రచన బంగ్లా లోకి అడుగు పెట్టగానే హాల్ లో కూర్చున్న రత్నం రాజు .. మొహం ఆనందం తో వెలిగి పోయింది ..
రచన అతడిని చూసి పలకరింపు గా నవ్వింది .
ధాత్రీ వచ్చేసావా ? ఇంత ఆలస్య మయింది .. అన్నాడు ఆప్యాయం గా .
రాజు గారూ .. యశ్వంత్ వాళ్లకి కొన్ని ఐటమ్స్ కావాలని పక్క ఊరు వెళతామన్నారు .. నాకూ కొన్ని అవసరాలు
ఉన్నాయి.. అందుకే వారితో పాటూ నేనూ వెళ్ళాను .. అంది రచన .
అయ్యో .. ఆ విషయం నాతో చెబితే నేనే నిన్ను తీసుకువెళ్ళే వాణ్ని .. అన్నాడు రత్నం నొచ్చు కుంటూ ..
మిమ్మల్ని ప్రత్యేకం గా ఇబ్బంది పెట్టడం ఎందుకు రాజు గారూ .. ? సరే .. నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను ..
తరవాత మాట్లాడదాం .. అంది రచన .
అవునవును .. బాగా అలసి పోయుంటావు .. వెళ్లి రెస్ట్ తీసుకో అన్నాడు రత్నం .
థాంక్స్ రాజు గారూ .. అని జింక పిల్లలా అక్కడ నుంచి మేడ మెట్లెక్కి తన గది కి వచ్చేసింది రచన ..
గది లోకి రాగానే బాగ్ మంచం మీదకి విసిరేసి .. స్నానం ముగించుకొని నైట్ డ్రెస్ లోకి మారిపోయింది రచన ..
హమ్మయ్య .. ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది .. యష్ .. ఇప్పుడు నీ గిఫ్ట్ ఓపెన్ చేయొచ్చా ? అనుకుంటూ బాగ్ లో ఉన్న
గిఫ్ట్ ప్యాక్ బయటికి తీసింది . ఆతృత గా ప్యాకెట్ విప్పిన రచన కళ్ళు ఆశ్చర్యం తో విచ్చు కున్నాయి .. యష్ .. ఇదా
నీ గిఫ్ట్ .. అంటే .. ఇది నువ్వు ఈరోజు కొనలేదు .. నీతో పాటే ఎప్పట్నుంచో తిప్పుతున్నావు .. హౌ క్రేజీ యు ఆర్ ..
అనుకొని దాన్ని బయటకి తీసింది .. అది ఒక రూఫ్ హేంగింగ్ ఐటమ్ ..
బలూన్ షేప్ లో ఉండి పాదరసం కిందికి ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉన్న భావన కలిగిస్తుంది . అది మొదటి సారి ..
తన తండ్రి తన చిన్నతనం లో రచన కి కానుక గా తెచ్చారు .. పక్కింట్లో ఉండే యశ్వంత్ .. దాని దారం తెంపి
వేశాడని ఎంత గొడవ పడిందో ...
ఆ జ్ఞాపకం ఆమె పెదవుల మీద చిరు దరహాసాన్ని నిలిపింది .. ప్యాక్ లో ఉన్న చిన్న లెటర్ బయటకి తీసింది ..
డియర్ రచనా ..
ఇదే మన ఇద్దరి పరిచయానికి కారణం .. దీన్ని పాడు చేశాననే చిన్నప్పటి నుంచీ నువ్వు నాతో గొడవ
పడుతూనే ఉన్నావు .. కానీ వయసు తో పాటూ నాకు నీ మీద ప్రేమా పెరిగింది .. ముంబై లో ఓ షాప్ లో కనబడింది
ఇది .. అచ్చం అంకుల్ నీకిచ్చిన అదే గిఫ్ట్ లా అనిపిస్తుంది కదూ .. అందుకే .. దీన్ని నీకు కానుక గా ఇవ్వాలని
కొన్నాను .. ఈనాటి వరకూ దాన్ని జాగ్రత్త గా కాపాడుతూ వచ్చాను .. దీన్ని చూసి నప్పుడు నీకు మీ నాన్న గారితో
పాటూ నేనూ గుర్తు రావాలి .. నీకు సంతోషమే కదూ ... నీ యష్ .
ఆ ఉత్తరాన్ని పక్కన పెట్టి చిరునవ్వు తో దాన్ని కిటికీ కి ఉన్న చిన్న మేకు కి తగిలించి దాని వంక మురిపెం గా

చూసింది రచన .
మెల్లిగా చల్లగాలి ఆమె కురులని పలకరిస్తుంది .. ఉన్నట్టుండి కిటికీ తలుపు
గాలి కి గట్టిగా కొట్టుకుంది .. యశ్వంత్ తలపులతో ఉన్న ఆమె ఆ శబ్దానికి
ఉలిక్కి పడి చూసింది . అయ్యో .. అప్పుడే కిటికీ తలుపులు కొట్టుకునేంత గాలి
ఎక్కడ్నుంచి వచ్చింది ? అని గబగబా కిటికీ తలుపుల్ని మూసింది . ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం అలముకుంది ..
ఇంతలో ఆమె చెవులకి చిన్నగా సర్రున ఏదో కోస్తున్న శబ్దం వినబడింది ..
ఆమె అయోమయం గా చుట్టూ చూసింది .. ఎక్కడ్నుంచి ఈ శబ్దం వస్తుంది .. శబ్దాన్ని చెవులు రిక్కించి వింది ..
ఆ శబ్దం .. ఆ తూర్పున ఉన్న కిటికీ దగ్గర నుంచి ..
ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ ఆ కిటికీ దగ్గరకి చేరి విస్మయం గా చూసింది దాని వైపు .. ఆమె అనుమానం
నిజమే .. మేకులు కొట్టి మరీ మూసేసిన ఆ కిటికీ తలుపులు దడదడ శబ్దం చేస్తూ చిన్నగా కదులు తున్నాయి ..
ఆమె గుండె శరవేగంగా కొట్టుకుంది .. మెల్లిగా తన చేతిని ఆ కిటికీ రెక్క మీద వేయ బోతుండగా .. భళ్ళున ఆ కిటికీ
బద్దలైనట్టు గా ఆ కిటికీ తలుపులు రెండుగా విడిపోయాయి .. ఒక్క ఉదుటున ఆమె కింద పడిపోయింది ..
ఆమె కి జరిగింది అర్థం కావటానికి ఓ 5 నిమిషాలు పట్టింది .. మెల్లిగా లేచి నిలబడి కిటికీ వైపు చూసింది ..
కిటికీ తలుపులు విడివడ్డం తో ... కిటికీ లోంచి చూస్తే ఎత్తైన గుట్ట మీద ఉన్న రాణి మహల్ స్పష్టం గా
కనబడుతుంది ... సాయంత్రపు వెలుగు తగ్గిపోతున్న ఎంతో స్పష్టం గా కనబడుతోంది .. రాణి మహల్ ...
రచన్ కి చెమటలు పడుతున్నాయి .. ఏం జరుగుతోంది .. ? అని మనసు ప్రశ్నిస్తున్న అయోమయం గా ఆమె
మహల్ వంక చూస్తుంది .
మహల్ గోడలు నల్లగా మసి బారిపోయి ఉన్నాయి .. ఆకాశం లో మేఘాలు వివిధ వర్ణాలలో కనిపిస్తున్నాయి ..
మహల్ దగ్గర ఎత్తుగా దుమ్ము రేగు తున్నట్లు కనిపిస్తుంది .. ఆమె చూస్తుండగానే ఆ దుమ్మంతా దట్టం గా
అలముకొని ఊరి వైపు రాసాగింది .. ఆమె కి మహల్ మరి కనబడటం లేదు .. ముంచు కోస్తున్న ముప్పల్లె ఆ
దుమ్ము మేఘం ఊరిని మింగేస్తున్నట్లు కమ్మేసింది ..
ఆ దుమ్ము మేఘం బంగ్లా వైపు ,కిటికీ వైపు ,రచన వైపు వస్తుంది .. నో ........ గట్టిగా అరచింది రచన .
(ఇంకా ఉంది )
No comments:
Post a comment