చెరువు దగ్గరకి చేరుకున్న ముగ్గురు మిత్రులు మొత్తం ఆ చెరువు సరిహద్దుల్ని చుట్టి వచ్చారు .
యశ్వంత్ .. నీకేమన్నా క్లూ దొరికిందా .. ? నాకైతే ఏదో దీనిలో దాగుందన్న ఆలోచనే రావటం లేదు అన్నాడు శివ .
లేదు శివ .. కొన్ని సార్లు మన కళ్ళు మనకి మోసం చేస్తాయి .. ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది . బోటు అర్రేంజ్
చేయమన్నాను .. చేసావా ? అన్నాడు యశ్వంత్ .
అది రెడీ గానే ఉంది .. గంటకి అద్దె పే చేస్తానని చెప్పాను అన్నాడు శివ .
వీరికి కొంచెం దూరం లో బైనాక్యులర్స్ లో చెరువు నంతటినీ పరికించి చూస్తున్న .. మురారి .. యష్ .. కం థిస్ సైడ్ .
అని అరిచాడు .
శివ , యశ్వంత్ ఇద్దరూ రెండు అంగల్లొ మురారి ని చేరుకున్నారు .
ఏంటి మురారి ? anything is there ? అని అడిగాడు యశ్వంత్ .
యశ్వంత్ ఇందులో చూడు .. చెరువు మథ్యలొ ఓ రాక్ ఉంది .. దాని మీద ఒక గుర్తు ఉంది .. త్రిశూలం గుర్తు ..
అన్నాడు మురారి .
మురారి చేతిలో ఉన్న బినాక్యులర్స్ తీసుకొని చూసాడు యశ్వంత్ .. అతని పెదవులపై చిరునవ్వు విరిసింది ..
బినక్యులర్స్ శివ కి అందించి .. మురారి .. యు డిడ్ స్ప్లెండిడ్ జాబ్ .. అని మే బి అదే క్లూ కావొచ్చు . అన్నాడు
యశ్వంత్ సంతోషం గా .
నాకూ అలానే అనిపిస్తుంది యశ్వంత్ .. మనం వెంటనే ఓ సారి ఆ రాక్ దగ్గరికి వెళ్ళటం మంచిది .. అన్నాడు శివ .
ష్యూర్ .. లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ ,శివ ఒడ్డున ఉన్న బోటు ని బలం గా నీటిలోకి తోసారు . తర్వాత ముగ్గురూ బోటు నెక్కి రాయి ఉన్న
వైపు ముందుకి సాగారు .
కాసేపట్లో వాళ్ళు ఆ రాక్ దగ్గర ఉన్నారు . రాతి పై కాస్త అస్పష్టం గా త్రిశూలం గుర్తు ని చెక్కారు కానీ ఆ త్రిశూలం
ఈశాన్యం వైపు చూపిస్తుంది .
యశ్వంత్ .. దీన్ని గీసిన విధానం చూస్తుంటే నీటిలోకి చూపిస్తుంది . మనం చెరువు లోకి దిగాల్సిందే అన్నాడు
మురారి .
శివా నువ్వు బోటు లోనే ఉండు .. అని మురారి లెట్స్ డైవ్ అన్నాడు యశ్వంత్ .
శివ చూస్తుండగానే ఇద్దరూ నీటిలోకి దూకారు .. నీటిలోపల అంతా గమనించారు . నీటి అడుగున నాచు పట్టిన
మరో రాయి కనబడింది .
యశ్వంత్ ఆ రాయి వద్దకి చేరుకున్నాడు .. మురారి ఇదే అని సైగ చేసాడు ..
ఇద్దరూ కలసి ఆ రాతిని చేరుకున్నారు . నీటి పైభాగం లో శివ ఆత్రుత గా చూస్తున్నాడు .
మురారి ఆ రాయి ని చూసి ఒక్కసారి నీటి పైభాగానికి రావటం తో యశ్వంత్ కూడా పైకి తేలాడు .
(ఇంకా ఉంది )

2 comments:
ఏమైపొయారు??
ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం చిరంజీవి గారూ ... మీ ప్రశ్న నా కు సంతోషాన్ని కలగజేసింది . నా సీరియల్ మిమ్మల్ని వేచి ఉండేలా చేసినంతగా మీకు నచ్చటం చాలా సంతోషం . కాకపొతే మాఘమాసం కదండీ .. పెళ్ళిళ్ళ హడావిడి లో పడి రుధిర సౌధం పోస్ట్ పెట్టడానికి వీలు పడలేదు ,ఎంతగా ప్రయత్నించినప్పటికీ సమయం చిక్కలేదు . ఏమయితేనేం తిరిగి రుధిర సౌధం తో మీ ముందుకు వచ్చాను కదండీ
Post a Comment