అదీ నిజమే .. కాని రచన .. మీదే ఈ మహల్ ఐనప్పుడు నీకీ మహల్ రహస్యాలు తెలియాలి కదా .. అంది సత్య .
యశ్వంత్ రచన వైపు ఆసక్తి గా చూసాడు .
నాకు పెద్దగా తెలియదు సత్య .. కానీ వైజయంతి పేరు తెలుసు ఆమె వలెనే మేమీ మహల్ ని వదిలేయాల్సి
వచ్చిందని తెలుసు . కానీ అప్పుడేం జరిగిందో మాత్రం నాకు తెలీదు .. మా పెదనాన్న గారు మహల్ ని హస్తగతం
చేసుకోవటానికి వచ్చి మరణించారు . నాన్న డైరీ లో కొన్ని విషయాలు రాసి ఉన్నాయి .. దానిని బట్టి మహల్లో
వైష్ణవీ మాత ఆలయం ఉంది .. ఆ ఆలయం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు .. ఆ ఆలయాన్ని కనుగొనడానికి
పెదనాన్న ప్రయత్నించారు కానీ ఫలితం లేదు .. ఆయన మాత్రమె ఆలయం లోనికి ప్రవేశించ గలరట .. కానీ లేరు .
ఆయన తర్వాత మళ్లి నేను .. నాకు మాత్రమే అర్హత ఉందట .. చెప్పింది రచన .
మహల్లో ఆలయమా ? మనం మహల్ అంతా తిరిగాం .. మహల్లో ఆలయం ఉన్న జాడలే లేవు .. అన్నాడు శివ .
లేదు శివ .. ఆలయం ఉంది .. ఇది మనకొక పజిల్ అనుకుందాం .. ఆలయం లో దీపాలు వెలిగితే వైజయంతి
మహల్లో నిలవలేదు .. వైజయంతి లేకపోతె భయం ఉండదు .. ఐన చెడు నెప్పుడు మంచి తోనే ఎదుర్కోవాలి కదా ..
అన్నాడు యశ్వంత్ .
బావుంది .. మన లక్ష్యం ఇప్పుడు ఆలయాన్ని వెదకాలి .. అంతే నా ? అన్నాడు మురారి .
అవును ఆలయం మహల్ కి దక్షిణ దిశ లో ఉందని నా దిక్సూచి చెబుతుంది .. అంది రచన .
కానీ ఆ టెంపుల్ లోకి వెళ్ళటం అంత సులువైన పనైతే కాదు మరి .. ఈ ఊరి కి పశ్చిమాన ఉన్న చెరువు లో
అందుకు క్లూ ఉంది మనం అక్కడికి వెళ్లి ప్రయత్నించాలి .. అన్నాడు యశ్వంత్ .
అవునా ? ఈ విషయం నువ్వెలా చెప్పగలుగుతున్నావు ? అన్నడు మురారి .
చెప్తాను .. అన్ని వివరం గా రేపు మాట్లాడుకుందాం .. రేపే మనం ఆ చెరువు దగ్గరకి వెళ్తున్నాం అన్నాడు యశ్వంత్
కానీ యష్ .. మనం రేపు సరస్వతి ని స్టేషన్ కి తీసుకువెల్దాం అనుకున్నాం .. అన్నాడు శివ .
శివ .. అదీ నిజమే .. సరే ఓ పని చేద్దాం .. రచన ,సత్య ఇద్దరూ రేపు సరస్వతి ని తీసుకు వెళతారు .. అన్నాడు యష్
సరే అని తల ఊపారు రచన .సత్య
ఐతే రేపు వీళ్ళు స్టేషన్ కి వెళ్తారు మనం ఆలయం పని మీద వెళ్తున్నాము .. అన్నాడు మురారి .
రచనా ,సత్యా స్టేషన్ దగ్గర కాస్త సిగ్నల్ వస్తుంది .. మీ మీ ఇళ్ళకి ఫోన్స్ చేసుకోండి .. ఓకే అన్నాడు యశ్వంత్
సరే యష్ అంది సత్య .
కృతజ్ఞత గా చూసింది రచన వారందరి వైపు
(ఇంకా ఉంది )

No comments:
Post a Comment