నిదుర రాని రాతిరి లా నిశ్శబ్దం అలముకుంటుంది ..
ఎదురు తెన్నుల రోజులా నిరాశ ఆక్రమించింది ..
నల్లమబ్బు కమ్ముకున్న నింగి ఉరుముతూ ఉంది ..
హోరుగాలి చెలరేగి రాలి పడిన పూల మౌన రోదన వినిపిస్తుంది ..
జోరు వాన ఆనకట్టల్ని తెంపి ఉధృతం గా మారి నట్లుంది ..
విశ్వమంతా నిశిలోన కలసి ఉనికి వీడి నట్లుంది ..
మాటరాని మౌనమేదో మనసుని నిలదీస్తుంది ..
ప్రళయ ఝంఝామారుతమ్ లా పెనుగాలి చుట్టు ముడుతుంది ..
వీడలేని నేస్తమల్లె బాధ వెన్ను తడుతుంది ..
వాడిపోవు ఆశ పరిమళాన్ని వెదజల్లింది ..
భావి రక్కసల్లె మారి వికృతం గా చూస్తుంది ..
నీవు లేని నేను ఒంటరి నని తెలిపింది ..
ఓడిపోయిన ప్రేమ నన్ను నానుండి దూరం చేస్తుంది .

3 comments:
ఇదేంటండీ.. ఒక్క సారిగా వేదన, విరహం, ఓటమి అంటున్నారు. మీకు తెల్సా.. వేదనాభరితమైన కవితలు రాయడం చాలా కష్టం. ఓ పట్టాన తెగవవి. బట్ మీరు చాలా తేలిగ్గా రాసేశారే. బాగుందండీ. మీరిలా రాస్తూనే ఉండండి...
సతీష్ గారూ .. కాదేదీ కవిత కి అనర్హం అన్నారు కదండీ మన సీనియర్ రచయితలు . నా దృష్టిలో ప్రేమ ఉత్తమ మైన కవితా వస్తువు .. ఆ ప్రేమలో ఓటమైనా .. గెలుపైన అది గొప్ప కవిత కి హేతువే .. మనసుని కదిలించే భావుకత అందులోనే ఉంది కదా .. అందుకే కదా" ప్రేమ ఎంత మధురం .. ప్రియురాలు అంత కటినం " అన్న హిట్ చేసాం ... "" హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం " అన్నా హిట్ చేశాం ..
అలా అని నేను ప్రేమ లో ఫెయిల్ అనుకోకండేం ... ప్రేమలో నేనైతే గెలిచాను ..
నాది ప్రేమకథే. మీలాగే గెలిచాను కూడా. ప్రేమలో అసలు ఓటమే లేదనుకోండి... ఓడినా గెలిచినట్టే. బాగుంది మీ విశ్లేషణ. నా బ్లాగ్ లో ఒక కోత్త పోస్ట పెట్టాను.. ఓ సారి లుక్కేసి ఎలా ఉందో చెప్పండి...
Post a Comment