Powered By Blogger

Friday, 14 February 2014

రుధిర సౌధం 76


ఫ్రెండ్స్ .. నేను .. కాదు .. అని రచన వైపు చూసి .. రచన మీతో ఒక విషయం చెబుతుంది .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. అదీ .. అని కాస్త నిట్టూర్చి సరే .. నేనే చెప్తాను .. అని అందరి వైపు ఓసారి చూసి .. నేను మీలా .. నా

డ్యూటీ చేయడానికి రాలేదు .. అంది రచన .

అంటే .. అంది సత్య నిద్రమత్తు వదిలిందేమో ..

శివ , మురారి ఆమె వైపు విచిత్రం గా చూసారు .

మీకర్థం కాలేదు .. కానీ నేను ఎదురు చూసిన అవకాశం నాకు బలేశ్వర్ గారి ద్వారా దొరికింది . నేనీ మహల్ కి

రావాలని ముందు నుంచే ఎన్నో కలలు కన్నాను .. అదిప్పుడు జరిగింది .. అంది రచన .

అంటే బలేశ్వర్ చెప్పక ముందే నీకీ మహల్ గురించి తెలుసా ? అన్నాడు శివ .

అవును శివ .. తెలుసు .. తెలియకుండా ఎలా ఉంటుంది మహల్ మాదే ఐనప్పుడు .. అంది మెల్లిగా రచన .

వ్వాట్ ? అదిరిపడ్డాడు మురారి .. సత్య మాన్ప్రడి పోయి చూసింది

ఏం మాట్లాడుతున్నావు రచనా .. ? ఆశ్చర్యం గా అడిగాడు శివ .

అవును శివా .. రచన చెప్పేది నిజం .. రచన వంశీకులదే ఈ మహల్ .. కొన్నేళ్ళ కిందట మహల్ లో జరిగిన

ఘోరాల  వల్ల  రచన వాళ్ళ తాత గారి ఫామిలీ మహల్ ని వదిలి పెట్టేసి వచ్చేసింది .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. నీకీ విషయాలన్నీ ముందే తెలుసా ? కాస్త కటువు గా అడిగాడు శివ .

నాకు గనుక ముందే తెలిసి ఉండుంటే మీకూ తెలిసి ఉండేది .. రచన నాతోనూ చెప్పలేదు .. మీతోను తను చెప్పక

పోవటానికి కారణం మీరు తనని స్వార్థ పరురాలు అనుకుంటారనే భయం తోనే .. అన్నాడు యశ్వంత్ .

అనుకోవటానికి ఏముంది .. ? అది స్వార్థ మేగా .. అంది సత్య కోపం గా ..

నువ్వాగు సత్యా .. అని .. రచన ని చూసి .. రచనా .. మాకు నీ గురించి తెలుసు .. మేమంతా నీకోసం వచ్చాం ..

కానీ నీకు మాతో చెప్పాలని పించలేదా ? అడిగాడు మురారి .

మురారి .. నేను ఆఫీసు లో ఏ ఒక్కరి సహాయం ఎందుకు తీసుకోలేదో తెలుసా ? ఆ మహల్ కోసం ప్రయత్నించి న

మా కుటుంబం లో వాళ్ళు ఎవరూ మరి తిరిగి రాలేదు . అంతా చని పోయారు .. నేను ఒంటరి గానే

ప్రయత్నించాలను కున్నను .. ప్రాణం పొతే నా ఒక్కదానిదే పోతుంది .. అంతే కాదు ఆ మహల్ లో ఉన్న బంగారం

కోసమో ఆస్తి కోసమో నేనిక్కడికి రాలేదు .. మా నాన్నగారి కోరిక తీర్చాలని వచ్చాను .. మా కుల దైవం వైష్ణవీ

మాత గుడి లో మల్లి పూజలు జరగాలని .. జరిపించాలని .. వచ్చాను . ఆ దుష్ట శక్తి ని ఈ మహల్ నుండి దూరం గా

తరిమేయాలని వచ్చాను .. ఆ తరువాత ఐన ఈ ఊరికి ,ప్రజలకి మంచి రోజులు వస్తాయి అని ఆశగా వచ్చాను ..

నేను చెబుతున్నది పూర్తిగా నిజం .. అంది కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ రచన .

రచన .. వుయ్ ఆర్ సారీ .. బాధ పడకు .. నువ్వు మాతో చెప్పలేదని బాధ అనిపించింది అంతే .. అన్నాడు మురారి .

అవును .. నీమీద మాకు నమ్మక ముంది .. మహల్ నీదే కావొచ్చు .. కానీ నీ లక్ష్యం .. మా లక్ష్యం ఒక్కటే .. లక్ష్యం

ఒకటే అయినప్పుడు కలిసి పోరాడటం లో తప్పేముంది ? అందునా మా స్నేహితురాలికి కూడా సహాయం చేయ

గలిగితే అంత కన్నా ఇంకేం కావాలి ? అన్నాడు శివ .

(ఇంకా ఉంది )No comments: