భయ పడకు స్వామీ .. నేనొదిలి పెట్టను .. ఈ వీరస్వామి తో పరాచికాలు ఆడితే ఫలితం ఏమిటో చూపిస్తాను స్వామీ
... ఈరోజే అంజనం వేసి చూస్తా .. నిజం తెలిసి పోద్ది .. అన్నాడు వీరస్వామి .
కానీ ఆ లోపే ఈ విషయం యోజనాలు దాటేస్తే .. అన్నాడు భూపతి .
ఈ వూరు లోంచా ... అని గట్టిగా నవ్వాడు వీరస్వామి .
ఆ పట్నం వాళ్లకి గానీ ఈ విషయం తెలియదు కదా .. అన్నాడు భూపతి .
నువ్వు చింతించకు స్వామీ .. విషయం నాకోదిలి పెట్టు .. నేను చూసుకుంటాను . ఇక వెళ్తాను స్వామీ .. అని
గుప్పున పొగ వదులుతూ ఆ గుబురు పొదల్లోంచి వెళ్ళిపోయాడు వీరస్వామి .
నుదుటి చెమట ని తుడుచు కుంటూ .. బయటికి వచ్చి బాలయ్య నిలబడిన చోటు దగ్గరకి నడిచాడు భూపతి .
బాలయ్యా .. ఆ పట్నం వాళ్ళ ఇంటికి పో .. వారెం చేస్తున్నారో నాకు చూసి చెప్పు .. అన్నాడు భూపతి .
అలాగే నయ్యా .. అని ముందుకి నడిచాడు బాలయ్య .
భూపతి ఓ నిట్టూర్పు విడిచి .." మీ జోలికి రాకూడదని భావించా .. కానీ నా ఉనికి కి మీ వల్ల భంగం వాటిల్లితే
క్షమించను ". అని మనసులో అనుకున్నాడు .
************************
అయ్యా .. వారెవరూ ఇంట్లో లేరయ్యా .. బండి కూడా లేదయ్యా .. అన్నాడు బాలయ్య . భూపతి ముందుకి వచ్చి
నిలబడి.
అవునా ? అని పద బాలయ్యా .. అక్కడకి వెళ్దాం .. అని కూర్చున్న కుర్చీ లోంచి లేచాడు భూపతి .
ఇద్దరూ కలసి యశ్వంత్ వాళ్ళుండే ఇంటి దగ్గరకి వచ్చారు .
ఇంటికి చిన్న తాళం కప్ప వేసి ఉంది .
ఈ తాళం మనదే నయ్య .. ఎక్కడికో వెళ్లుంట రయ్యా .. అన్నాడు బాలయ్య .
ఎక్కడికి వేల్లుంటారు ? అని ఆలోచించాడు భూపతి .. ఉదయం నుండి ధాత్రి కూడా ఇంట్లో లేదు .. అందరూ కల్సి
వెళ్లి ఉంటారా ? అని ఆలోచన లో పడ్డాడు భూపతి .
అయ్యా .. అని బాలయ్య పిలవడం తో ఆలోచన నుండి బయట పడి ఏంటి ? అన్నాడు భూపతి ..
పెరట్లో వాళ్ళ బట్టలు ఆరేసి ఉన్నాయయ్యా .. ఊరు విడిచి పెట్టేసి వెళ్లి ఉండరు .. అన్నాడు బాలయ్య .
వీడి బుర్ర బాగానే పని చేస్తుంది .. అనుకొని పదరా పెరటికి .. అన్నాడు భూపతి ..
పెరటి వైపుకి చేరుకొని అంతా పరికించి చూసాడు భూపతి .. పెరటి వైపున్న చెత్త కుండీ వైపు నడిచాడు ..
చెత్త కుండీ లోకి తొంగి చూసాడు .. అతనికి కావాల్సింది లభించింది ... అక్కడ అతనికి గాజు పెంకులు కని పించాయి ..
. భూపతి తెలివైన బుర్రకి విషయం అర్థమైంది .. కోపం తో పళ్ళు కొరికాడు .. బాలయ్య ... అని గట్టిగా అరచాడు .
అయ్యా .. అని పరుగున వచ్చి నిలబడ్డాడు ..
మనం ఇక్కడకి రావటం ఎవరన్న గమనించారా ? అని అడిగాడు భూపతి ..
లేదను కుంటా నయ్యా .. అన్నాడు బాలయ్య .
ఇక్కడ ఎండలో ఆరుతున్న వాళ్ళ బట్టల్లో ఏదో ఒక గుడ్డ ముక్క తీసుకు రారా .. అని కోపం గా అక్కడ్నించి
వెళ్ళిపోయాడు భూపతి .
బాలయ్య ఓ టీ షర్టు ని అందుకొని దాన్ని తుండు గుడ్డలో దాచి అక్కడ నుండి బయట పడ్డాడు .
********************
సాయంత్రం అవుతుండగా ఇల్లు చేరు కున్నారు యశ్వంత్ బృందం .
వెంట తెచ్చు కున్న సామానంతా ఇంటిలో అమర్చుకోవటం లో నిమగ్న మయ్యారు .
యష్ .. మీరీ పనులు చూసుకోండి . నేను బంగ్లా కి వెళ్తాను .. కాస్త విశ్రాంతి కావాలని పిస్తుంది అంది రచన .
నాకు తెలుసు .. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయాలనే కదూ ఆ తొందర ? అన్నాడు యశ్వంత్ .
ఆమె అతడికి చిలిపిగా కన్ను గీటింది ..
వెళ్ళు .. బట్ .. ఫ్రెష్ గా స్నానం చేసి .. అప్పుడు చూడు .. ఓకే న ? అన్నాడు యశ్వంత్ .
సరే .. అంది రచన .. సత్యేదో మురారి తో చెబుతోంటే అటు చూస్తూ ...
మురారీ .. పెరట్లో ఆరబెట్టిన బట్టల్లో ఓ టీ షర్టు కనబడటం లేదు .. మొహం చిన్నబుచ్చు కొని అంటోంది సత్య ..
అబ్బ .. గాలికి ఎటో ఎగిరి పోయుంటుంది సత్యా .. మరొకటి కొందాం .. వదిలేయ్ .. అంటున్నాడు మురారి .
సర్లే .. వాళ్ళిద్దరి గొడవా ఎప్పుడూ ఉండేదే గానీ నువ్వెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .
సరే .. బాయ్ యశ్వంత్ .. అని బయటకి నడిచింది రచన .
(ఇంకా ఉంది )
No comments:
Post a comment