Powered By Blogger

Wednesday, 12 February 2014

నా ఇష్టం

తూర్పు ని వేడెక్కించే సూరీడు రాక నాకిష్టం ..

చురుక్కు మనిపించే నును లేత ఉదయ కిరణాలు నాకిష్టం ..

గగన సీమలో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు నాకిష్టం ..

కానీ ఆ సమయం లోనే ముసుగు తన్ని నిద్ర పోవటమంటే మరీ ఇష్టం ..

నిద్ర లేపుతూ అమ్మ వేసే మొట్టికాయలు కాస్త ఇష్టం ..

భగవంతుని ముందర బామ్మ చదివే సుప్రభాతం ఇష్టం .

ఓ పక్క మేను సూర్య రశ్మి తాకుతుంటే మరో పక్క చన్నీళ్ళ స్నానం ఇష్టం ..

అమ్మ చేసే వేడి వేడి ఇడ్లీ ,కొబ్బరి పచ్చడి .. అబ్బా .. ఇంకా ఇష్టం ..

చాడీలు చెప్పే చెల్లాయి అల్లరి భరించటం నాకెంతో ఇష్టం

నాన్న చెప్పే నీతులు ఓ చెవిన వింటూ మరో చెవిన వదిలేయటం ఇష్టం .

నీతులు చెప్పాక బుగ్గ మీద ముద్దు పెట్టి నాన్న ఇచ్చే చిల్లర ఇష్టం

ఇష్టం లేకపోయినా బుద్ధి నటించి బడికి వెళ్ళటం  ఎందుకో తెలియని ఇష్టం .

తెలుగు మాస్టారి పద్యాలు వింటూ క్లాసు లో నిద్ర పోవటం ఇష్టం .

ఆయన కి కోపమొచ్చి విసిరిన డస్టర్ నాకు తగలక పొతే .. చాలా ఇష్టం .

నాన్నిచ్చిన చిల్లర తో కొనుక్కున్న పుల్ల ఐస్ .. నా కెంతో ఇష్టం ..

ఒళ్ళు అలిసేలా స్నేహితులతో ఆటల్లో మునగటం ఇష్టం ..

అలసి సొలసి ఇల్లు చేరి ఎదురు చూసే అమ్మ ని వాటేసుకోవటం ఇష్టం .

బామ్మ ఇచ్చే తాయిలం తో పాటూ కథ చెప్పమని అడగటం ఇష్టం ..

అమ్మ పెట్టె గోరుముద్దల తో కడుపు నింపుకోవటం ఇష్టం .

ఆకసాన చుక్కలెన్నో లెక్క పెట్టటం ఇష్టం ..

మబ్బు చాటు నుండి జాబిల్లి బయటకి వచ్చి నపుడల్లా చప్పట్లు కొట్టడం ఇష్టం ..

బామ్మ చెప్పే కథలు వింటూ ఆకాశాన చంద్రున్ని చూస్తూ నాన్న ఒడి లో నిదురపోవటం ఇష్టం .

ఆ తీయని బాల్యాన్ని మరల మరల నెమరు వేసుకోవటం ఎందుకనో చెప్పలేనంత ఇష్టం .


నా ఇతర పోస్ట్ లను కూడా చదవాలనుకుంటే క్లిక్ ఆన్ www.naarachana.com

9 comments:

Karthik said...

Radhika gaaroo, mee chaalaa baagunnaayi:-):-):-):-):-)

సతీష్ కొత్తూరి said...

బాల్యం సుగంధాల పరిమళాలు ఇక్కడిదాకా వచ్చాయి.
నిజమే పుల్లైస్, ఆ ఆటలు పాటలు, ప్రైమరీ స్కూల్లో చదువులు, బడి నుంచి ఇంటికి రాగానే అమ్మ చేసే
స్నాక్స్.. అబ్బ.. భలే గుర్తుచేశారు రాధిక గారు. అర్జంటుగా విజయనగరం వెళ్లిపోవాలనిపిస్తోంది. ఆ వీధుల్లో తిరిగి జ్ఞాపకాలు నెమరేసుకోవాలనుంది. చాలాచాలా థ్యాంక్స్. కొన్ని క్షణాలు నా బాల్యాన్ని మళ్లీ నాకు తిరిగిచ్చినందుకు.

రాధిక said...

సతీష్ గారూ .. పోనీ ఓసారి వెళ్లి రండి .. ఉన్న ఊరు కన్నతల్లి అంటారు కదండీ . బాల్యం ప్రతి ఒక్కరి జీవితం లోనూ తీయని జ్ఞాపకమే . ఇంకా ఎన్నో జ్ఞాపకాలు కానీ అన్నింటికీ ఇంకు సరిపోలేదండి .. ఇంకా ఏదో వెలితి గానే ఉంది ..

అయినా ఇది చదివిన వారందరికీ వారి బాల్యం గుర్తు కొస్తే అప్రయత్నం గానే పెదవులపై చిరునవ్వు విరుస్తుంది ..

మనసు ఉత్సాహం గా ఉరక లేస్తుంది .. నిజం కాదంటారా ?

రాధిక said...

సతీష్ గారూ .. పోనీ ఓసారి వెళ్లి రండి .. ఉన్న ఊరు కన్నతల్లి అంటారు కదండీ . బాల్యం ప్రతి ఒక్కరి జీవితం లోనూ తీయని జ్ఞాపకమే . ఇంకా ఎన్నో జ్ఞాపకాలు కానీ అన్నింటికీ ఇంకు సరిపోలేదండి .. ఇంకా ఏదో వెలితి గానే ఉంది ..

అయినా ఇది చదివిన వారందరికీ వారి బాల్యం గుర్తు కొస్తే అప్రయత్నం గానే పెదవులపై చిరునవ్వు విరుస్తుంది ..

మనసు ఉత్సాహం గా ఉరక లేస్తుంది .. నిజం కాదంటారా ?

రాధిక said...

ఎగిసే అలల కార్తీక్ గారు .. థాంక్స్ అండి కానీ మీ కామెంట్ లో పోస్ట్స్ అనే పదం మిస్ చేసేరేమో .. ఫర్వాలేదు .. మీ భావం నాకు అర్థమయింది లెండి

సతీష్ కొత్తూరి said...

మూడు నెలలకు ఓ సారి వెళ్తుంటా. అందరూ అక్కడే ఉన్నారు. మా ఇల్లు కూడా. ఆ ఊరుతో నాకున్న అటాచ్ మెంట్ అంతా ఇంతా కాదు. మీరు ఎప్పుడో ఓ సారి వచ్చే ఉంటారు.ముద్దుగా ఉంటుంది ఊరు. అబ్బో మీ కవిత కాదు గానండీ... ఇంతలా గుర్తుకొచ్చేసింది ఊరు. వెళ్లాలి అతి తొందరలో. మరో సారి మీకు థాంక్సండి... రాధిక గారు.

Karthik said...

Radhika gaaru,sorry. Paina commentlo "posts" ane padam miss ayindi.

రాధిక said...

మీ తప్పుని నిన్నే మన్నించెసాను కార్తీక్ గారు . టైపింగ్ తప్పులు ఎవరికైనా మామూలే కదండీ

రాధిక said...

విజయనగరం నేను చాలా సార్లు వచ్చాను సతీష్ గారూ .. విజయనగరం కంటే వైజాగ్ తో నాకు అనుబంధం ఎక్కువ . ఐనా అన్ని సార్లు ఎందుకు థాంక్స్ చెబుతారండీ ? నేనే మీకు థాంక్స్ చెప్పాలి నా కవిత మీకంతలా నచ్చినందుకు .. మీ ప్రాంతీయాభిమానం మెచ్చుకోదగ్గది సతీష్ గారూ ..