నింగీ నేలా కలవవని .. నీరూ ,నిప్పు పొసగవని ..
రాత్రీ పవలు కలిసుండవని .. అంటూనే జతగా పలికామే ..
సాధ్యం కానిది ఉందా ఏదైనా ? మనసుంటే మార్గం కనరాదా ఎపుడైనా ...
డబ్బు కి లోకం దాసోహం అని అంటే తీరునా నీ దాహం ..
ఆకలి దప్పుల ఈ లోకానికి పరిచయం చేసావు ధన దాహం ..
అవసరం మేర కూడు గూడు అత్యాశ మేర ఆ భవంతులు ..
గగన సీమ లో కాలు ని మోపి నేల ని మరచిన సామంతులు ..
తృప్తి నీయని ఐశ్వర్యం , శాశ్వతం కానిదీ సౌందర్యం ..
అందరాని ద్రాక్షపండు ని మరచి చంద్రున్ని చూసే నైజం .
చెప్పేటందుకే నీతులు .. ఆ నీతిని కనరాని చేతలు ..
తీసెవన్ని గోతులు .. చూడలేరు వెనకున్న నూతులు ..
కాసుల కోసం కోతలు .. పదవుల ఊచ కోతలు ..
పేదవాడికి ఎదురీతలు .. ఎదురిస్తె మిగులు గుండె కోతలు ..
పక్కవాడి పై అసూయ దేనికి నీ పక్క సామర్థ్యం ఉన్నంతకి
పగవాడినైన గౌరవించ గలిగితే పగ కైనా ఉండదు స్థానం ..
నిన్ను నువ్వు మలచుకో నవ సమాజాన ఒక ఇటుక గా ..
నిన్ను నువ్వు కలుసుకో సంస్కార మున్న మనిషిగా ..
ఒక చినుకు తోనే మొదలవును వరద ..
ఒక అడుగు తో నీ పయనం మొదలవదా ..
తలచుకుంటే సాధ్య మవదా .. వెలుగు నీయదా సంకల్ప ప్రమిద

3 comments:
మీలో మంచి సామాజిక దృక్కోణం ఉందండి. నాది ఒక కాన్సెప్ట్ ఉంది. నేను చాలా మందికి చెప్తుంటాను. నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లేదు. బట్.. నీ చుట్టు ఉన్న చిన్న సమాజాన్ని బాగుచేసుకో... అందరినీ ఆ దారిలో నడిపించి.
ఎవరి చుట్టూ ఉన్న సమాజాన్ని వాళ్లు బాగుచేసుకుంటే చాలు.
ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. అవునా... అందుకు మీరన్నట్టు సంకల్పం ఉండాలి. సమాజంలో పోకడలను ఎండగడుతూనే.. ఎలా రిపేర్ చేసుకోవచ్చో కూడా మంచి సందేశం ఇచ్చారు. బాగుందండి.
మీ అభిప్రాయం తెలియ జేస్తున్నందుకు చాలా సంతోషం సతీష్ గారూ .. సమాజం కోసం ఎంత ఆలోచించినా ఏమీ చేయలేని అశక్తత కూడా ఉంది . ఇంకా మీరన్నట్టు బందుత్వమయితే ఉంది .. మనం పక్క పక్క జిల్లా ల వాళ్ళం ..
ఆంధ్రులం , భారతీయులం .. కాబట్టి బంధుత్వం .. ఉన్నట్లే .

Post a Comment