రెండు పాదాల నడక ఒకటైనట్లు .. రెండు కన్నుల దొక చూపై నట్టు ..
రెండు తనువుల ఒక ఆత్మని మొదటి సారి చూస్తున్నా ..
నా చెంపపై కన్నీరు నీ చేయి తుడిచింది .
నా పెదవులు విచ్చుకుంటే నీ కళ్ళు మెరిసాయి .
ఒంటరి తనం నువ్వు దూరం గా ఉన్న నను చేరదు ..
ఎందుకంటే నీ తలపు నన్ను ఎప్పుడూ వీడి ఉండదు .
ఆకలిదప్పులు మరచిపోతా నీ కబుర్లు వింటూ ఉంటే ..
కాలం ఎపుడు గడిచిందో .. గమనించనైనా గమనించను నీ తోడులో ..
ఈ ప్రపంచం లో నా భద్రమైన చోటు నీ కౌగిలే ..
నీకు తప్ప మరెవరికీ స్థానం లేని నా మనసు నీ లోగిలే ..
నా పేరు అందం గా వినిపిస్తుంది నీ పిలుపులో ..
నా రూపం అపురూపం అవుతుంది నీ కనులలో ..
నా మౌనమైనా నీతో మాటాడుతూనే ఉంటుంది ..
నా ధ్యాస అంతా నీ పరిమళం ఆక్రమించింది ..
సంద్రాన్ని సైతం ఓడించగల ధైర్యం తోడైంది ..
తిరిగి తీసుకోలేని నా మనసు ని నీలో చూసి మురిసింది ..
నీ చేయి పట్టి నడిస్తే దూరం ఎంతుంటే ఏం అలుపైనా రాదుగా ..
ప్రపంచం కొత్తగా కనిపిస్తే అది ఈ ప్రేమ మహిమేగా ..
ప్రేమికులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
ప్రేమతో లోకాన్నే జయించొచ్చు . ప్రేమ కి కావలసినది సమన్వయం . ప్రేమ కోసం ఆత్మహత్య లు
చేసుకోకండి . ప్రేమ ని బ్రతికిన్చుకోవటం అంటే ఓటమి ని కూడా ధైర్యం గా ఎదుర్కోవడం .. ఎక్కడో మీకు
దక్కే ప్రేమ మ్మీకోసం ఎదురుచూస్తూoడ వచ్చు . మీ ప్రేమ మిమ్మల్ని తప్పని సరిగా చేరుకుంటుంది . అది గుర్తెరిగి
కాదన్న ప్రేమ ని బాధించటం , లేదా మీరే మీ జీవితాలని నాశనం చేసుకోవొద్దు . ప్రేమ బలవంతం గా పొందేది
కాదు .. తనకు తానుగా దక్కేది . మీ అందరికి నిజమైన ప్రేమ దక్కాలని మనసారా ఆసిస్తూ ..
రాధిక
:మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment