పల్లవించింది హృదయం నీ పాట లో ..
పరిమళించింది ఉదయం నీ మాట తో ..
పరవశించింది తనువు నీ తలపుతో ..
పులకరించింది వలపు నీ పిలుపు తో ..
మనో శిఖర ఫలకాలపై నీ ప్రేమ ఝరులు ఉప్పొంగనీ ..
జాలువారు నా కురులలో నీ తపన పూలు మరులు గొలపనీ ..
విరుల సాటి నా నవ్వు లో నీ కొంటె చూపు వికసించనీ ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
4 comments:
జాలువారు నా కురులలో నీ తపన పూలు మరులు గొలపనీ ..
ఈ లైన్ చాలా బాగా నచ్చింది. ఇంత కన్నా ప్రేమ వ్యక్తం చేయడం ఎవరితరం... బాగుంది రాధిక గారు.
ధన్యవాదాలు మీకు .. నా ప్రతి పోస్ట్ కి మీ ప్రశంస దక్కుతున్నందుకు
మీ బ్లాగు బ్లాగ్ స్పాట్ లో ఉంటే.. చాలా మంది చూసేవారేమో.
రాయటంలో మీకున్న ఉత్సాహం నచ్చిందండీ. ఈ రోజుల్లో తెలుగులో ఇంత ఓపిగ్గా... ఎవరు రాస్తున్నారు. ఏకంగా నోవెల్ రాస్తున్నారు. నా బాధంతా ఒకటే.. ఈ సీరియల్ అందరూ చూడాలని.. అంత కష్టపడి రాసింది... నో కామెంట్స్ తో వెళ్లిపోతోంది.
ధన్యవాదాలు సతీష్ గారూ ..
ఉత్సాహానికేం టన్నుల లెక్కలొనె ఉంది .. కానీ అదృష్టమే గ్రాముల లెక్కలో ఉంటుంది సతీష్ గారూ .. నేను రాసిన
నవల లలో "రుధిర సౌధం " మొదటిది కాదు .. ఇంకా ఓ రెండు ,మూడు నా పుస్తకాలలోనే ఒదిగిపోయాయి ..
చూద్దాం .. నా భావాలు , అక్షరాలూ ఎప్పుడు రెక్కలు చాచి బాహ్య ప్రపంచము ని చూస్తాయో ...
Post a comment