హాల్ లో గుమస్తా శంకరం తో ఏదో మాట్లాడు తున్న రత్నం రాజు కి మేడ మీది గది నుంచి గట్టిగా అరుపు వినిపించింది .
అతను ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు .. శంకరం గారు .. మీకూ ఎవరో అరచి నట్లు వినిపించిన్దా ? అని అడిగాడు శంకరం ను .
అవును బాబూ .. ఆ అరుపు .. ఆ పట్నం అమ్మాయి గది లోంచే .. అన్నాడు అతను కళ్ళద్దాలు సరిచేసుకుంటూ
పైకి చూస్తూ ..
అయ్యో .. ధాత్రి కేమయి ఉంటుంది .. నేను వెళ్లి చూసోస్తాను .. అని పరుగున మెట్లెక్కి ధాత్రి గది తలుపు దగ్గరకి
చేరుకొని తలుపు తట్టాడు ..
ధాత్రీ ఏమయింది ? ఓసారి తలుపు తీయ్ .. అని గట్టిగా అరిచాడు రత్నం .
స్పందన లేక పోయేసరికి .. పక్కనే ఉన్న కిటికీ తలుపు ముందుకు తోసాడు .. కిటికీ తలుపులు తీసే ఉండటం తో
ఆ కిటికీ గుండా లోపలికి దిగి చూసాడు రత్నం రాజు ..
నేల పై అచేతనం గా పడి ఉంది రచన ..
ధాత్రీ .. ధాత్రీ .. అని పిలుస్తూ ఆమె ని సమీపించి ఆమె ని తట్టి లేపాడు .. ఆమె లేవక పోయే సరికి .. వెంగమ్మా ..
అని గట్టిగా అరిచాడు .. వెంగమ్మ పరుగున వచ్చి తలుపు తట్టే సరికి .. వెళ్లి గది తలుపు తీసి .. వెంగమ్మ ముందు
నీళ్ళు తీసుకురా .. అని చెప్పి ధాత్రి ని తన రెండు చేతులతో ఎత్తుకుని మంచం మీద పరుండ బెట్టాడు ..
వెంగమ్మ చెంబు తో నీళ్ళు పట్టు కొచ్చింది ..
కంగారు పడుతూ కొంచెం నీళ్ళని రచన మొహం మీద చిలకరించాడు రత్నం ..
మెల్లిగా కళ్ళు తెరచి చూసింది రచన ..
ఆమె మొహం లో మొహం పెట్టి కంగారు గా చూస్తున్న రత్నం ని చూసి తటాలున లేచింది రచన ..
అప్పుడు గమనించింది గదిలో వెంగమ్మ కూడా ఆమె వైపు పరీక్ష గా చూస్తుంది .. ఏదో జరిగింది .. లేకపోతె
వీళ్ళిద్దరూ ఈ గదిలో ఉన్నారేంటి ? అని ఆలోచన లో పడింది .
ధాత్రీ ... ఎలా ఉన్నావు ? అసలేమయింది ? కంగారుగా అడిగాడు రత్నం ..
అదీ .. అంటూ ఓసారి తూర్పు కిటికీ వైపు చూసింది రచన కానీ అది ఎప్పటిలానే మూసి ఉంది ..
ఏమయింది ధాత్రీ ? అంతలా అరిచావు .. నేనొచ్చే సరికి కింద పడున్నావు .. అన్నాడు రత్నం ..
అదీ రాజు గారూ .. అని ఏం చెప్పాలి ... అని కొన్ని సెకెన్లు మనసులో తర్జన భర్జన పడి .. అదీ రాజు గారు ..
ఎలక .. ఎలక .. నా మీదికి దూకింది .. భయం తో గట్టిగా అరచేసాను .. అంది తడబడుతూ రచన ..
ఫక్కున నవ్వాడు రత్నం ..
అవునా ? నీకు ఎలక అంటే అంత భయమా .. ? మూర్చ పోయి నంతలా .. అని తెరలు తెరలు గా నవ్వాడు రత్నం .
ఆమె ఇబ్బందిగా నవ్వి .. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నట్లు ఉన్నాను .. ఐ ఆమ్ సారీ .. అంది రచన .. నొచ్చుకుంటూ .
అయ్యో .. అదేo లేదు గానీ .. సరే .. నువ్వు హాయిగా పడుకో .. వెంగమ్మ భోజనం పైకే తెస్తుంది .. భోజనం చేసి
పడుకో .. సరేనా ? అన్నాడు ఆప్యాయం గా రత్నం ..
థాంక్స్ రాజు గారూ .. అంది రచన .
చిన్నగా నవ్వి .. వెంగమ్మా .. పద .. అని బయట కి నడిచాడు .. అతన్ని అనుసరిస్తూ వెంగమ్మ ఒక్కసారి వెనక్కి
తిరిగి రచన వైపు చూసింది .. ఆమె సంకోచం గా తూర్పు వైపు కిటికీ వంక చూడటం గమనించి .. వెటకారం గా
నవ్వుకుంది వెంగమ్మ ..
వాళ్ళిద్దరూ వెళ్ళాక గబగబా మంచం మీద నుంచి లేచి కంగారు గా కిటికీ దగ్గరకి ఒక్క అంగ లో వెళ్లి కిటికీ ని
పరీక్ష గా చూసింది రచన ..
ఏంటి ? అంతా ఎప్పటిలానే ఉంది .. అది నా భ్రమ కాదు కదా .. నో .. కాదు నా కళ్ళు నన్ను మోసం చేయవు ..
ఈ సంఘటన వెనుక ఏదో ఉంది .. నేను మహల్ కి వెళ్ళాలి .. స్వామీజీ ఇచ్చిన తాయెత్తు నాదగ్గర ఉంది .. ఆ
వైజయంతి మాయలు నన్నేం చేయగలవు ? నేను సమయం వృధా చేసేస్తున్నాను .. ఇలా కాదు .. కాకూడదు ..
సాధ్యమైనంత తొందరగా నేను నా లక్ష్యాన్ని చేరుకోవాలి .. అని మనసులో ధృడo గా అనుకుంది రచన .
హాల్ లో వెంగమ్మ తో .. చూడు వెంగమ్మ .. ధాత్రి ఏవిదం గానూ ఇబ్బంది పడటం నాకిష్టం లేదు .. ఇంట్లో ఒక్క
ఎలక కూడా కనబడ కూడదు
.. మరోసారి
ధాత్రి
కి ఈ పరిస్థితి రాకూడదు
.. అని చెప్పాడు రత్నం
రాజు
..
వెంగమ్మ మౌనం గా సరే నంటూ తల ఊపింది
(ఇంకా ఉంది )
No comments:
Post a comment