ఊరంతా చీకటిగా ఉంది .. కొన్ని ఇళ్ళల్లో కిరోసిన్ లాంతర్ల చిన్న పాటి వెలుగు .. మహల్ కి వెళ్ళే రూట్ అలవాటై
పోవడం వల్ల త్వరగానే చేరుకున్నారు ఇద్దరూ. సైకిల్ లు పక్కన పెట్టి గేటు తీసుకుని లోపలికి నడిచారు టార్చ్ లైట్
సహాయం తో ,,
రచనా .. ఇంతకీ ఈరోజు మహల్ రావటం వెనుక నీ ఉద్దేశ్య మేంటి ? ముందుకి నడుస్తూనే అడిగాడు యశ్వంత్ ..
యష్ .. ఈ మహల్ లో ఒక ఆలయం ఉంది .. అమ్మవారి ఆలయం .. కానీ ఆ ఆలయం ఎక్కడ ఉందో ఏమో నాకూ
తెలీదు .. అంది రచన ..
ఒక్కసారి ముందుకి వెళ్తున్నవాడల్లా ఆగి .. ఈ మహల్లో ఆలయం ఉందని నీకు ఎలా తెలుసు రచనా ? అని
అడిగాడు యశ్వంత్ ..
అదీ .. యష్ .. నాకు బసవరాజు చెప్పాడు .. ఆలయం లో దీపాలు వెలిగిస్తే ఈ మహల్లో ఉన్న క్షుద్ర శక్తి మహల్ ని
వీడి పోతుందని .. అంది రచన ..
ఓహ్ .. బహుసా విధాత్రి కూడా ఈ విషయం కోసమే నాకు ఆరోజు చెప్పి ఉంటుంది .. కానీ వినడానికి ఇంత సింపుల్
గా ఉన్న ఈ విషయం చేతల్లో కష్టం కావొచ్చు .. ఐనా మహల్లో ఆలయం ఉండటమే విచిత్రం గా తోస్తుంది .. అని
మనసులో అనుకుంటూనే ముందుకి కదిలాడు యశ్వంత్ ..
సింహద్వారాన్ని చేరుకొని తాళం తీయ బోతుండగా .. కాలి కి వెచ్చగా ఏదో తగిలి నట్లని పించి .. ఇద్దరు కిందకి
చూశారు ... టార్చ్ వెలుగులో చిక్కటి రక్తం .. తలుపు కింద నుంచి ప్రవహిస్తుంది ..
యష్ .. బ్లడ్ .. అని చెంగున పక్కకి దూకింది రచన ..
సందేహం లేదు రచనా .. ఇక్కడే బ్లడ్ మనకి కనిపించింది అంటే .. లోపల వైజయంతి మనకోసం కాచుకుని ఉంది .
అన్నాడు యశ్వంత్ .
ఎందుకో ఆమాట వినగానే గుండె ఝల్లు మంది రచన కి ..
యష్ .. అంది వణుకుతున్న కంఠం తో ...
ఎస్ .. నిన్ను రప్పించ డానికే ఇదంతా .. ఏం చేస్తే నువ్వోస్తావో తనకి తెలుసు .. అన్నాడు యశ్వంత్ .
యష్ ... నీ మాటలు .. నాకు ఆశ్చర్యం గా ఉన్నాయి .. అంది రచన .
రచనా .. నువ్వు నాతో చెప్పక పోయినా నాకు కొన్ని విషయాలు తెలుసు .. వాటి కోసం మనం తరువాత మాట్లాడు
కుందాం .. ప్రాణాలకి తెగించి నువ్విక్కడికి వచ్చావు .. నీకోసం నేను ప్రాణాల నయినా ఇస్తాను .. నిర్ణయం తీసుకో ..
లోపలకి వేళ్తున్నామా ? అని అడిగాడు యశ్వంత్ ..
ఆమె మౌనం గా తాళం తీసింది .. తలుపుల్ని తీయగానే లోపల్నుంచి కలప తో చేసిన ఓ టేబుల్ వీరి మీదకి ఎవరో
విసిరినట్టు రాసాగింది ..
యశ్వంత్ చురుగ్గా స్పందించి రచన ని పక్కకి లాగాడు .. విసురుగా వచ్చి కింద పడింది రచన ..
టేబుల్ మెట్ల మీదుగా దొరలు కుంటూ కింద పడింది ..
రచనా .. అంటూ ఆమె కి చేయి నిచ్చి లేపాడు యశ్వంత్ ... మెల్లిగా లేచి నిలబడింది రచన ..
ఆర్ యు ఓకే ? అని అడిగాడు యశ్వంత్ ..
యష్ .. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే .. నేను ఈ మహల్ ని హస్తగతం చేసుకోవాల్సిందే .. అర్థం చేసుకో .. నాది
స్వార్థం కాదు .. ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర .. ఆ చీకట్లోనూ తళుక్కున మెరసింది ..
అతను చిన్నగా నవ్వి .. నేను నిన్ను స్వార్థ పరురాలివని ఎప్పుడన్నా అన్నానా ? నువ్వు చేసే ప్రతి పనీ న్యాయ
పర మైనదే అని నాకూ తెలుసు .. ఆలస్యం చేయొద్దు పద .. మానసిక స్థైర్యం తో అడుగు ముందుకి వేద్దాం ..
ఆ వైజయంతి ఇంకేం చెయగలదొ చూద్దాం ... అన్నాడు స్థిరం గా యశ్వంత్ .
యష్ .. థాంక్ యు .. పద .. అని అతణ్ణి అనుసరించింది ఆమె .
ఇద్దరూ మెల్లిగా లోపలికి అడుగు పెట్టారు .. యశ్వంత్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ..
మొత్తం మహల్ లో ఉన్న హాల్ నంతటినీ పరికించి చూశారు .. ఇంతలో .. మేడ మీద ఉన్న గదిలోంచి ఏవేవో
శబ్దాలు వినబడ సాగాయి ..
రచనా .. ఆ శబ్దాలు .. విన వస్తున్న గదే వైజయంతి ది .. ఆమె మనల్ని అక్కడకి రప్పించ టానికి ప్రయత్నిస్తుంది
మనం అక్కడికి తప్ప ఇంకెక్కడి కయినా వెళదాం .. అన్నాడు యశ్వంత్ ..
వారు నడుస్తున్న చోటంతా నెత్తుటి మయం .. కానీ అదేo పట్టించు కోకుండా తన జేబులో ఉన్న దిక్సూచి ని
బయటికి తీసింది రచన ..
ఏంటి రచనా అది ? అడిగాడు యశ్వంత్ ...
యష్ .. అన్ని దిక్సూచి లాంటిది కాదు .. ఇది నేల పై పెడితే అది చుట్టూ తిరుగుతూ ఒక దిక్కుని చూపిస్తూ ఆగి
పోతుo ది అట .. ఇది సూచించే దిక్కు లోనే ఆ ఆలయం ఉంటుందని నాన్నగారు తన డైరీ లో వ్రాసు కున్నారు ..
అంది రచన ..
సరే .. పెట్టి చూడు .. అన్నాడు యశ్వంత్ .
ఇద్దరూ మోకాళ్ళ మీద కింద కూర్చున్నారు .. రచన ఆ దిక్సూచి ని కళ్ళకి అద్దు కొని కిందన పెట్టగానే కింద ఉన్న
నెత్తురంతా మాయ మయింది .. రచన ,యశ్వంత్ లిద్దరూ సంతోషం ,ఆశ్చర్యం తో ఒకరి మొహాలొకరు చూసు
కున్నారు .. దిక్సూచి కింద పెట్టిన నిమిషం తర్వాత అది విచిత్రం గా తిరగటం మొదలు పెట్టింది .. ఇద్దరూ ఉత్కంట
దాని వైపు చూస్తున్నారు .. వారిని ఓ భయంకర మైన కన్ను ఆకలిగా కోపంగా చూస్తున్న విషయం వారు
గమనించే స్థితి లో లేరు .
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment