భువనైక సుందరుడు భువనేశ్వరీ వరుడు ..
ఆ చంద్ర శేఖరుడు .. చంద్రవదనకి ప్రియుడు ..
ముల్లోకములనేలు వాడు .. మూడు కన్నులు గలిగినోడు ..
శిరమున గంగ నుంచాడు .. గంగాధరుడు అయినాడు ..
తాపసి వాడు .. నిరాడంబరుడు .. అంబరం అంతా వ్యాపించి ఉన్నాడు ..
హిమ నగమునకి అల్లుడైనాడు .. గిరి తనయ వరముల మూట వాడు ..
సోమ శేఖరుడు .. ఓంకార రూపుడు .. పిణాక పాణి వాడు సర్వేశ్వరుడు ..
ఆది భిక్షువు వాడు .. జ్ఞాన దాత వాడు .. కోరిన వరముల నిచ్చువాడు ..
కైలాస శిఖరాన వెలుగు రేడు .. సతీ దేవి హృదయాన నిలుచువాడు ..
బొజ్జ గణపయ్య కి తండ్రి వాడు .. షణ్ముకునికి మురిపాలు పంచువాడు ..
అర్థ నారీశ్వరుడు .. నాగేశ్వరుడు .. వ్యాఘ్ర చర్మం ధరియించు వాడు ..
ప్రమధ గణాదీషుడు ... ఈశ్వరుడు .. నంది పూజల నొందు వాడు ..
కొలిచిన వారి కొంగు బంగారు వాడు .. సృష్టి కి మూలమగు పరమ శివుడు ..
ప్రకృతి పార్వతి ని మనువాడిన వాడు ప్రకృతి పురుషుడు మహాదేవుడు ..
హరుడు ... శుభకరుడు .. మహేశ్వరుడు .. దక్షిణ మూర్తి గా జ్ఞానం ప్రసాదించువాడు .
భీమేశ్వరుడు .. రామలింగేశ్వరుడు .. శంకరుడు .. గరళముని సేవించి నోడు ..
దీవేనలన్దించువాడు .. అభిషేక ప్రియుడు .. బిల్వ దళ పూజ కె కరునించువాడు ..
హరహర మహాదేవ .. శంభో శంకరా .. దయగొను తండ్రీ ..

6 comments:
శివరాత్రి శుభాకాంక్షలు... చేశారా జాగారం.
kotturikatalu.blogspot.in/2014/02/blog-post_22.html
చూడండి...
బావుందండీ .. కాస్త అడ్వాన్సు గా అడిగారు ఈ ప్రశ్న .
అయ్యో... చేస్తారా అనబోయి... పొరపాటున.. పోనీ ఇప్పుడు చెప్పండి.. చేశారా...
ఫరవాలేదండీ ... జాగారమయితే చేయలేదు .. ఉపవాసం కూడా .. కడుపు నిండా తిని .. కంటి నిండా నిద్రపోయి ..
మనసు నిండా ఆ పరమేశ్వరుని ధ్యానించాను .. తప్పంటారా ?
ఏం తప్పులేదు... మనసే ముఖ్యం. ఉపవాసం, జాగరణాలు కాదులెండి... ఏం లేదు... మన వైపు ఈ సెంటిమెంట్లు ఎక్కువ కదా.. అందుకే అడిగాను.
Post a comment