దూకే జలపాతం లా ఉరకాలని ఉంది ..
మెరిసే ఆ మేఘం లా కరగాలని ఉంది ..
వెలిగే భానుని మల్లే చీకట్లని తరమాలి ..
అరవిరిసే మల్లియ లా సువాసన పంచాలి ..
కూసే ఆ కోయిల లా తీయంగా పాడాలి ..
మురిసే ఆమని లాగా ప్రతి దిక్కు నీ పలకరించాలి ..
నీడ నిచ్చే మాదిరి ఇతరులకి సాయ పడాలి ..
ఎడారిలో ఒయాసిస్సులా దాహం తీర్చాలి ..
గలగలల సెలయేరల్లె నా పరుగులు ఉండాలి .
ప్రతిరోజూ పున్నమిలా వెన్నెల కురవాలి .
హేమంతపు తుషారం లా ప్రకృతి ఒడిలో ఒదగాలి .
సంద్రాన ఎగిసే అలలా నింగిని తాకాలి ..
చిరుగాలి తాకిన వెంటనే చిరుజల్లై మారాలి .
మెలికలు తిరిగే రహదారై గమ్యం చేర్చాలి ..
గగనం లో చుక్కల్లా మిరుమిట్లు గొలపాలి
పచ్చని ఆ పచ్చిక వలనే పాదాలను స్పృశిo చాలి ..
తలలూపే వరి పైరల్లే ఆకలి తీర్చాలి ..
పుష్పించే పూవుల్లోన అందం నే కావాలి ..
పరవశమే కలిగించే సంగీతం కావాలి ..
వణికించే చలిలోనా వెచ్చదనం నా తలపవ్వాలి .
ప్రతి ఒక్కరి సంతోషం లో నా వంతూ ఉండాలి ..
మెరిసే ఆ మేఘం లా కరగాలని ఉంది ..
వెలిగే భానుని మల్లే చీకట్లని తరమాలి ..
అరవిరిసే మల్లియ లా సువాసన పంచాలి ..
కూసే ఆ కోయిల లా తీయంగా పాడాలి ..
మురిసే ఆమని లాగా ప్రతి దిక్కు నీ పలకరించాలి ..
నీడ నిచ్చే మాదిరి ఇతరులకి సాయ పడాలి ..
ఎడారిలో ఒయాసిస్సులా దాహం తీర్చాలి ..
గలగలల సెలయేరల్లె నా పరుగులు ఉండాలి .
ప్రతిరోజూ పున్నమిలా వెన్నెల కురవాలి .
హేమంతపు తుషారం లా ప్రకృతి ఒడిలో ఒదగాలి .
సంద్రాన ఎగిసే అలలా నింగిని తాకాలి ..
చిరుగాలి తాకిన వెంటనే చిరుజల్లై మారాలి .
మెలికలు తిరిగే రహదారై గమ్యం చేర్చాలి ..
గగనం లో చుక్కల్లా మిరుమిట్లు గొలపాలి
పచ్చని ఆ పచ్చిక వలనే పాదాలను స్పృశిo చాలి ..
తలలూపే వరి పైరల్లే ఆకలి తీర్చాలి ..
పుష్పించే పూవుల్లోన అందం నే కావాలి ..
పరవశమే కలిగించే సంగీతం కావాలి ..
వణికించే చలిలోనా వెచ్చదనం నా తలపవ్వాలి .
ప్రతి ఒక్కరి సంతోషం లో నా వంతూ ఉండాలి ..
2 comments:
ఇన్ని భారీ కోరికలా. మీరు మరీనండీ. ఇవన్నీ తీరాలంటే
వామ్మో. (సరదాకి). మీ మనసు పలికే మౌనగీతాలన్నీ సరాగాలు పలకాలి. నెరవేరేవో కావో గానీ... అవన్నీ స్వచ్ఛమైన కోరికలు. చాలా మంచి ఊహకి అక్షరాలద్దారు.
నిజంగా అందరి మనసుల్లో ఉండేవే. కొందరు మాత్రమే చెప్పగలరు. బాగుంది.
సతీష్ గారు .. తప్పేముందండీ ? కోరికలని త్యజించడానికి నేను బుద్దుడిని కాను కదా .. ప్రక్రుతి లో ప్రతిదీ మనకి పరొపకారాన్ని నేర్పిస్తుంది . కాని మనం వాటినే వాడుకుని వాటినే నాగరికత పేరు తో నాశనం చేస్తున్నాం .
నిజానికి మనం కూర్చున్న కొమ్మని మనమే నరికేసుకుంటున్నాం .. అందుకే ప్రకృతి లో నన్ను అన్వయించుకొని నా చిన్ని కోరికలు ఇలా విన్నవించాను .. స్త్రీ అంటే ప్రకృతే కదండీ
Post a comment