Powered By Blogger

Wednesday, 12 February 2014

రుధిర సౌధం 73

ఆ ఆలయం ప్రవేశ రహితమై ఉంది యశ్వంత్ .. కానీ మీరు ప్రవేశానికి ప్రయత్నించవలసి ఉంది . నేను మీకు

ఆలయం జాడ తెలుసు కోవడానికి కొన్ని సూచనలు మాత్రమే ఇవ్వదలిచాను . ఆలయం ఈ మహల్ ప్రాంగణ

మందే ఉన్నది .. సింహద్వారానికి సరిగ్గా దక్షిణం లో .. ఆలయాన్ని జల దేవత సంరక్షిస్తున్నది .. ఆలయ

ప్రవేశానికి ప్రయత్నించేవారు అర్హులైతే ఆమె అనుమతి ఇస్తుంది . ఆ అర్హత రచన కి ఉన్నది . ఆమె కి తోడువైన

నీకూ అనుమతి లభించ వచ్చు .. కానీ మీకు ఆలయం జాడ అయితే తెలియవచ్చు గానీ .. ఆలయ ద్వారం

మాత్రము వైష్ణవీ మాత యే స్వయం గా మూసి వేసి ఉన్నందున ఆమె అనుమతి తప్పక కావలెను . ఆలయ

ద్వారం లోపల నుండి మూసి వెయ బడింది . కావున మహల్ ప్రాంగణ మందున ఆలయం జాడ మీరు తెలుసు

కున్నా ఆలయ ప్రవేశం మాత్రం మీకు వీలు కాదు . అన్నది విధాత్రి మీనాల్లాంటి తన కళ్ళని తిప్పుతూ ..మరి రాకుమారీ .. ఆలయ ద్వారం తెరవటం ఎలా ? ఉత్సుకతగా అడిగాడు యశ్వంత్ .

సందేహం వలదు యువకుడా .. మనసు తో ఆలోచించి చూసిన యెడల మార్గం దొరకక పోవునా ? సమయం

తానంతట అదే దారి చూపును . అంది విధాత్రి .

కానీ ... ఈ మార్గం లేకపోతె ఇంకో మార్గం ఉండాలి కదా .. అన్నాడు యశ్వంత్ .

ప్రతీ సమస్య కి పరిష్కారం ఉన్నట్లే ఒక దారి మూసుకు పొతే ఇంకో దారి తెరచే ఉంటుంది .. ప్రయత్నం అవసరం .

అంది విధాత్రి .

ఆ ఇంకో దారి ఎక్కడ ఉంది ? అన్నాడు యశ్వంత్ చురుగ్గా ..

ఆమె మనోహరం గా నవ్వింది ..

ఈ గ్రామానికి పశ్చిమ దిశలో ఒక కొలను ఉంది .. ఆ కొలను లో నే మార్గం ఉంది .. అన్వేషించండి .. అంది విధాత్రి .

రాకుమారీ .. ఎంతో సహాయం చేసారు .. ఇంకొక్క మాట .. రాముడి గురించి అడగాలి .. అని యశ్వంత్ అనే లోపు

తెలిసిన విషయాల గురించి మళ్ళి తెలుసుకోవటం అనవసరం .. శతృత్వం సాలె గూడు లా అల్లుకోక మునుపే

రాబోయే పౌర్ణమి కి ఆలయం జాడ తెలుసు కోండి .. మళ్ళి వచ్చే పౌర్ణమి ఆలయం లో సహస్ర హోమాలతో

ప్రజ్వరిల్లాలి .. ఇది గనుక ఇప్పుడు జరగక పొతే మరో 60 ఏళ్ళ వరకూ ఆలయం జాడ తెలిసే శుభ ముహూర్తం

రాబోదు .. సమయం లేదు .. మార్గాన్వేషణ గావించి రచన చే ఈ ఉత్తమ కార్యం జరిపించాలి .. దీని కోసమే

కొన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాను .. ఆలయం తిరిగి తెరవబడితే .. అటు వైజయంతి కి ,నాకూ .. ఈ మహల్

లో కొన్నేళ్ళుగా అకాల మరణాలు పొందిన వారికి ముక్తి లభిస్తుంది . అంది విధాత్రి .

అలాగే రాకుమారీ .. సాధ్యా సాధ్యాలని మరచి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను .. ఇంత మంచి పని లో నాకు

భాగస్వామ్యం కల్పించినందుకు .. మీకెంతగానో ఋణ పడిపోయాను .. అన్నాడు యశ్వంత్ ..

ఇప్పుడు రచన నుండి నేను వేరై పోతాను .. ఇక సెలవు అంది రాకుమారి ..

ఓ క్షణం రచన శరీరం నుండి ఓ కాంతి వెళ్ళిపోయింది .

ఆమె తోట కూర కాడలా కింద పడిపోయింది .

రచనా .. రచనా .. అని ఆమె ని తట్టి లేపాడు యశ్వంత్ .

యష్ ..  ఏమయింది నాకు మగత గా అడిగింది ఆమె ..

ముందు లే .. అనగానే దిగ్గున లేచి .. మనం మహల్లో ఉన్నాం కదూ .. నీకేం కాలేదు కదా .. అంది కంగారుగా ..

అన్నీ తరువాత మాట్లాడుకుందాం .. ముందు నాతొ రా .. అని ఆమె చేయి పట్టుకొని భవనం వెనుక వైపు కి

వెళ్ళాడు యశ్వంత్ .. చుట్టు పరికించి చూస్తే ఎండిపోయిన మడుగు కనబడింది .

అతడు దానివైపు పరీక్ష గా చూసాడు .. ఎందుకో ఓ క్షణం అది నిండుగా నీరు తో ఉన్నట్లు కనబడింది యశ్వంత్ కి .

(ఇంకా ఉంది )


2 comments:

subbarao said...

nice post ...
this is my blog
http://ourtechworld.weebly.com/

రాధిక said...

thank you subbarao garu