దినకరుడు ,శుభకరుడు .. వెలుగుల రేడు భాస్కరుడు .
దివాకరుడు .,ప్రభాకరుడు .. ప్రభావించాడు నేడు ..
సప్తాశ్వ రథా రూఢ .. సూర్య నారాయణ ..
ఏక చక్ర ధర ..ఆరోగ్య ప్రదాతా .. హిత కారక .. క్రిమి సంహారకా ..
జగము ని మేల్కొలుపు నీ ఆగమనం ..
వెలుగు లు ప్రసరించు నీ కిరణం ..
ప్రత్యక్ష దైవం నీవయ్య .. ఈ లోకం సమస్తం నీదయ్య ..
అర్కుడ నీవు .. మార్తాండు డవు .. అల్పుల మేము .. ఆధారము నీవు ..
జనార్దన .. తామర వల్లభ .. దీవెన లీయగ రావయ్యా ..
ఉదయ కిరణాలు బ్రహ్మ స్వరూపాలు .. మధ్యాహ్న కిరణాలు శివ మయాలు ..
సాయంత్ర కిరణాలు విష్ణు స్వరూపాలు .. రేయి న వెలిగే ఇన బింబ వెన్నెలలు
సంధ్యా ,ఛాయా సహిత శ్రీ సూర్య నారాయణ .. తిమిరము మాయము నీ సమక్షమ్ ..
రథ సప్తమి పర్వదినం .. బాల భానుని జన్మదినం .. జగతిని మేల్కొలుపు పుణ్య దినం ..
ఉత్తర దిక్కుకి నీ పయనం .. వేసవి కాలపు ఆరంభం .. ప్రచండ ,ఉగ్ర స్వరూప .. నీకిది యే మా అభినందనం
No comments:
Post a comment