Powered By Blogger

Tuesday, 11 February 2014

రుధిర సౌధం 72

ఆ ప్రేతం భయంకరం గా గర్జించింది . తుళ్ళి పడి చూసాడు యశ్వంత్ . రచన మాత్రం తొణకలేదు . బెనకలేదు .. 

కొంపదీసి రచన లో విధాత్రి లేదు కదా .. అని రచన వంక పరీక్ష గా చూస్తున్నాడు యశ్వంత్ .. 

లెట్స్ గో యశ్వంత్ .. అంది రచన .. యశ్వంత్ చేతిని పట్టుకుంటూ .. 

ఐతే ఈమె రచన .. విధాత్రి కాదు అనుకున్నాడు యశ్వంత్ . 

కానీ రచన అడుగు ముందుకి వేయగానే .. ఆ హాలు లో ఉన్న వస్తువులన్నీ ఎగురుకుంటూ వీరి వైపు దూసుకు 

రాసాగాయి .. వాటిని తప్పించుకొనే ప్రయత్నం లో యశ్వంత్ ఓ పక్క రచన ఓ పక్క ఎగిరి పడ్డారు .. 

యిద్దరూ చెరో వైపు పడ్డారు .. ఆ ప్రేతం భయంకరం గా నవ్వింది .. ఆ నవ్వు కర్ణ కఠోరం గా ఉంది .. 

యష్ .. నా దగ్గరికి రా .. కింద పడిన రచన లేవడానికి ప్రయత్నిస్తూ అంది .. 

యశ్వంత్ లేచి నిలబడటానికి ప్రయత్నించే లోపు ఒక్కసారిగా గాలిలో విసురుగా గుమ్మం తలుపుల్ని నెట్టుకుంటూ 

బయటకి  వెళ్లి పడ్డాడు .. యశ్వంత్ బయటకి విసిరి వేయబడగానే సింహద్వారం మరలా మూసుకు పోయింది .. 

అంత గట్టిగా కింద పడటం తో మోకాళ్ళు ,మోజేతులు గీరుకు పోయాయి .. పైకి లేవడానికి ఇబ్బంది పడ్డాడు యష్ . 

ఐన విశ్వప్రయత్నం చేసి లేచాడు .." రచనా .. లోపల ఒక్కతే ఉండి పోయింది .. ఎలా అని లేని బలాన్ని తెచ్చుకుని 

సింహద్వారం దగ్గరకి పరుగున వెళ్లి తలుపు నెట్టడానికి ప్రయత్నించాడు . కానీ తలుపులు తెరవబడ లేదు .. 

ఓహ్ గాడ్ .. రచన ని ఒంటరిని చేయడానికి ఆ ప్రేతం నన్ను బయటికి పంపేసింది .. రచన మానసిక స్థైర్యాన్ని దెబ్బ 

తీయడానికి ప్రయత్నిస్తుంది .. రచన బలహీన పడే లోపు నేను ఎలాగైనా వెళ్ళాలి .. భవనం వెనుక వైపు కి పరుగు 


తీసాడు యశ్వంత్ . 

కానీ యశ్వంత్ కి లోపలకి వెళ్ళే మార్గం కనబడ లేదు .. ఎలా ఇప్పుడు ? అని మధన పడుతున్న యశ్వంత్ కి 

విధాత్రి గుర్తుకు వచ్చింది . రాకుమారీ .. ఎక్కడున్నారు ? విధాత్రీ ... గట్టిగా అరిచాడు యశ్వంత్ ... 

ఇంతలో అతని వెనుకవైపు ఏదో సవ్వడి వినిపించి వెనక్కి తిరిగాడు .. 

అతని కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి .. అక్కడ కారిడార్ లో నేల పైన ఓ కాంతి చిన్నగా ఉద్భవించి అది దట్ట 

మయిన కాంతి పుంజం గా మారి అతని వైపు వచ్చి నట్టే వచ్చి మూసి ఉన్న తలుపుల లోపలికి చొచ్చుకు 


పోయింది ... 

"ఆ కాంతి .. తను ఖచ్చితం గా విధాత్రే .. ఆ కాంతి మహల్ లోపలికి వెళ్ళింది .. విధాత్రి రచన శరీరం లోనికి తప్పక 

వెళుతుంది .. " యశ్వంత్ .. ఆ ఆలోచన లో ఉండగానే మహల్ వెనుక భాగం తలుపులు భళ్ళున  తెరచు 

కున్నాయి.. 

మహల్ వెనుక భాగం తలుపు కూడా తెరచుకుందే .. అని ఉద్వేగం తో మహల్లొనికి ప్రవేశించాడు యశ్వంత్ . 

మహల్ అంతా పురాతనం గా లేదు .. కొత్త వెలుగు సంతరించు కుంది .. అతడు ఆశ్చర్యం గా చూస్తూనే హాల్ లోనికి 

ప్రవేశించాడు .. అక్కడ అంతవరకూ భీబత్సం చేసిన వైజయంతి లేదు .. కానీ కాంతులు చిమ్ముతూ ఓ స్త్రీ రూపం 

రా యశ్వంత్ .. అని ఆప్యాయం గా ఆహ్వానించింది .. 

రాకుమారీ .. అన్నాడు యశ్వంత్ .. సంతోషం గా .. 

అంత నమ్మకం తో పిలిచాక రాకుండా ఎలా ఉండగలను ? అంది ఆమె ముగ్ధ మనోహరం గా నవ్వుతూ .. 

రచన ... అని ఆగిపోయాడు యశ్వంత్ .. 

తనకేం కాలేదు .. తన శరీరము నే కదా నే ధరించినది .. అంది విధాత్రి . 

రాకుమారీ నేను మీతో చాలా మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ 

నీ అనుమానాలు నాకు తెలుసు యశ్వంత్ .. ముందుగా మీరిరువురు వైష్ణవీ మాత ఆలయం పై దృష్టి పెట్టండి .. 

ఆలయం లో దీప కాంతులే ఈ మహల్ లో సంతోష కాంతులను నింపుతాయి అంది విధాత్రి .. 

ఆ ఆలయం ఎక్కడుంది ? అడిగాడు యశ్వంత్ . 

(ఇంకా ఉంది )  

No comments: