యష్ .. త్రిశూలం ఈ రాతినే చూపిస్తుంది . అన్నాడు మురారి .
ఓసారి రాతిని కదిపి చూద్దాం .. అన్నాడు యశ్వంత్ .
సరే అని నీటి అడుగుకి మల్లి చేరుకొని బరువైన ఆ రాతిని మెల్లిగా కదిపారు .. రాయి కదలలేదు .
మరోసారి ప్రయత్నించారు . రాయి కదల సాగింది .. రాయి కొంచెం స్థాణ భ్రంశం చెందగానే ఆ రాతి కిందకి నీరు
మెల్లిగా ఏదో కన్నం ఉన్నట్లు వెళ్ళసాగింది .
ఇద్దరూ కలిసి రాతిని పక్కకి బలం గా తోశారు . రాయి పక్కకి తొలగ గానే అక్కడొక రాతి పలక ఒక గోతిని కప్పి
ఉంచిన మూతలా కనబడింది . యశ్వంత్ ,మురారిలా మోహంలో సంతోషం వెల్లివిరిసింది .
ఇద్దరూ కల్సి ఆ రాతి పలక ని తొలగించారు .. అంతే రాతి పలక తొలగించగానె చెరువు లోని కొంత నీరు ఆ సొరంగ
మార్గం లోకి వెళ్ళటం ప్రారంభించింది . నీటి ఫోర్సు వలన నీతితో పాటూ యశ్వంత్ కూడా ఆ సొరంగం లోకి
చొచ్చుకుపోయాడు .
ఆ హతాత్పరినామానికి విస్తుపోయి నీటి పైభాగానికి తేలాడు మురారి .
అప్పటికే హటాత్తుగా చెరువులో నీటి మట్టం తగ్గటం గమనించిన శివ కంగారుగా.. పైకి తేలిన మురారిని చూసి
ఏం జరుగుతుంది మురారి ? అన్నాడు ఆందోళన గా .
లోపల సొరంగం ఉంది .. యష్ ఆ సొరంగం లోపలికి వెళ్ళిపోయాడు .. ఆందోళనగా అన్నాడు మురారి .
వ్వాట్ ? అరిచాడు శివ .
శివ కంగారు పడకు .. ఈ సొరంగ మార్గం గుండా మహల్ కి దారి ఉండుంటుంది . మనం త్వరగా అక్కడికి వెళ్దాం ..
నాకెందుకో యశ్వంత్ అక్కడికి చేరుతాడని పిస్తుంది అన్నాడు మురారి .
తెడ్డు ఓ చేత్తో అందుకొని రా మురారీ .. అని మురారికి చేతిని అందించాడు శివ .
ఇద్దరూ త్వరత్వరగా ఒడ్డుని చేరుకొని పడవని అక్కడే వదిలేసి ఊర్లొకి పరుగు పెట్టారు .
******************************
మెల్లిగా కళ్ళు తెరిచాడు యశ్వంత్ .
ఓ క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు అతడికి . లీలగా అతని మెదడు జరిగిన దాన్ని గుర్తు చేసింది .
ఓహ్ .. అని నిట్టూర్చి చుట్టూ చూసాడు .
అతని అనుమానం నిజమయింది . అతడు రాణి మహల్ వెనుక భాగం లో ఉన్న మడుగు లో ఉన్నాడు . మడుగు
అంతా నీటితో నిండుగా ఉంది .
అతను మెల్లిగా లేచి మడుగు లోంచి బయట కి వచ్చి మళ్ళి మడుగు వైపు ఆశ్చర్యం గా చూసాడు .
ఆ చెరువు లో నీళ్ళు సొరంగ ద్వారం తెరవగానే ఈ మడుగు లోకి చేరాయి .. ఎంత చిత్రం గా ఉంది ఇదంతా ..
ఆశ్చర్యం గా అతడు మడుగు వంక చూస్తూనే ఉన్నాడు .. కానీ మరి గుడి ద్వారం ఎక్కడుంది ? అని ఆలోచన లో
పడ్డాడు యశ్వంత్

(ఇంకా ఉంది )
No comments:
Post a Comment