అతని ఆలోచనలు ఓ కొలిక్కి రావటం లేదు . ఆలయం దారి ఎక్కడుంటుంది .. ఇలా ఆ చెరువు లోంచి సరా సరి ఈ
మడుగు లోకి రావటం వెనుక కూడా ఏదో అంతరార్థం ఉండి ఉంటుందా ? అని మడుగు వంక తీక్షణం గా చూడ
సాగాడు యశ్వంత్ .
**********************************
సత్యా .. ఫోన్ మాట్లాడటం అయిపోయిందా ? అని అడిగింది రచన .
ఆమె బుగ్గ పై ముద్దు పెట్టి .. చాలా హాప్పీ గా ఉంది రచనా .. ఎన్ని రోజులైందో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి .. అంది
సత్య .
ఇంతలో వారి దగ్గరకి వచ్చింది సరస్వతి .
సరస్వతి .. ఆఫీసర్ అడిగిన ప్రశ్న లన్నింటికి సమాధానాలు చెప్పావా ? అని అడిగింది రచన .
చెప్పాను ధాత్రమ్మ .. ఇక మనం వెల్లొచ్చన్నారు .. అంది సరస్వతి .
సరే .. అని సత్య పద .. అంది రచన .
ధాత్రమ్మా .. ఈ వూళ్ళో నాకు తెలిసినోళ్ళు ఉన్నారు . రాముడి తద్దినానికి వారిని పిలవాలే .. మీ ఇద్దరూ వెళ్ళండి ..
నేను తరువాత వస్తాను .. అంది సరస్వతి .
కానీ సరస్వతీ .. మేము నిన్ను తీసుకొచ్చాం .. మళ్ళి నిన్ను క్షేమం గా తిరిగి ఇంటి దగ్గర దిమ్పవలసిన బాధ్యత
మాదే కదా .. అంది రచన .
ఫరవాలేదమ్మా .. ఈ వూరు నాకు తెలిసినదే .. నేను వెళ్ళగలను .. అంది సరస్వతి .
ఆమె కి పని ఉందని అంటోంది కదా .. తనని విడిచి పెట్టె మనం వెళ్దాం ధాత్రీ అంది సత్య .
సరే .. నువ్వు ఊరికి వచ్చిన వెంటనే నన్ను మళ్ళి కలవాలి సరస్వతీ .. అంది రచన .
అలాగే అంది సరస్వతి .
సరే .. ఐతే .. జాగ్రత్త .. అని ఇద్దరూ వెహికల్ వైపు నడిచారు .
రచనా .. నిన్నిలా రెండు పేర్లతో పిలవటం కష్టం గా ఉంది తెలుసా .. అంది సత్య .
ఆమె చిన్నగా నవ్వి .. సత్యా .. రేపు మురారి బర్త్ డే కదూ .. అంది రచన .
హే .. నిజమే రచనా .. నీకు బాగానే గుర్తుంది .. నేనెలా మర్చి పోయాను .. అంది ఆశ్చర్యానందాలతో సత్య .
నాకు గుర్తుందిలే గానీ .. తనకోసం ఏమీ కొనవా .. ఇంతకి ముందు పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ ని అడిగాను ..
ఇక్కడ కి కొంచెం దగ్గరలో మంచి బొకే షాప్ ఉందని చెప్పాడు వెళ్దామా ? అంది రచన .
ష్యూర్ .. అంది సత్య .
వెహికల్ స్టార్ట్ చేసి నాక .. బొకే షాప్ వైపు బండి ముందుకి సాగిపోయింది .
కాసేపట్లో ఆ బోకే షాప్ ముందు కార్ ని ఆపింది రచన .
రచనా .. ఇక్కడ పూలు చాలా బావున్నాయి .. చాలా ఎక్కువగా తీసుకువెలదామ్ .. అంది కిందకి దిగి వాటి
వంక అబ్బురం గా చూస్తూ సత్య .
ఇంకా ఆలస్యమెందుకు తీసేసుకుందాం పద . అంది చిరునవ్వుతో రచన .
ఇద్దరూ కలసి ఆ షాప్ దగ్గరికి నడిచి పూలు కొనుగోలు చేయసాగారు .
సత్య పూలు సెలెక్ట్ చేస్తుంటే రచన మాత్రం ఆలోచన లో పడింది .. ఈ పాటికి యశ్వంత్ వాళ్లకి ఆలయం గురించి
ఏదన్నా క్లూ దొరికి ఉండుంటుoదా ? ఈ మహల్ గొడవలో పడి వీళ్ళెవరు తమ ఆనందాలని దూరం
చేసుకోకూడదు . రేపు మురారి పుట్టిన రోజు సంతోషం గా జరుపుకోవాలి . తనకెదన్నా గిఫ్ట్ ఇద్దామంటే దగ్గరలో
గిఫ్ట్ షాప్ కూడా లేదాయే .. అనుకుంది రచన .
ఈలోపు పూలతో వెహికల్ ని నింపేసింది సత్య .
ఆమె వైపు చూసి చిరునవ్వుతో .. షాప్ ఖాలీ చేసేసావు గా సత్యా .. అంది రచన .
ఆమె అల్లరిగా నవ్వేసింది .
ఇక రావనపురమ్ బయల్దేరదాం . అని కార్ వైపు నడిచింది రచన .
********************************
(ఇంకా ఉంది )
రుధిర సౌధం నవల ని మొదటి భాగం నుండి చదవాలనుకొంటే క్లిక్ ఆన్ naarachana.com
నా రచన వెబ్ సైట్ లో క్లిక్ ఆన్ older posts. తద్వారా మీరు మొదటి భాగం నుండి నవలని చదవగలరు .
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది.. తెలియజేయుటకి సంశయించ వద్దు . " పోస్ట్ కామెంట్" పై క్లిక్ చేసి
మీ అభిప్రాయాలని సలహాలని తెలియజేయండి . ధన్యవాదాలు
4 comments:
సమాజం ఓడించింది అన్నారు. మరి అదే సమాజంలో గెలవండి. ట్రైం చేయండి. చూద్దాం. గుర్రం ఎగురుతుంది. ట్రై చేస్తే...
endtandi around 10days gap ichesaaru.. maree ilaa wait chepisthe fans hurt avuthaamndi... :( :(
eentadni maree... 10days gap ichhesaaru.. fans hurt avuthaamandi ikkada...
అందుకు నన్ను క్షమించాలి దీపు గారు ..
ఈ నెల లో పెళ్లి వేడుకల్లో బిజీ అయిపోయి సమయం చిక్కక రుధిర సౌధం పోస్ట్ పెట్టడం వీలుపడలేదు . ఇక పై ఇలా జరగదు . మీ అభిమానానికి చాలా చాలా కృతజ్నతలు
Post a comment