

రత్నం ... నువ్వింతగా ఆ అమ్మాయి కోసం మాట్లాడు తున్నావ ? అన్నాడు ఆశ్చర్య చకితుడై భూపతి .

ధాత్రి ని అనుక్షణం అనుమానించకండి నాన్నా .. తను చాలా మంచిది .. తనతో మీరు కరుకు గా మాట్లాడినా

నేను భరించలేను అన్నాడు రత్నం .

సరే .. ఈ మాట నువ్వు తనతో చెప్పావా ? అడిగాడు భూపతి .

ఇంకా లేదు .. కానీ ధాత్రి నాతొ ప్రేమగానే ఉంటుంది .. నాకు తెలుసు .. తనకి అభ్యంతరం ఏమి ఉండదు ..

సమస్యల్లా మీతోనే ... అన్నాడు రత్నం .

సరే .. నా కొడుకు కోరుకుంటే కొండ మీది కోతి నైనా తీసుకువస్తాను .. అలాంటిది .. ఈ ధాత్రి గురించి ఆలోచిస్తానా ?

వెళ్ళు .. సంతోషం గా ఉండు .. ధాత్రి ని నీ భార్య ని చేస్తాను .. అన్నాడు భూపతి కొడుకు తల మీద ఆప్యాయం గా

చేయి వేసి .

రత్నం మొహం వికసించింది .

ఇంతలో బాలయ్య వచ్చి .. అయ్యా .. అని నిలబడ్డాడు .

బాలయ్య మొహం లో కలవరం చూసి .. నువ్వెళ్ళు రత్నం .. అని చెప్పి బాలయ్య దగ్గరకి నడిచాడు భూపతి  .

అయ్యా .. కొంచెం మనం ఊరవతల కి పోవాలే .. అన్నాడు బాలయ్య .

ఎందుకురా ? అని అడిగాడు భూపతి .

ఈరాసామి ఆడున్నాడు .. మీతో ఏదో ఇషయం బేగి చెప్పాలంట .. అన్నాడు బాలయ్య .

సరే పద .. అని వెనక్కి తిరిగి వెంగీ .. బయటకు వెళ్తున్నా .. అని చెప్పి బాలయ్య తో ముందుకి నడిచాడు భూపతి .

(ఇంకా ఉంది ?)



1 comment:

vijjubhai..! said...

bollochchi...!!
nallad...!!
adhbutam..!!
subhanallah..!!
chennaide...!!
marvelous..!!