నిద్ర పట్టక అటూ ఇటూ దొరలు తున్న యశ్వంత్ ని చూసి యష్ .. నిద్ర రావట్లేదా ? అని అడిగాడు శివ ..
లేదు శివా .. ఈ కరెంటు ఎప్పుడొస్తుందో .. ఈ వూళ్ళో కరెంట్ ఉన్న సమయమే తక్కువ .. రాత్రుళ్ళు తీసేస్తే ఇంకా
నిద్రేముంటుంది .. అని లేచి కూర్చున్నాడు యశ్వంత్ ..
అవును .. మనం తెచ్చిన బుక్ చదువుదా మన్న ఈ చీకట్లో చదవడం కుదరదు .. అన్నాడు శివ ..
ఇంత చీకట్లో ఈ సత్య కి ,మురారికి నిద్రెలా పట్టిందో .. కదా .. అంటూ లేచి శివా .. రచన దగ్గరకి వేల్లోస్తాను ..
అన్నాడు యశ్వంత్ ..
ఇప్పుడా ? టైం 10 అయింది .. అన్నాడు శివ కంగారుగా ..
అవుననుకో .. నాకు తెలసి తానింకా నిద్రపోయుండదు .. ఓసారి వేల్లోస్తాను .. అన్నాడు యశ్వంత్ ..
సరే .. మరి త్వరగా వచ్చెయ్ .. అన్నాడు శివ ..
హ .. అని 10 సెకన్లలో గుమ్మం దాటి చీకట్లో కల్సి పోయాడు యశ్వంత్ ..
బంగ్లా దగ్గరకి వచ్చి రచన కిటికీ కి కట్టిన తాడు ని అందుకొని పైకి ఎగ బాకాడు .. కిటికీ రెక్కని అందుకొని .. లోపలికి
తొంగి చూసాడు .. రచన ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద కుర్చుని ఉంది .. బెడ్ పక్క టేబుల్ పైన టార్చ్ వెలుగుతూ
ఉంది ..
ఇంతలో తలుపు తట్టిన సౌండ్ వినబడి యశ్వంత్ .. తల ని కిందికి దించి పక్కకి నక్కాడు ..
వెళ్లి తలుపు తీసింది రచన .
వెంగమ్మ ఓ కొవ్వొత్తి తో పాటు నిలుచుంది ..
నువ్వింకా నిద్రపోలేదా .. అని ఈవిడ సమాధానం చెప్పదుగా .. అని మనసులో అనుకొని .. ఆమె చేతిలో ని
కొవ్వొత్తి ని అందుకుని .. థాంక్స్ అంది రచన .. వెంగమ్మ మౌనం గా వెనుదిరిగి వెళ్ళిపోయింది .. కొవ్వొత్తి టేబుల్
మీద పెట్టి తలుపు ఘడియ వేసింది రచన .
తలుపు వేసిన శబ్దం వినగానే కిటికీ లోపలికి మళ్ళి తొంగి చూసాడు యశ్వంత్ .. రచన ఒక్కతే ఉందని నిర్థారించు
కున్నాక మెల్లిగా కిటికీ ఎక్కి లోపలికి దూకాడు ..
శబ్దం విని అటువైపు చూసిన రచన .. యష్ .. నువ్వా .. అంది ఆశ్చర్యం గా ..
ఆమె వైపు చిరునవ్వు తో చూసి ఆమె ని సమీపించాడు ..
ఏంటి ఇలా వచ్చావు ? అన్నదామె చిరునవ్వు తో ..
ఎందుకో నిన్ను చూడాలని పించింది .. వచ్చేసాను అన్నాడు యశ్వంత్ ..
ఆమె చిన్నగా నవ్వి .. థాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ .. అని కిటికీ కి తగిలించిన గిఫ్ట్ వైపు చూసింది ..
ఆమె చూసిన వైపు చూసి .. ఆర్ యు హ్యాపీ అన్నాడు యశ్వంత్ ..
యష్ .. ఐ అమ్ వేరి హ్యాపీ కానీ .. మనసు ప్రశాంతం గా లేదు అంది రచన .
ఏమయింది రా ? అని అడిగాడు యశ్వంత్ ..
ముందు నువ్విలా కూర్చో .. అని బెడ్ మీద కూర్చుంది రచన .. అతడు కూర్చున్నాక ..
అలా ఎదురుగా చూడు యశ్వంత్ .. అని తూర్పు కిటికీ వైపు చూపించింది రచన ..
అతడు అటువైపు చూసి .. ఆ కిటికీ ని ఎందుకలా మేకులు కొట్టి మరీ క్లోజ్ చేసారు ? అని అడిగాడు యశ్వంత్ ..
కాసేపటి క్రితం ఏం జరిగిందో తెలుసా ? అని జరిగినదంతా చెప్పింది రచన ..
అంతా విని .. కంగారుగా .. నౌ ఆర్ యు ఓకే ? అన్నాడు యశ్వంత్ ..
నేను ఓకే యష్ .. కానీ నాకు ఓ సారి మహల్ కి వెళ్ళాలని ఉంది .. నువ్వు నాతో వస్తావా ? అని అడిగింది రచన ..
లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ ..
అతని వైపు సంతృప్తి గా చూసి .. థాంక్స్ యష్ .. ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వస్తాను .. అని బెడ్ మీంచి లేచి కప్
బోర్డు లో డ్రెస్ తీసుకుని బాత్ రూం లోకి వెళ్ళింది రచన ..
ఈలోపు మంచం మీద నించి లేచి రచన చెప్పిన కిటికీ దగ్గరకి వెళ్లి పరీక్ష గ చూసాడు యశ్వంత్ ..
"అస్సలు రచన చెప్పింది జరగ డానికి అవకాశమే లేనట్టుంది .. కానీ తన మాట ని కొట్టి పారేయలేను .. ఇలా
ఎందుకు జరిగి ఉంటుంది ? ఎందుకైనా సరే .. రచన తో ఓసారి మహల్ కి వెళ్ళడం మంచిదే .. విధాత్రి ని కలిసే
అవకాశం కలగొచ్చేమో .. ఆమె మాత్రమె చెప్పగలదు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు .. "అని యశ్వంత్ తనలో తానె

యష్ నేను రెడీ .. అన్న రచన మాటలు వినబడి వెనక్కి తిరిగి చూసాడు యశ్వంత్ ..
యష్ .. వెళదామా .. రాత్రంతా కరెంటు ఉండదు .. మనల్ని ఎవరూ గమనించరు ..
అంది రచన ..
సరే అని కిటికీ వైపు నడిచాడు యశ్వంత్ .
ఇద్దరూ కిటికీ గుండా కిందికి దిగారు ..
యష్ .. పద .. అంది రచన .
రచనా .. మన సైకిల్ లు ఉన్నాయిగా .. నేను తీసుకొస్తాను .. నువ్వు ఇంటి బయట ఉండు .. అని యశ్వంత్ వాళ్ళు
ఉండే ఇంటి వైపు నడిచాడు .. శివ కూడా మెల్లిగా నిద్రపోవడం తో యష్ రాకని గమనించలేదు ..
మెల్లిగా రెండు సైకిల్ లను బయటకి తెచ్చి తలుపు వేసాడు యశ్వంత్ ..
ఇద్దరూ చెరో సైకిల్ తీసుకుని రాణి మహల్ వైపు సాగిపోయారు .
(ఇంకా ఉంది )
No comments:
Post a comment