విధాత్రి తో నీ రూపం సరిగ్గా సరిపోతుంది .. ఆమె ఈ మహల్ లో కొన్నేళ్లుగా ఒక గాజు జాడీ లో బందీ గా ఉంది ..
ఆరోజు .. అమావాస్య రోజు .. నువ్వే అనుకోకుండా ఆ జాడీ ని బద్దలు గొట్టి ఆమెకి విముక్తిని ప్రసాదించావని ఆమె
నాకు చెప్పింది . అన్నాడు యశ్వంత్
అంటే ఆరోజు ఆ చీకటి కొట్టు లోంచి నేను బయట పడటానికి ప్రయత్నించి నపుడు ఒక జాడీ పగిలి పోయింది ..
నువ్వు ఆ జాడీ కోసం చెప్పటం లేదు కదా .. అంది రచన .
అయ్యుండొచ్చు రచనా .. అంతే కాదు నేను వైజయంతి ని కూడా అతి సమీపం గా చూసాను .. ఆమె నన్ను
హతమార్చ డానికి ప్రయత్నించింది .. కానీ ఆరోజు నన్ను విధాత్రి కాపాడింది .. అప్పుడే నేను విధాత్రి ని చూసాను .
అన్నాడు యశ్వంత్ .
విధాత్రి ని ఎవరు అలా బంధించి ఉండుంటారు ? వైజయంతి ఎందుకిలా మారిందో .. అసలప్పుడు ఏం జరిగిందో ..
అంది రచన .
అప్పుడేం జరిగిందో విధాత్రి తప్పని సరిగా చెబుతుంది . మనమిప్పుడు చేయాల్సిన దల్లా ఆలయం ఎక్కడుందో
కనిపెట్టడం . నాకు విధాత్రి కొన్ని క్లూస్ ఇచ్చింది .. వాటి సహాయం తో మనం ఆలయం కోసం కనుక్కుందాం ..
కానీ మన వాళ్లతో అన్ని చెప్పేద్దాం అన్నాడు యశ్వంత్ .
యష్ .. ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు నన్ను స్వార్థ పరురాలు అనుకోరా ? బేలగా అంది రచన .
లేదు రచనా .. అభ్యంతరం ఉంటె వాళ్ళు వెళ్ళిపోతారు అంతే కదా .. కానీ నాకు నమ్మకం ఉంది .. వాళ్ళు స్నేహానికి
ఎంత విలువ ఇస్తారో నీకూ తెలుసు అన్నాడు యశ్వంత్ .
సరే యశ్ .. నీ మాట మీద గౌరవం ఉంది నాకు .. అంది రచన .
సరే .. నేను చెప్పింది విను రచనా .. ఈ ఊరికి పశ్చిమాన ఉన్న చెరువు దగ్గరకి వెళ్తే మనకి ఏదన్న మార్గం దొరక
వచ్చు .. అంతే కాక ఇక్కడ ఈ ఎండి పోయిన మడుగు చూడు .. ఒక వైపు రాతి తో మూయబడి ఉంది .. నాకు
తెలసి ఈ అమరిక వెనుక ఏదో రహస్యం దాగి ఉంది .. అన్నాడు యశ్వంత్ .
నాకేం తెలియడం లేదు యశ్వంత్ .. కానీ నువ్వు చెప్పేదానిలో కొంత నిజం ఉందని పిస్తుంది .. అంది రచన .
ముందు మనం ఇంటికి వెళదాం .. మనవాళ్ళతో విషయం మొత్తం చెబుదాం .. ఇక నుంచీ ఒక్కరోజు కూడా వ్యర్థం
కాకుండా జాగ్రత్త పడదాం .. ఎందుకంటే పౌర్ణమి లోపు మనం ఆలయాన్ని కనిపెట్టి తీరాలి .. విధాత్రి చెప్పింది ..
అన్నాడు యశ్వంత్ .
అలాగే యశ్వంత్ .. మనం తెల్లవారక ముందే ఇక్కడ్నుంచి వెళ్లి తీరాలి అంది రచన .
పద రచనా .. అని ముందుకు కదిలాడు యశ్వంత్ .. అతన్ని అనుసరించింది రచన .
************************
హటాత్తుగా నిద్రలేపి ఏదో మాట్లాడాలనే సరికి బిత్తర పోయి లేచారంతా ..
యశ్వంత్ .. ఏమయింది ? ఆందోళన గా అడిగాడు శివ .
ఈ టైం లో మాట్లాడాలన్నవంటే అదెంత ముఖ్యమైనదో అర్థమయింది యశ్వంత్ చెప్పు .. అన్నాడు మురారి .
సత్య నిద్రమత్తు లో అయోమయం గా చూస్తుంది వారివంక . రచన మాత్రం మెడలో లోకెట్ ని అటుఇటు తిప్పుతూ
విషయం విన్నాక వీరెలా రియాక్ట్ అవుతారో అని ఆలోచన లో ఉంది ..
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment