యశ్వంత్ బృందం షాపింగ్ పని ముగించుకొని రావణ పురం తిరిగి వస్తూ దారిలో ఓ పెద్ద చెరువు దగ్గర విశ్రాంతి
కోసం ఆగారు .
మురారీ .. ఈ చెరువు బావుంది .. సరదాగా కాసేపు చేపలు పడదామా ? అంది సత్య .
సత్యా .. ఈ మథ్య నువ్వు మరీ చిన్న పిల్లలా తయారవుతున్నావు .. ముద్దుగా విసుక్కున్నాడు మురారి .
శివ ,యశ్వంత్ ఇద్దరూ ఆ చెరువు గట్టు మీద కూర్చున్నారు .
హమ్మయ్య !యష్ .. సైకిల్ లు కొనుక్కున్నాం .. ఆ వూరిలో తిరగడానికి బావుంటుంది . అన్నాడు శివ .
నిజమేలే .. అన్ని తీసుకున్నట్లేగా .. అన్నాడు యశ్వంత్ .
యష్ .. అంటూ వీరి దగ్గరకి వచ్చింది రచన .
చెప్పు రచనా .. అన్నాడు యశ్వంత్ .
యష్ .. ఊర్నుంచి ఇంత దూరం వచ్చాం . ఫోన్ సిగ్నల్ మాత్రం లేదు . అమ్మ తో మాట్లాడదాం అనుకున్నా ..
అంది రచన .
ఓహ్ .. ఇక్కడ సిగ్నల్ ఉండదు కదా .. సరేలే రేపు మాట్లాడుదువ్ గానీ .. అన్నాడు యశ్వంత్ .
మళ్ళి రేపా ? అంది రచన .
అవును రచనా .. రేపు సరస్వతి ని పోలిస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళాలి .. మొన్నఆఫీసర్ చెప్పారు .. స్టేషన్ కి కొంచెం
పశ్చిమం గా వెళ్తే కొంచెం సిగ్నల్స్ క్యాచ్ అవుతాయట ఆ ఏరియా లో ... అందుకే అంటున్నా .. రేపు నువ్వు నేను
శివ సరస్వతి ని తీసుకొద్దాం .. ఓకే నా ? అన్నాడు యశ్వంత్ .
సరే అయితే .. అంది సంతోషం గా రచన .
సరే గానీ .. అని జస్ట్ ఒక్క నిమిషం శివా అని లేచి .. రచన చేతిని పట్టుకుని వెహికల్ దగ్గరకి తీసుకొచ్చాడు యష్ .
ఏ యష్ .. ఏంటిది ? అంది రచన .
నువ్వు నా ప్రేమ ని అంగీకరించావు . చిన్నప్పటి నుండి మనం కలిసే పెరిగాం . నీతో నేనెప్పుడు ఉన్నాను . కానీ
ఇప్పుడు నువ్వు నాదానివి అన్న భావనతో ఉండటం నాకెంతో నచ్చింది రచనా .. అన్నాడు యశ్వంత్ .
ఐ లవ్ యు యష్ .. అంది ప్రేమగా రచన .
ఐ లవ్ యు టూ .. బట్ నీకో చిన్న గిఫ్ట్ .. అని కార్ విండో లోంచి చేయి లోపలికి పట్టి ఒక గిఫ్ట్ ప్యాక్ ని తీసి ఇచ్చాడు .
యశ్వంత్ .
దాన్ని చూస్తూనే కళ్ళింత చేసి యష్ .. నాకే తెలియకుండా ఎప్పుడు తీసుకున్నావు ? అంది దాన్ని అందుకుంటూ
.. రచన .
ఈ అందమైన క్షణాలని ఏంటో ఇలా సింపుల్ గా చెప్పానని నేను భావిస్తున్నా .. బట్ నీ మొహం లో ఆనందం ..
చూస్తే ఐ ఫీల్ హ్యాపీ .. అన్నాడు యష్ .
ఆమె ఆ గిఫ్ట్ రాపెర్ ని ఓపెన్ చేయ బోతుంటే .. ఆమె చేయి పట్టి ఆపి .. నో నో .. ఇక్కడ కాదు .. నువ్వు ఒంటరిగా
ఉన్నప్పుడు ఓపెన్ చెయ్ .. ముందు అది నీ బాగ్ లో పెట్టేయ్ .. ఓకే .. నే వెళ్తాను .. నువ్వు అది పెట్టేసి రా .. అని
శివ దగ్గరకి వెళ్ళిపోయాడు యశ్వంత్ .
ఆ గిఫ్ట్ ప్యాక్ పట్టుకుని సంతోషం గా అనుకుంది రచన .. "నీ ఇష్టం మై డియర్ .. ఈ గిఫ్ట్ నేను ఒంటరిగా ఉన్నప్పుడే
ఓపెన్ చేస్తాను" అని .
*************************
ఊరు పోలిమేరలకి చేరుకున్నాక .. బాలయ్య .. నువ్విక్కడే ఉండు .. అని దట్టం గా ఉన్న పొదల చాటుకి వెళ్ళాడు
భూపతి .
అక్కడ భూపతి కోసమే వేచి చూస్తున్న వీరాస్వామి ... మొహం అదోలా పెట్టి రండి భూపతి గారూ .. అన్నాడు .
వీరస్వామి .. నిన్ను అస్తమానం కలవటం కుదరదని నీకు చెప్పాను .. కానీ ఇంతలోనే ఏం కొంప మునిగింది ?
మళ్ళి ఊల్లొకి వచ్చావు ? అన్నాడు కోపం గా భూపతి .
భూపతి గారూ .. విషయం అటువంటిది .. తెలుసుకోవటానికి ప్రయత్నించండి .. అన్నాడు వీరస్వామి కళ్ళెర్ర జేసి .
సర్సర్లె ... ఇంతకీ ఏమిటా విషయం ? అన్నాడు భూపతి .
భూమిలో మనం పాతిపెట్టిన ఆ జాడీ బయటికి తీయబడింది .. జాడీ లో బంధించిన ఆత్మ ప్రళయ భయంకరమై
నన్ను ముప్పతిప్పలు పెట్టింది .. అన్నాడు వీరస్వామి .
ఏంటి ? వీరస్వామి నువ్వు చెప్పేది? జాడీ ని ఎవరు బయటకి తీసి ఉంటారు ? మనిద్దరకే తెల్సిన ఈ విషయం
వేరొకరికి ఎలా తెలిసుంటుంది ? వణుకు తున్న గొంతు తో అన్నాడు భూపతి .
?(ఇంకా ఉంది )
No comments:
Post a Comment